Skip to content
వినోదం › వార్తలు

20న వస్తున్న ‘డానీ’

Prajapaksham 04 Nov 2026 0 నిమిషాల పఠనం వినోదం
20న వస్తున్న ‘డానీ’

Danny

రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, కళ్యాణ్‌జీ కంటెంట్ పిక్చర్స్ బ్యానర్‌ల మీద రిజ్వాన్ నిర్మాణంలో కళ్యాణ్‌జీ గోగణ తెరకెక్కించి చిత్రం ‘డానీ’. ఈ మూవీలో ఆశిష్ గాంధీ, సేజల్ గుప్తా, సోనాల్ సింగ్, అజర్ ఖాన్ ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ మూవీని నవంబర్ 20న విడుదల చేయబోతోన్నట్టుగా ప్రకటించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రిలీజ్ ప్రకటించారు.
హీరో ఆశిష్ గాంధీ మాట్లాడుతూ ‘‘కళ్యాణ్, నేను, రిజ్వాన్ కలిసి ‘నాటకం’ చేశాము. మళ్లీ ఇప్పుడు ‘డానీ’తో కలిశాం. ఇదొక కల్ట్ వైల్డ్ డ్రామా. ఇందులో రాకేందు పాటలు, సాయి కార్తీక్ మ్యూజిక్ గొప్పగా ఉంటుంది. ఆనంద్ అన్న అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. సేజల్ అద్భుతమైన నటి.నవంబర్ 20న మా చిత్రం రాబోతోంది అని అన్నారు.దర్శకుడు కళ్యాణ్‌జీ గోగణ మాట్లాడుతూ ‘నిర్మాత రిజ్వాన్, ఆశిష్, నేను కలిసి ‘నాటకం’ చేశాం. ఆశిష్ కెమెరా ముందు ఉంటే నాకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. రిజ్వాన్ తో నాకు ఎంతో కంఫర్ట్‌గా అనిపిస్తుంది. ఇలాంటి ఓ డిఫరెంట్ లవ్, రస్టిక్ డ్రామాకి రిజ్వాన్ లాంటి నిర్మాత అయితేనే న్యాయం చేస్తారని అనిపించింది అని అన్నారు.నిర్మాత రిజ్వాన్ మాట్లాడుతూ నవంబర్ 20న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. రాకేందు మౌళి, ఏకే ఆనంద్ , కె మ్యూజిక్ ప్రతినిధి ప్రియాంక, నటి సేజల్ గుప్తా, నటుడు అజర్ ఖాన్ పాల్గొన్నారు.