‘జార్జ్ క్రిష్’కు మానస డబ్బింగ్
Manasa
వరుసగా రెండు హిట్లు కొట్టిన చార్మింగ్ స్టార్ శర్వా, శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జార్జ్ క్రిష్’తో హ్యాట్రిక్ హిట్ పూర్తి చేయడానికి సిద్ధమవుతున్నాడు. అనిల్ సుంకర ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎటివి సమర్పిస్తుండగా, అజయ్ సుంకర సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో శర్వా సరసన మానస వారణాసి కథానాయికగా నటిస్తోంది. ఇటీవల విడుదలైన జార్జ్ క్రిష్ ఫస్ట్ బూస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది ఇందులో శర్వానంద్‌ను రెండు విభిన్న మతాలకు చెందిన పాత్రల్లో పరిచయం చేశారు. క్రిస్టియన్‌గా జార్జ్, హిందువుగా క్రిష్ పాత్రల్లో శర్వా అలరించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు శ్రీనువైట్ల, హీరోయిన్ మానస వారణాసి పాల్గొన్నారు. డబ్బింగ్ ప్రారంభమైన సందర్భంగా హీరోయిన్ మానస వారణాసి తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెబుతున్న వీడియో ఆకట్టుకుంది. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నారు, కెవి గుహన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్. అమర్ రెడ్డి కుడుముల ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. నందు సవిరిగాన, గోపీ మోహన్ రచయితలుగా వ్యవహరిస్తుండగా, కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు.‘జార్జ్ క్రిష్’ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా 2027 జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు హ్యూమర్, రొమాన్స్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో కూడిన కలర్‌ఫుల్ ఫీస్ట్ అందించేందుకు ‘జార్జ్ క్రిష్’ సిద్ధమౌతోంది.