డిజె టిల్లు లాగే ‘అనుమాన పక్షి’
Anumana Pakshi
డిజె టిల్లు’తో దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన విమల్ కృష్ణ.. మరో ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అనుమాన పక్షి’. రాగ్ మయూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా.. హ్యూమర్, క్యారెక్టర్స్, కథనంలో పూర్తిగా డిఫరెంట్ గా ఉండబోతోంది. చిలక ప్రొడక్షన్స్ సమర్పణలో రాజీవ్ చిలక, రాజేష్ జగ్తియాని, హిరాచంద్ దండ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 25న ‘అనుమాన పక్షి’ థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు.ప్రెస్ మీట్ లో హీరో రాగ్ మయూర్ మాట్లాడుతూ నటుడిగా ప్రతిక్షణం మెరుగవడానికి ప్రయత్నించాను. యాక్టింగ్ నా ఊపిరి. ఇప్పుడు ‘అనుమాన పక్షి’తో హీరోగా వస్తున్నాను. ఇది నాకు చాలా ఆనందంగా ఉంది. డిజే టిల్లు పెద్ద హిట్ తర్వాత విమల్ కృష్ణ నాతో సినిమా చేయాలనుకున్నారు. డైరెక్టర్ విమల్ కృష్ణ ఈ కథ చెప్పినప్పుడు నాకు చాలా సర్‌ప్రైజింగ్‌గా అనిపించింది. ఎందుకంటే ఇలాంటి కథ ఎక్కడా లేదు. సెప్టెంబర్ 25న ఒక అద్భుతమైన సినిమా మీ ముందుకు రాబోతోంది అన్నారు. డైరెక్టర్ విమల్ కృష్ణ మాట్లాడుతూ ‘డిజె టిల్లు’ మీకు ఎలా సర్‌ప్రైజ్ చేసిందో, ఈ సినిమా కూడా మిమ్మల్ని 100% సర్‌ప్రైజ్ చేస్తుంది. ఈ జర్నీలో నాకు చాలా సపోర్ట్ చేసిన స్టేజ్ మీద ఉన్న అందరికీ థాంక్యూ. చోటా గారు ఎడిటింగ్కు వచ్చిన తర్వాత ‘అనుమాన పక్షి’ జర్నీ చాలా ఈజీ అయింది. శ్రీ చరణ్ మరోసారి చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు అని చెప్పారు. హీరోయిన్ మెరీన్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల, ప్రొడ్యూసర్ రాజీవ్ చిలక , ప్రొడ్యూసర్ మేఘా , ఎడిటర్ చోటా ప్రసాద్ పాల్గొన్నారు.
డైరెక్టర్ విమల్ కృష్ణ
- Bank Strike Alert: కేంద్ర ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. సెప్టెంబర్ 25నే జీతాలు, పెన్షన్లు.. కేంద్రం కీలక ఆదేశాలు
- YS Jagan-CPI Meeting: వైఎస్ జగన్‌తో సమావేశమైన సీపీఐ నేతలు.. సెప్టెంబర్ 26న జరగబోయే రౌండ్‌టేబుల్ సమావేశానికి మాజీ సీఎంకు ఆహ్వానం..
- Danam Nagender: మళ్లీ ఖైరతాబాద్ నుంచే పోటీ చేస్తా..ఏ పార్టీ నుంచి అనేది ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాతే వెల్లడిస్తా.. దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు..
- Super El Niño: ప్రపంచానికి పెను ముప్పు.. ఫిబ్రవరి నాటికి 4.51 లక్షల మరణాలు.. క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ హెచ్చరిక..
- Ganesh Immersion Duty: వీడియో ఇదిగో.. గణేశ్ నిమజ్జనం విధులకు వచ్చి ఎస్ఐ మృత్యువాత.. బైక్ ఢీకొని ఎస్ఐ వెంకన్న మృతి