Skip to content
తెలంగాణ › వార్తలు

ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. తెలంగాణకు రూ.30 వేల కోట్ల సాయం కోసం విజ్ఞప్తి

Krishna Rao 15 Nov 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. తెలంగాణకు రూ.30 వేల కోట్ల సాయం కోసం విజ్ఞప్తి

Telangana CM Revanth Reddy Meets PM Modi, Seeks ₹1 Lakh Crore for Hyderabad's M-6 Project

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను ఈ సందర్భంగా ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులకు ఎదురవుతున్న అడ్డంకులు, రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం వంటి అంశాలపై ప్రధానితో చర్చించనున్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి కూడా పాల్గొన్నారు.

డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు తెలంగాణలో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్‌కు ప్రధాని మోదీని ముఖ్యమంత్రి ఆహ్వానించారు. అదే విధంగా డిసెంబర్‌లో జరగనున్న ఖేలో ఇండియా క్రీడల ప్రారంభోత్సవానికి కూడా హాజరుకావాలని కోరారు.

రాష్ట్రంలో వర్షపాతం గణనీయంగా తగ్గడం, పలు ప్రాంతాల్లో కరువు పరిస్థితులు నెలకొనడంపై కేంద్ర ప్రభుత్వానికి సీఎం వివరించనున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం 365 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి రూ.30 వేల కోట్ల ఆర్థిక సాయం అందించాలని ప్రధాని మోదీని కోరనున్నట్లు సమాచారం.

ఇక సాగునీటి ప్రాజెక్టుల విషయంలోనూ కేంద్రం సహకారం అందించాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేయనుంది. 152 మీటర్ల ఎత్తుతో తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మించేందుకు మహారాష్ట్ర నుంచి అవసరమైన అనుమతులు ఇప్పించాలని కోరనున్నారు. అలాగే సమ్మక్కసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఛత్తీస్‌గఢ్ నుంచి అనుమతులు వచ్చేలా కేంద్రం చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేయనున్నారు.

గోదావరి-కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టుపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టును సమ్మక్కసాగర్ లేదా ఇచ్చంపల్లి నుంచి ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించనుంది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించే గోదావరి జలాల్లో తెలంగాణకు 50 శాతం వాటా కేటాయించాలని కోరనుంది.

మరోవైపు సీతమ్మసాగర్ బ్యారేజీ నిర్మాణానికి అవసరమైన పర్యావరణ అనుమతులు త్వరగా లభించేలా కేంద్ర ప్రభుత్వం సహకరించాలని ముఖ్యమంత్రి కోరనున్నారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతికి కేంద్రం నుంచి అవసరమైన మద్దతు పొందడమే ఈ భేటీ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.

కాగా, సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం కూడా ఢిల్లీలోనే ఉండనున్నారు. ఈ పర్యటనలో కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మరిన్ని సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది.

ట్యాగ్‌లు: Telangana