Skip to content
వినోదం › వార్తలు

‘ఛప్రి’ టీజర్ లాంచ్

Prajapaksham 16 Nov 2026 0 నిమిషాల పఠనం వినోదం
‘ఛప్రి’ టీజర్ లాంచ్

Chapri is an upcoming multilingual feature film

‘మాంగళ్యం’, ‘పరాక్రమం’, ‘నిర్భంధం’తో అందరినీ మెప్పించిన సరోజ్ కుమార్ ప్రస్తుతం ‘ఛప్రి’ అనే చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు. ఈ మూవీకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, లిరిక్స్, ఎడిటింగ్, మ్యూజిక్, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతల్ని సరోజ్ నిర్వర్తించారు. బి ఎస్ కే మెయిన్ స్ట్రీమ్ బ్యానర్ మీద సరోజ్, ప్రమోద్ పడమటి, పృథ్వీ చౌహాన్ నిర్మించిన ఈ సినిమాలో సరోజ్‌తో పాటుగా ఐశ్వర్య బోరా, దివ్య జ్యోతి, శ్లోకా, ప్రవీన్, మోహన్ ఆర్య, జీవా బాలచందర్, ప్రియాంక సింగ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. శనివారం నాడు ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన ఈవెంట్‌లో..
సరోజ్ కుమార్ మాట్లాడుతూ ఛప్రి’ సినిమాని సమ్మర్‌లో రిలీజ్ చేయాలని అనుకున్నాం. ఫిబ్రవరిలో టీజర్ ప్లాన్ చేశాం. కానీ ఈ మగాడు సీన్‌ని ఎవరో జూనియర్ ఆర్టిస్ట్ లీక్ చేశాడు. నేను ఎంతో ట్రామాని అనుభవించాను. అందుకే టీజర్‌ను ఇంత ఫాస్ట్‌గా వదిలాం.
ఈ కథను 700 రోజులు కష్టపడి రాశాను. రివ్యూయర్లను కూడా దృష్టిలో పెట్టుకుని పటిష్టమైన స్క్రీన్ ప్లేని రాసుకున్నాను. కథకు తగ్గట్టుగా నాకు మంచి ఆర్టిస్టులు దొరికారు. ఆర్ట్ డైరెక్టర్ నాని నాకు ఎంతో సపోర్ట్ చేశారు. ప్రమోద్ అన్న నాకు అండగా నిలబడ్డారు. సమ్మర్‌లో కలుద్దాం. ఈ సినిమాతో మనమేంటో అందరికీ తెలుస్తుంది’ అని అన్నారు.ఐశ్వర్య మాట్లాడుతూ* .. ‘సరోజ్ గారితో వర్క్ చేయడం కొత్త అనుభూతిని ఇచ్చింది. అస్సాం నుంచి ఇక్కడకు వచ్చి ఇలా ‘ఛప్రి’లో నటించడం ఆనందంగా ఉంది. మా సినిమా అద్భుతంగా వచ్చింది’ అని అన్నారు.