మైలురాయి టైటిల్ లాంచ్
Milestone Title Launch
హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం. 1గా శ్రీ హన్సిక పెద్దిరెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘మైలురాయి’. తవిటిరాజు తలచింతల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి టాలెంటెడ్ డైరెక్టర్ రఘువర్ధన్ కోట్ల దర్శకత్వం వహిస్తున్నారు. యువ నటీనటులు జగన్ యోగిరాజు, నవ్య చిట్యాల హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరితో పాటు సీనియర్ నటుడు దేవీ ప్రసాద్ కీలక పాత్రలో కనిపించనున్నారు. లక్ష్మణ్ మీసాల, పవన్ రమేష్, సునందిని, అంజు వాల్గుమన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టైటిల్ లాంచ్ పోస్టర్‌ను సీనియర్ నటుడు, నిర్మాత, ఎపి శాసనమండలి సభ్యుడు, ఎపి గ్రీన్ కార్పొరేషన్ ఛైర్మన్ నాగబాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ “ఈ సినిమా టైటిల్ ‘మైలురాయి’ చాలా ఆసక్తికరంగా ఉంది. నిర్మాత హన్సిక మంచి సినిమాతో తన కెరీర్ను ప్రారంభించారు. ఔత్సాహిక దర్శకుడు, యువ హీరోతో ఈ చిత్రాన్ని రూపొందించడం అభినందనీయం. ఫిల్మ్ మేకింగ్‌లో మహిళలకు ఉండే బాధ్యత, క్రమశిక్షణ ఎంతో గొప్పవి. నిర్మాత శ్రీ హన్సిక పెద్దిరెడ్డి మాట్లాడుతూ “మా హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం. 1గా రూపొందుతున్న ‘మైలురాయి’ టైటిల్ లాంచ్ పోస్టర్‌ను నాగబాబు గారి చేతుల మీదుగా విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే టీజర్, పాటలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు. సహ నిర్మాత తవిటిరాజు తలచింతల , హీరో జగన్ యోగిరాజు ,దర్శకుడు రఘువర్ధన్ కోట్ల పోస్టర్ లంచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.