Skip to content
ఆంధ్రప్రదేశ్ వార్తలు

AP Weather Alert: ఏపీలో భారీ వర్షాలు.. అల్పపీడనం ప్రభావంతో నేడు, రేపు దంచికొట్టనున్న వానలు..

jagan 12 Sep 2026 1 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
AP Weather Alert: ఏపీలో భారీ వర్షాలు.. అల్పపీడనం ప్రభావంతో నేడు, రేపు దంచికొట్టనున్న వానలు..

Tomorrow Weather Update: Five cyclonic systems simultaneously across the country; extremely heavy rains until July 27.

AP Weather Alert: దక్షిణ ఒడిశా – ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో నెలకొన్న అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీని ఫలితంగా శని, ఆదివారాల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ తీవ్ర వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ హై అలర్ట్ ప్రకటించింది.

విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో, దక్షిణ కోస్తాలో 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ మరియు కోనసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.

రాష్ట్రంలో మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా హోం మంత్రి వంగలపూడి అనిత ప్రజలకు కీలక సూచనలు చేశారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, వర్షాలు కురిసే సమయంలో సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కోరారు. పిడుగుపాటు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున చెట్ల కింద, భారీ హోర్డింగ్‌ల సమీపంలో ఉండరాదని హెచ్చరించారు. సముద్రం అశాంతంగా ఉన్నందున మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అవసరమైన సహాయక చర్యలు చేపట్టేందుకు అధికార యంత్రాంగం సర్వసిద్ధంగా ఉండాలని ఆమె ఆదేశించారు.