‘సంబరాల ఏటిగట్టు’ షూటింగ్ పూర్తి
Sambarala yetigattu
మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా చిత్రం సంబరాల ఏటిగట్టు షూటింగ్ మొత్తం పూర్తయింది. నూతన దర్శకుడు రోహిత్ కేపీ దర్శకత్వంలో, ప్రతిష్టాత్మక ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించిన ఈ యాక్షన్ డ్రామా, ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ దశను వేగంగా పూర్తి చేసుకుంటోంది.‘అసుర ఆగమన’ గ్లింప్స్, మిగతా ప్రమోషనల్ కంటెంట్ కి వచ్చిన అద్భుతమైన స్పందనతో ఈ చిత్రం ఇప్పటికే భారీ అంచనాలను రేకెత్తించింది. ఈ చిత్రంలో ట్యాలెంటెడ్ యాక్టర్ డాలీ ధనంజయ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ధనంజయ్ అర్జున్ పాత్రలో ఆయన్ని పరిచయం చేస్తూ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘అర్జున్’గా ధనంజయ్ లుక్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. సీరియస్ లుక్‌లో కనిపిస్తున్న ఆయన పాత్ర కథలో కీలకమైన ప్రభావాన్ని చూపించబోతున్నట్లు పోస్టర్ సూచిస్తోంది. ‘అర్జున్’ పాత్ర తెరపై ప్రేక్షకులపై చెరగని ముద్ర వేయబోతుంది.భారీ స్థాయిలో నిర్మించిన ఈ చిత్రాన్ని అనేక ప్రదేశాలలో, భారీ సెట్లతో, భారీ యాక్షన్ సన్నివేశాలతో చిత్రీకరించారు.ఈ చిత్రంలో సాయి దుర్గ తేజ్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. దర్శకుడు రోహిత్ కేపీ, బలమైన భావోద్వేగ అంశాలతో పాటు అద్భుతమైన దృశ్యాలు, ఉత్కంఠభరితమైన సన్నివేశాలను మేళవించి ఈ చిత్రాన్ని ఒక ప్రతిష్టాత్మక యాక్షన్ డ్రామాగా తీర్చిదిద్దుతున్నారు. ఐశ్వర్య లక్ష్మి, జగపతి బాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ళ కూడా ఈ తారాగణంలో భాగమై, ప్రముఖ పాత్రలలో కనిపించనున్నారు. వెట్రివేల్ పళనిస్వామి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఎడిటర్ నవీన్ విజయ్ కృష్ణ, ప్రొడక్షన్ డిజైనర్ గాంధీ నడికుడికర్, ఫైట్ మాస్టర్స్ పీటర్ హెయిన్స్, రామ్ లక్ష్మణ్, చేతన్, పృథ్వీ, .సంబరాల ఏటిగట్టు 2027 సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కానుంది. ఈ చిత్రానికి డీఓపీ : వెట్రి పళనిసామి, సంగీతం: బి అజనీష్ లోక్‌నాథ్, ఎడిటర్: నవిన్ విజయ్ కృష్ణ, ప్రొడక్షన్ డిజైనర్: గాంధీ నడికుడికర్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, రామ్ లక్ష్మణ్, చేతన్, పృధ్వి, కాస్ట్యూమ్ డిజైనర్: అయేషా మరియం.
- Milad un nabi wishes in telugu: మిలాద్ ఉన్ నబి: వివిధ దేశాల్లో ఎలా జరుపుకుంటారు? పూర్తి వివరాలు మీ కోసం…
- Milad un Nabi Wishes in Telugu : మీ బంధు మిత్రుల కోసం మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు…Photo Greetings రూపంలో తెలియజేయండిలా..?
- Eid Milad Un Nabi Wishes in Telugu: మిలాద్ ఉన్ నబి ప్రాముఖ్యత ఏంటి..? ఆగస్టు 26 మిలాద్ ఉన్ నబి పండగ సందర్భంగా శుభాకాంక్షల మెసేజెస్ మీకోసం…
- విజయదశమికి వస్తున్న ‘కిల్లర్’
- USA – Iran War Update: ఇరాన్‌కు సాయం చేసే దేశాలపై ఆంక్షలు: బెస్సెంట్