ట్రంప్, మోదీ, షా లకు, కమ్యూనిస్టుల జ్వరం పట్టుకుంది
CPI
CH. Raja Reddy, EX MLA, CPI State Executive Member
ప్రపంచంలోనే కమ్యూనిస్టు పార్టీల పని అయిపోయిందని, వర్తమాన, భవిష్యత్ అంతా పెట్టుబడిదారీ విధానం ఏక ధృవ ప్రపంచమని, ఇప్పటివరకు సామ్రాజ్యవాదానికి నాయకత్వం వహిస్తున్న అమెరికా నేతలు, ప్రధానం గా ట్రంప్ ప్రపంచ దేశాలు నమ్మిస్తూ వచ్చారు.
కానీ ప్రపంచంలో పెట్టుబడి విధానం దేశాలలోని ప్రజలపై పెను భారాన్ని మోపుతూ, వారి జీవన ప్రమానాలు దిగజార్చిన సందర్భంగా, శ్రామిక వర్గంతో పాటు, ప్రధానంగా యువజన విద్యార్థులు తమ సమస్యలు పోవాలంటే సోషలిజమే సరి అయిన మార్గమని భావిస్తున్న పరిస్థితులు నేడు ఏర్పడ్డవి. ఇటీవల అమెరికాలో 30 సంవత్సరాలలోపు యువకుల ఆలోచనా విధానం ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి నిర్వహించిన సర్వేలో 60శాతం మంది యువకుల ఆలోచన సోషలిజమే సరైన మార్గంగా ఉందని తెలిపినట్టు వార్తలు వచ్చాయి.
అందులో భాగమే కావచ్చు ఇటీవల కొద్ది మాసాల క్రితం అమెరికా దేశంలో అతిపెద్ద కీలకమైన న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో జోహ్రాన్ మమ్దాని అనే 35 సంవత్సరాల యువకుడిని, కమ్యూనిస్టు పిచ్చివాడిగా దేశ అధ్యక్షుడు ట్రంప్‌తో సహా పెట్టుబడిదారులంతా ఏకమై ప్రచారం చేసినా, అవును నేను కార్మిక పేద ప్రజల కోసమే పని చేస్తానని, నేను కమ్యూనిస్టునేనని నిక్కచ్చిగా చెప్పిన జోహ్రీన్ మమ్దానీ భారీ మెజారిటీతో గెలవడాన్ని ట్రంపు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటీవల జరిగిన అమెరికా దేశపు 250 వార్షికోత్సవ సందర్భంగా ట్రంప్ భీతిల్లి మాట్లాడుతూ, అమెరికాకు కమ్యూనిస్టు భూతం ఆవరించిందని, దానిని ఎదుర్కోవడానికి సిద్ధం కావాలని పిలుపు
నిచ్చారు.
నేడు ప్రపంచవ్యాప్తంగా తాను చేస్తున్న దురాక్రమణ యుద్ధాలకు, చైనా క్యూబా, వియత్నాం, ఉత్తర కొరియా వంటి కమ్యూనిస్టు దేశాలు బూచిని చూపిస్తూ, ట్రంపు చేస్తున్న వ్యాఖ్యలు ప్రపంచంలో కమ్యూనిజం ఎంత బాగా విస్తరిస్తుందో అర్థమవుతుంది. ఇటీవల అనేక దేశాలలో జరిగిన ఎన్నికల్లో కూడా వామపక్ష, కమ్యూనిస్టు ప్రభుత్వాలే గెలవడము కూడా ట్రంప్ కు ఆందోళన కలిగిస్తుంది. తిరిగి కమ్యూనిజం మాత్రమే ప్రజలకు సరైన రక్షణ, భద్రతతో అండగా నిలుస్తుందని ప్రజలు భావిస్తున్న ఆలోచన ధోరణి చాలా స్పష్టంగా కనబడుతుంది.
ఈ క్రమంలోనే భారతదేశంలో కూడా మతోన్మాద భావజాలం తో అధికారంలో వచ్చిన ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా ల ద్వయంతో ఈ దేశంలో కమ్యూనిజం లేకుండా చేస్తానని, నక్సలైట్లను అంతమొందించానని, చెబుతూనే, పంద్రాగస్టు జెండా వందన సందర్భంగా ప్రధాని మోదీ గారి ప్రసంగంలో, నక్సలైట్స్ అంతమయ్యారని, ఇప్పుడు ఇంకా అర్బన్ నక్సలైట్స్ అనే పదా న్ని విస్తరిస్తూ, దిమాగి నక్సల్స్ ఉన్నారని సంబోధించడం బట్టి చూస్తే, కమ్యూనిజం అంటేనే ఎంత భయపడుతున్నారో అర్థమవుతుంది.
దేశంలో కమ్యూనిస్టు వ్యతిరేక భావజాలంలో నిమగ్నమైన మోదీ, కమ్యూనిస్టులపై, తాము నిర్మించుకున్న అబద్ధ ప్రచార యూనివర్సిటీ ద్వారా, తమ అనుకూల టివి, యుట్యూబ్ ఛానల్స్, వాట్సాప్ గ్రూపులు, వార్తాపత్రికల ద్వారా, వ్యక్తుల ద్వారా, కోట్లాది రూపాయల ఖర్చులు పెట్టి, కమ్యూనిజంపై ద్వేష, విష, నిందలతో, గోబెల్స్ ప్రచారాన్ని చేయిస్తున్నారు. లొంగిపోయిన మావోయిస్టు మహిళల చేత, కుట్టు మిషన్ పని నేర్పిస్తామని చెప్పి, తుదకు కమ్యూనిస్టు భావజాల వ్యతిరేకమైన అందాల పోటీలు నిర్వహించే ర్యాంపులపై నడిపించే సిగ్గుమాలిన చర్యకు దిగ జారడం మోదీ, అమిత్‌షాల నీచత్వానికి నిదర్శనం.
ఎంత నీచ నికృష్ట కమ్యూనిస్టు పార్టీ వ్యతిరేక ప్రచారం చేయాలనుకున్న, దేశంలో కార్మిక, కర్షక, శ్రమజీవుల హృదయాలు గుడి కట్టుకున్న ఎర్రజెండాను ఎవరు తీసివేయ లేరని, ఇప్పటికైనా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
మారాల్సింది మతాల పేరుతో, కులాల పేరుతో, ప్రజల మధ్య చిచ్చుపెట్టి, సంపన్న – పేద ప్రజల మధ్య అంతరం, అగాధం సృష్టించిన, పేద ప్రజల బతుకుల్లో బాధలు సృష్టించిన ఆర్‌ఎస్‌ఎస్ నడిపిస్తున్న, బిజెపి మోదీ షా ప్రభుత్వాలు మారాలి.
దేశంలో మోదీ చేస్తున్న అరాచక నియంతృత్వ, నికృష్టపాలన వల్ల దేశంలోని రైతులపై దాడి, కార్మిక వర్గం మెడపై కత్తి పెట్టడo, నీట్ పేపరు లీకేజీ ద్వారా లక్షలాదిమంది విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం, అన్యాయం అన్న ఢిల్లీలో యువజన విద్యార్థులపై తీవ్రమైన నిరంకుశ దాడి చేయడం, వంటి చర్యల ద్వారా దేశ ప్రజలకు దూరమవుతూ, మహిళలకు రక్షణ కల్పించలేని ఈ బిజెపి ఆర్‌ఎస్‌ఎస్ మోదీ ప్రభుత్వం తుదకు దేవుడిని, ఏ రాముని పేరు చెప్పి అధికారంలోకి వచ్చారో అయోధ్యలోని ఆ దేవుడైన బాల రాముని గుడికే రక్షణ లేకుండా వందల కోట్ల రూపాయలు దోచుకెళ్లిన ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి నాయకుల బండారం దేశ ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు. మరో దేవుని గుడి అయినా, బద్రీనాథ్ దేవాలయంలో కూడా దొంగతనం జరిగి చాలా డబ్బులు పోయిన సంగతి మన గమనించాలి. ఈ విధంగా దేశ ప్రజలనే కాకుండా దేవుళ్ళను కూడా దోచుకుంటున్న బిజెపి మోదీ మనకు అవసరమా అని, దేశ ప్రజలు, చాలా తొందరగా మోదీ ప్రభుత్వాన్ని అధికారం నుంచి దింపాలని ఆలోచన చేస్తున్నారు.
దేశ సంపదను దోచి, తన అనుకూల శతకోటీశ్వరులైన కార్పొరేట్ వ్యక్తులకు దోచిపెట్టడాన్ని, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలైనను 180 లను అతి తక్కువ ధర తన అనుకూల సంపన్న వర్గాలైన దాన్ని అంబానీ, అదానీ, వంటి వారికి అతి తక్కువకు అమ్మడాన్ని, మరోవైపు దేశ ప్రజలపై పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిత్యావసర వస్తువుల వంటిపై భారీగా ధరలు పెంచి, దేశ ప్రజలపై విపరీతమైన భారాన్ని మోపడాన్ని, దేశ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.ఇటువంటి దేశ పరిస్థితుల్లో, నిరంతరం ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్న భారత కమ్యూనిస్టు పార్టీ, (సిపిఐ) “బద్లావ్ జరూరీ హై” నినాదంతో ఆగస్టు 6 నుంచి 17వ తేదీ వరకు దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలలో, పట్టణాలలో పాదయాత్రలు, ప్రచార యాత్రల ద్వారా ప్రజానీకాన్ని చైతన్య పరిచే కార్యక్రమం చేపట్టింది.
“సెప్టెంబర్ ఒకటి చలో ఢిల్లీ”
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈ దేశంలో రాజ్యాంగం రక్షించాలని, దేశ సమైక్యత, సమగ్రత, లౌకికవాద పరిరక్షణ, ప్రజల మాన ప్రాణాలకు రక్షణ కల్పించాలని, అందుకోసం దేశ ప్రజలంతా ఆలోచించి, అందరూ ఐక్యమై సహకరించి, దేశాన్ని కాపాడుకొనుటకు సెప్టెంబర్ ఒకటో తేదీన ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో మార్పు కొరకు జరిగే భారీ బహిరంగ సభకు లక్షలాదిమంది ప్రజలు తరలి రావాలని, సిపిఐ పిలుపునిచ్చింది.
- Bank Strike Alert: సెప్టెంబర్ 11న దేశవ్యాప్త బ్యాంకుల సమ్మె … వారానికి ఐదు రోజుల పనిదినాల కోసం డిమాండ్
- Milad un nabi wishes in telugu: మిలాద్ ఉన్ నబి: వివిధ దేశాల్లో ఎలా జరుపుకుంటారు? పూర్తి వివరాలు మీ కోసం…
- Milad un Nabi Wishes in Telugu : మీ బంధు మిత్రుల కోసం మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు…Photo Greetings రూపంలో తెలియజేయండిలా..?
- Eid Milad Un Nabi Wishes in Telugu: మిలాద్ ఉన్ నబి ప్రాముఖ్యత ఏంటి..? ఆగస్టు 26 మిలాద్ ఉన్ నబి పండగ సందర్భంగా శుభాకాంక్షల మెసేజెస్ మీకోసం…
- విజయదశమికి వస్తున్న ‘కిల్లర్’