Skip to content
వినోదం › వార్తలు

కొడవలి పట్టిన ‘కాకా’

Prajapaksham 10 Nov 2026 1 నిమిషాల పఠనం వినోదం
కొడవలి పట్టిన ‘కాకా’

కొడవలి పట్టిన ‘కాకా’

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కాకా’. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. తాజాగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. వర్షంతో తడిసిన వాతావరణంలో, పచ్చని పొలాల మధ్య చేతిలో కొడవలి పట్టుకుని ఇంటెన్స్ గా నిలబడిన చిరంజీవి లుక్ ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ సినిమా రా అండ్ ఇంటెన్స్ ప్రజెంట్ చేస్తోంది. చిరంజీవి ఫియర్స్ అవతార్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ సందర్భంగా ‘కాకా’ చిత్రాన్ని 2027 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. దీంతో వచ్చే సంక్రాంతి బరిలో ‘కాకా’ మేజర్ ఎట్రాక్షన్ గా నిలవనుంది.ఈ చిత్రంలో అనస్వర రాజన్, నివేదా థామస్‌తో పాటు బాలీవుడ్ ఫిల్మ్‌మేకర్, నటుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే అనస్వర రాజన్‌ను ‘హార్ట్ ఆఫ్ కాకా’గా ఆమె పాత్ర పేరు ‘అమ్ములు పాప’గా పరిచయం చేశారు. అనురాగ్ కశ్యప్ ఈ సినిమాలో భాగం కావడంతో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది.ఈ ప్రాజెక్ట్‌కు టాప్ టెక్నికల్ టీం పనిచేస్తోంది. ఎస్. తమన్ సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా, ఆంటోనీ ఎల్. రూబెన్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. కోన వెంకట్, కె. చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందించగా, హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి అడిషినల్ రైటర్స్ గా పనిచేస్తున్నారు. భాను-నందు డైలాగ్స్ అందిస్తున్నారు.