“జంట” టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్
Launch of the title and first look for "Janta"
కొణిదెల పవన్ తేజ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “జంట”. ఈ చిత్రంలో పాడని కుమార్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని వసుంధర ఆర్ట్స్ బ్యానర్ పై రాజేష్ గునిశెట్టి, వీరు యాదవ్ నిర్మిస్తున్నారు. రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఒక యూనిక్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా దర్శకుడు రాజశేఖర్ యాదవ్ రూపొందిస్తున్నారు. ఆదివారం ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ లాంఛ్
ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ రాజేష్ గునిశెట్టి మాట్లాడుతూ – ఈ సినిమా కోసం రెండేళ్లుగా వర్క్ చేసుకుంటున్నాం. మా సినిమా కంటెంట్ కు తగినట్లు అమలాపురంలోని లొకేషన్స్ యాప్ట్ అవుతాయని అనిపించి ఇక్కడికి వచ్చాం. అమలాపురం నుంచి వచ్చిన ప్రొడ్యూసర్స్ గా మా సినిమా ఇక్కడ స్థానికంగా షూటింగ్ జరుపుకోవడం సంతోషంగా ఉంది అన్నారు .
హీరోయిన్ పాడని కుమార్ మాట్లాడుతూ – ఇది నాకు ఫస్ట్ తెలుగు మూవీ. ఈ సినిమాలో అవకాశం రావడం చాలా హ్యాపీగా ఉంది. సినిమా షూట్ లో జాయిన్ అయ్యేందుకు ఆత్రుతగా వేచి చూస్తున్నా. అన్నారు.
హీరో పవన్ తేజ్ కొణిదెల మాట్లాడుతూ – మా జంట చిత్రానికి శుభాకాంక్షలు అందజేసిన పెద్దలకు థ్యాంక్స్. మా సినిమాను మొదట్లో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించాలని అనుకున్నాం. ఆంధ్రా వైపు కూడా మన సినిమాల షూటింగ్స్ జరగాలని మేమంతా డిస్కస్ చేసుకుని అమలాపురంకు షిఫ్ట్ అయ్యాం అన్నారు.ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్ – గౌరిశంకర్ వి.వి, డీవోపీ – రాహుల్ శ్రీవాస్తవ్, మ్యూజిక్ – సుభాష్ ఇషాన్, డైలాగ్ రైటర్ – నత్మిక మధు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – కె.ఎస్. రవిబాబు, ప్రొడ్యూసర్స్ – రాజేష్ గునిశెట్టి, వీరు యాదవ్.