Spam Calls: మోసపూరిత కాల్స్‌కు చెక్.. కేంద్రం బ్లాక్‌లిస్ట్‌లో 263 సంస్థలు..
Spam Calls
Spam Calls: మొబైల్ వినియోగదారులను వేధిస్తున్న అనవసర వాణిజ్య కాల్స్, సందేశాలపై (యూసీసీ) కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ, ట్రాయ్ (TRAI) కఠిన చర్యలు చేపట్టింది. 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) నిబంధనలు ఉల్లంఘించిన ఏకంగా 1,83,000 టెలికాం వనరులను (కనెక్షన్లు, హెడ్డర్లు) రద్దు చేయడం లేదా నిలిపివేయడం చేసినట్లు వెల్లడించింది. అంతేకాకుండా బాధ్యులైన 263 టెలిమార్కెటింగ్ సంస్థలను (సెండర్లు) ఏడాది పాటు బ్లాక్‌లిస్ట్‌లో పెట్టినట్లు మంగళవారం స్పష్టం చేసింది.
ఈ మూడు నెలల కాలంలో దేశంలోని టెలికాం నెట్‌వర్క్‌లలో మొత్తం 73,082 కోట్ల కాల్స్ జరగగా.. వాటికి సంబంధించి 10.85 లక్షల స్పామ్ ఫిర్యాదులు నమోదయ్యాయి. సగటున ప్రతి పది లక్షల కాల్స్‌కు 1.5 ఫిర్యాదులు అందినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇందులో సగం కంటే ఎక్కువ (5.53 లక్షలు) తక్షణ చర్యలు తీసుకోదగినవిగా గుర్తించారు. నమోదు చేయబడిన మొత్తం ఫిర్యాదులలో 89 శాతం ట్రాయ్ డీఎన్డీ (DND) యాప్ ద్వారానే రావడం గమనార్హం. మొదటిసారి ఉల్లంఘనకు పాల్పడిన 1.37 లక్షల కనెక్షన్లను 15 రోజుల పాటు నిలిపివేయగా.. పదేపదే నిబంధనలు ఉల్లంఘించిన వారి నెట్‌వర్క్‌లను ఏడాది పాటు డిస్‌కనెక్ట్ చేశారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తూ స్పామ్ కాల్స్‌కు అడ్డుకట్ట వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. టెలికాం ఆపరేటర్లు అందుబాటులోకి తెచ్చిన ఏఐ (AI) ఆధారిత వ్యవస్థల ద్వారా ఈ త్రైమాసికంలో సుమారు 2,443 కోట్ల అనుమానిత స్పామ్ కాల్స్, ఎస్సెమ్మెస్‌లను ముందే గుర్తించారు. వినియోగదారులను అప్రమత్తం చేయడంతో పాటు.. అనుమానిత సెండర్లకు కేవలం వారం వ్యవధిలోనే 2.43 లక్షల హెచ్చరిక నోటిఫికేషన్లు జారీ చేసినట్లు ప్రభుత్వం వివరించింది.
ప్రమోషనల్ కాల్స్, మెసేజ్ ల నుండి ఉపశమనం పొందడానికి ప్రతి వినియోగదారుడు డీఎన్డీ (Do Not Disturb) సేవలను నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం దేశంలో దాదాపు 112 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు ఎలాంటి డీఎన్డీ ఆప్షన్ నమోదు చేసుకోకపోవడం వల్లే వారికి ప్రచార సందేశాలు విస్తృతంగా వస్తున్నాయని పేర్కొంది. ఇప్పటికే డీఎన్డీ నమోదు చేసుకున్న ప్రయాణికులకు సంబంధించి ఈ మూడు నెలల్లో దాదాపు 148 కోట్ల ప్రచార కాల్స్, 730 కోట్ల ఎస్సెమ్మెస్‌లను విజయవంతంగా అడ్డుకున్నట్లు వెల్లడించింది.
ఈ క్రమంలో వినియోగదారులు సాధారణ ప్రచార కాల్స్‌ను గుర్తించేందుకు ‘140’ సిరీస్‌ను, బ్యాంకింగ్, ఫైనాన్స్, ప్రభుత్వ సేవల లావాదేవీల కాల్స్‌ను సులభంగా గుర్తించేందుకు ‘1600’ సిరీస్‌ను ప్రత్యేకంగా కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు.
- జనసేనలో మొదలైన కలహాల కాపురం ?…నాదెండ్లపై పవన్ అసంతృప్తి..?
- వైసీపీలోకి విజయ్ సాయి రెడ్డి రీఎంట్రీ..? ఆయనొస్తే సజ్జలకు ఎగ్జిట్ తప్పదా..?
- టెట్ స్టడీ మెటీరియల్ ఆవిష్కరించిన SCERT డైరెక్టర్
- Hyderabad Weather Today: హైదరాబాద్ వాతావరణం.. వర్షాలకు సిద్ధంగా ఉండండి.. ఐఎండీ యెల్లో అలర్ట్..
- Spam Calls: మోసపూరిత కాల్స్‌కు చెక్.. కేంద్రం బ్లాక్‌లిస్ట్‌లో 263 సంస్థలు..