AP DSC Scam: బాబు స్కామ్ హిస్టరీలో డీఎస్సీ ఒక ఆణిముత్యం.. పరీక్ష లేకుండా 372 స్పోర్ట్స్ కోటా పోస్టులు ఎలా ఇచ్చారు – వైఎస్ జగన్..
మావిగన్ ను వదలని జగన్...రాజధాని రాజకీయంపై సొంత పార్టీ నేతల్లోనే అసంతృప్తి...
AP DSC Scam: పరీక్షే నిర్వహించకుండా 372 స్పోర్ట్స్ కోటా పోస్టులను ఎలా భర్తీ చేశారని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఇందుకోసం జీవో నెంబర్ 4, 47 ద్వారా గేట్లు తెరిచారని, పని పూర్తయిన తర్వాత జీవో నెంబర్ 23, 25, 56 ద్వారా గేట్లు మూసేశారని ఆరోపించారు. డీఎస్సీ వ్యవహారంలో జరిగిన అక్రమాలను కప్పిపుచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు.
AP DSC Scam: 2025 మెగా డీఎస్సీపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. డీఎస్సీలో తవ్వేకొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయని, చంద్రబాబు స్కామ్ హిస్టరీలో డీఎస్సీ ఒక ఆణిముత్యంగా మారిందని విమర్శించారు. ఇది మెగా డీఎస్సీ కాదని.. దగా డీఎస్సీ అని ఆయన ఆరోపించారు.
పరీక్షే నిర్వహించకుండా 372 స్పోర్ట్స్ కోటా పోస్టులను ఎలా భర్తీ చేశారని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఇందుకోసం జీవో నెంబర్ 4, 47 ద్వారా గేట్లు తెరిచారని, పని పూర్తయిన తర్వాత జీవో నెంబర్ 23, 25, 56 ద్వారా గేట్లు మూసేశారని ఆరోపించారు. డీఎస్సీ వ్యవహారంలో జరిగిన అక్రమాలను కప్పిపుచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు.
డీఎస్సీ స్కామ్‌ను దగ్గరుండి నిర్వీర్యం చేస్తున్నారని, తన కుమారుడు నారా లోకేష్‌ను కాపాడుకోవాలనే ఆరాటంలో చంద్రబాబు ఉన్నారని జగన్ ఆరోపించారు. నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని మండిపడ్డారు.
డీఎస్సీకి సంబంధించి ప్రభుత్వానికి అనేక ప్రశ్నలు సంధించినప్పటికీ చంద్రబాబు, లోకేష్ ఎందుకు సమాధానాలు చెప్పడం లేదని జగన్ ప్రశ్నించారు. డీఎస్సీ పేపర్ల తయారీ, పర్యవేక్షణ బాధ్యతలను ఒకే వ్యక్తి చేతిలో ఎందుకు పెట్టారని నిలదీశారు. జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 ఎందుకు తీసుకొచ్చారో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
రెక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తయిన తర్వాత సంబంధిత జీవోలను ఎందుకు మార్చాల్సి వచ్చిందని జగన్ ప్రశ్నించారు. డీఎస్సీ ప్రక్రియలో తీసుకున్న నిర్ణయాలు, జారీ చేసిన జీవోలు, వాటి మార్పుల వెనుక కారణాలను ప్రభుత్వం ప్రజలకు వివరించాలని అన్నారు.
‘2025 మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ’ అని జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డీఎస్సీలో అక్రమాలు బయటకు వస్తున్న కొద్దీ చంద్రబాబులో బీపీ పెరుగుతోందని ఎద్దేవా చేశారు. మెగా డీఎస్సీలో తవ్వేకొద్దీ మరిన్ని అక్రమాలు కనిపిస్తున్నాయని ఆరోపించారు.
ఎవరైనా ఆధారాలు చూపిస్తే వారిని జైల్లో పెడుతున్నారని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని జగన్ విమర్శించారు. డీఎస్సీ వ్యవహారంలో వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు.
నిరుద్యోగుల భవిష్యత్తుకు సంబంధించిన డీఎస్సీ వంటి నియామక ప్రక్రియలో పారదర్శకత అత్యంత కీలకమని జగన్ పేర్కొన్నారు. ప్రభుత్వం తమపై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాలని, డీఎస్సీ నియామక ప్రక్రియపై పూర్తి వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు.