Konda Sushmitha Remarks: కొండా సురేఖ కుమార్తె వ్యాఖ్యలపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. ప్రెస్మీట్లో ఏమన్నారంటే?
Sushmita Patel Sensational Comments On CM Revanth Reddy
Konda Sushmitha Remarks: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తన అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం తెలంగాణ సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, కేంద్రం తీరు సమాఖ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని ఆరోపించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి విదేశీ పర్యటనను అడ్డుకోవడం ద్వారా కేంద్ర ప్రభుత్వం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను, రాష్ట్ర అభివృద్ధిని అవమానించిందని ధ్వజమెత్తారు.
సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “మేము ప్రకటించిన ‘తెలంగాణ రైజింగ్ 2047’ ప్రణాళికలో భాగంగా విద్యా, క్రీడా రంగాలలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ పర్యటనను రూపొందించాం. వికసిత్ భారత్ లక్ష్యానికి ఇది తోడ్పడుతుంది. లండన్ పర్యటనకు అనుమతి ఇచ్చిన కేంద్రం, అమెరికా పర్యటనకు మాత్రం నిరాకరించడం ఏరకంగా సరైనది?” అని ప్రశ్నించారు. పర్యటనకు సంబంధించిన సమగ్ర వివరాలు అందించలేదంటూ బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. పర్యటన షెడ్యూల్ మొత్తాన్ని ముందే కేంద్ర ప్రభుత్వానికి అందించామని, కేవలం రాజకీయ ప్రయోజనాలు, కుట్రలతోనే పర్యటనను అడ్డుకున్నారని ఆరోపించారు.
ఈ నిర్ణయం తెలంగాణ పట్ల కేంద్రానికి ఉన్న వివక్షను స్పష్టం చేస్తోందని, దీనిని తెలంగాణ సమాజం ముక్తకంఠంతో ఖండించాలని కోరారు. నా పర్యటనను అడ్డుకోవచ్చు కానీ, రాష్ట్ర అభివృద్ధి కోసం నాకున్న ఆలోచనను అడ్డుకోలేరని వ్యాఖ్యానించారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని ఎంపీల ద్వారా లేవనెత్తుతామని, కేంద్రం తీరుపై నిలదీస్తామని తెలిపారు. విదేశాల్లో ఉండి మాట్లాడితే దేశద్రోహి అని ప్రచారం చేస్తారనే ఉద్దేశంతోనే స్వదేశానికి తిరిగి వచ్చి ఇక్కడి నుంచే మాట్లాడుతున్నానని పేర్కొన్నారు.
అదే సమయంలో, మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యల అంశంపై మీడియా అడిగిన ప్రశ్నలకు సీఎం స్పందించారు. కొండా సురేఖ అంశం ప్రస్తుతం పార్టీ క్రమశిక్షణా కమిటీ (Disciplinary Committee) పరిధిలో ఉందన్నారు. పార్టీ అంతర్గత విషయాలను మీడియా ముందు చర్చించబోనని స్పష్టం చేసిన ఆయన, క్రమశిక్షణా కమిటీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తామందరం కట్టుబడి ఉంటామని, ఆ నిర్ణయాన్ని అందరూ తప్పకుండా అంగీకరించాల్సిందేనని స్పష్టం చేశారు.
- Telangana Festival: తెలంగాణలో ఎవరికీ తెలియని అద్భుతం.. పూలతో నీటిని శుద్ధి చేసే ప్రత్యేక పండుగ గురించి ఎవరికైనా తెలుసా..
- Telangana Liquor News: మందు బాబులకు గుడ్న్యూస్.. తెలంగాణలో కొత్తగా 121 బ్రాండ్లకు గ్రీన్ సిగ్నల్..
- Konda Sushmitha Remarks: కొండా సురేఖ కుమార్తె వ్యాఖ్యలపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. ప్రెస్మీట్లో ఏమన్నారంటే?
- Raksha Bandhan Wishes in Telugu: రక్షా బంధన్ శుభాకాంక్షలు 2026.. అన్నాచెల్లెళ్ల ప్రేమను చాటే హృదయపూర్వక సందేశాలు.. రాఖీ పండుగ మెసేజెస్ తెలుగులో..
- Telangana Politics: నన్ను ఆపొచ్చు.. తెలంగాణ అభివృద్ధిని ఆపలేరు.. ప్రధాని మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడిన సీఎం రేవంత్ రెడ్డి