Skip to content
తెలంగాణ వార్తలు

Janasena Contest In GHMC Elections: గ్రేటర్ హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తామని జనసేన ప్రకటన..

Prajapaksham 30 Aug 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Janasena Contest In GHMC Elections: గ్రేటర్ హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తామని జనసేన ప్రకటన..

Janasena Contest In GHMC Elections: గ్రేటర్ హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తామని జనసేన ప్రకటన..

గ్రేటర్, మల్కాజిగిరి, సైబరాబాద్ ఎన్నికల్లో జనసేన బలంగా పోటీ: తాళ్ళూరి రామ్

Janasena Contest In GHMC Elections: రాబోయే గ్రేటర్ హైదరాబాద్ (GHMC), మల్కాజిగిరి (MMC), సైబరాబాద్ (CMC) మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పార్టీ బలంగా పోటీ చేస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్ళూరి రామ్ స్పష్టం చేశారు. ఆదివారం నాడు హైదరాబాద్‌లోని జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో మూడు కార్పొరేషన్ల పరిధిలోని ముఖ్య నాయకులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా తాళ్ళూరి రామ్ మాట్లాడుతూ.. ఎన్నికల బరిలో నిలిచేందుకు పార్టీ శ్రేణులంతా పూర్తిస్థాయిలో సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. జనసేన పార్టీ చేపడుతున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి ముమ్మరంగా తీసుకువెళ్లాలని ఆయన సూచించారు.

కష్టపడిన వారికి సముచిత స్థానం: శంకర్ గౌడ్

జనసేన తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. పార్టీ ఆవిర్భావం నుంచి తెలంగాణలో జనసేన బలోపేతం కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు, సముచిత స్థానం దక్కుతుందని హామీ ఇచ్చారు. పోటీ చేయాలనుకునే అభ్యర్థులు ఇప్పటి నుంచే ప్రజాక్షేత్రంలో ఉంటూ స్థానిక సమస్యలపై పోరాడాలని ఆదేశించారు.

రాష్ట్ర రాజకీయాలకు ఈ ఎన్నికలే దిక్సూచి: సాగర్ ఆర్.కే. నాయుడు

పార్టీ ప్రచార కార్యదర్శి సాగర్ ఆర్.కే. నాయుడు మాట్లాడుతూ.. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలే తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ రాజకీయాలకు దిక్సూచిగా మారనున్నాయని పేర్కొన్నారు.

ఈ విస్తృతస్థాయి సమావేశంలో రాష్ట్ర నాయకులు రాధారం రాజలింగం, మచ్చ సుధాకర్, ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, గడల శ్రీనివాస్, అల్లాడి తనీష్‌లతో పాటు అధికార ప్రతినిధులు ప్రేమ్ గాంధీ, హైందవి రెడ్డి, కావ్య, నిహారిక, నివిత మరియు మూడు కార్పొరేషన్ల పరిధిలోని జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, పోటీ చేయనున్న అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.