మలయాళంలో మెగాస్టార్ కొడుకు అయినా గర్వం లేదు.. ‘ఆకాశంలో ఒక తార’ ప్రీ రిలీజ్‌లో అల్లు అర్జున్..
Allu Arjun
దుల్కర్ సల్మాన్ హీరోగా, పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న డిఫరెంట్ ఎమోషనల్ డ్రామా ‘ఆకాశంలో ఒక తార’. గీతా ఆర్ట్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాత్విక వీరవల్లి కథానాయికగా పరిచయమవుతుండగా, శ్రుతి హాసన్, రుహాని శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నా రు. 20న తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హీరో అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ నాకు దుల్కర్ గారంటే చాలా ఇష్టం. మలయాళం, తమిళం, హిందీ, తెలుగు ఇలా అన్నీ భాషల్లో అద్భుతమైన సినిమాలు చేస్తున్నారు. ‘మహానటి’, ‘సీతారామం’, ‘లక్కీ భాస్కర్’ ఇలా ఆయన విజ యాలు కొనసాగుతున్నాయి. ఆయన వెర్సటైల్ యాక్టర్. సినిమాల ఎంపిక కూడా చాలా బాగుంటుంది. కేరళలో మెగాస్టార్ మమ్ముట్టి అబ్బాయి అయినప్పటికీ చాలా హంబుల్‌గా ఉంటారు. అందరినీ కలుపుకుంటూ వెళ్తారు. అదే ఆయనకు మంచి సక్సెస్‌ను తీసుకొస్తుంది. ఆకాశంలో ఒక తార ఆయన కెరీర్‌లో మరో మైల్ స్టోన్ మూవీ అవుతుంది ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమవుతున్న సాత్వికకు ఆల్ ది బెస్ట్‌ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.హీరో దుల్కర్ సల్మాన్. డైరెక్టర్ పవన్ సాధినేని , హీరోయిన్ సాత్విక, ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, ప్రొడ్యూసర్ స్వప్న దత్, మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్, రైటర్ గుణ్ణం గంగరాజు, ప్రొడ్యూసర్ సందీప్ గున్నం, చైతు జొన్నలగడ్డ , హీరోయిన్ రుహాని శర్మ, హీరోయిన్ స్వాతిక వీరవల్లి, లిరిక్ రైటర్ శ్రీమణి పాల్గొన్నారు.