Skip to content
లైఫ్ స్టైల్ › వార్తలు

Deepavali Wishes in Telugu: దీపావళి శుభాకాంక్షలు 2026.. కుటుంబ సభ్యులతో, మిత్రులతో పంచుకోవడానికి కొన్ని అందమైన దివాలి శుభాకాంక్షల సందేశాలు..

jagan 07 Nov 2026 1 నిమిషాల పఠనం లైఫ్ స్టైల్
Deepavali Wishes in Telugu: దీపావళి శుభాకాంక్షలు 2026.. కుటుంబ సభ్యులతో, మిత్రులతో పంచుకోవడానికి కొన్ని అందమైన దివాలి శుభాకాంక్షల సందేశాలు..

Deepavali Wishes in Telugu

Deepavali Wishes in Telugu: భారతీయ సంస్కృతిలో పండుగలకు ప్రత్యేక స్థానం ఉంది. అందులో కుల, మత, వర్గ రహితంగా దేశమంతటా ఎంతో ఉత్సాహంగా జరుపుకునే అతిపెద్ద పండుగ “దీపావళి”. ‘దీపావళి’ అంటే దీపాల వరుస అని అర్థం. ఆశ్వయుజ అమావాస్య నాటి నిబిడమైన కాళరాత్రిని చిరుదీపాల కాంతులతో వెలిగించి, చీకటిపై వెలుగు సాధించే విజయానికి సంకేతంగా ఈ దివ్య పర్వదినాన్ని జరుపుకుంటారు.

  1. మీ ఇంటా వంటా సిరుల పంట పండాలని, ఈ దీపావళి మీ జీవితంలో నూతన వెలుగులను నింపాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు!
  2. అజ్ఞానపు చీకట్లను పారద్రోలి, జ్ఞానపు వెలుగులను పంచే ఈ పవిత్ర దీపావళి మీ జీవితంలో సుఖసంతోషాలను, ఐశ్వర్యాలను ప్రసాదించాలి. హ్యాపీ దీపావళి!
  3. లక్ష్మీదేవి కృపాకటాక్షాలతో మీ ఇల్లు నిత్యం ధనధాన్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ.. దీపావళి శుభాకాంక్షలు.
  4. ఈ దీపావళి మీ జీవితంలోని కష్టాల చీకట్లను తొలగించి, విజయాల కాంతులను నింపాలని ఆకాంక్షిస్తూ.. అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు!
  5. చిరుదీపాల కాంతులతో, బాణాసంచా సందడితో మీ ఇల్లు నవ్వులతో కళకళలాడాలి. మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు దీపావళి హార్దిక శుభాకాంక్షలు!