Skip to content
జాతీయం వార్తలు

విద్యావ్యవస్థలో సమూల సంస్కరణలు అవసరం

Prajapaksham 04 Aug 2026 1 నిమిషాల పఠనం జాతీయం
విద్యావ్యవస్థలో సమూల సంస్కరణలు అవసరం

Students Protest

కాలేజీలలో అడ్మిషన్‌లు, ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పరీక్షలతో సహా భారతదేశ విద్యా వ్యవస్థపై బిజెపి ప్రభుత్వం చేస్తున్న క్రమబద్ధమైన దాడుల కారణంగా యువతలో అసంతృప్తి నెలకొంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా కోరుతూ ఇటీవల జరిగిన ఉద్యమం దీనికి ఒక ఉదాహరణ. ఆ సమయంలో విద్యార్థుల డిమాండ్‌ను అంగీకరించక తప్పని పరిస్థితిలో ప్రభుత్వం ఆ మంత్రిని పదవి నుంచి తొలగించింది. మరోవైపు విద్యా వ్యవస్థ మొత్తంగా నాశనమైంది, ఉపాధి సమస్యకు కూడా పరిష్కారం లభించలేదు.
ఉదాహరణకు మన దేశంలో అండర్‌ గ్రాడ్యుయేషన్‌ (డిగ్రీ)లో చేరే విద్యార్థులు సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఇది వారిని తీవ్రంగా నష్టపోయే స్థితి వైపు నడిపించేలా ఉంది. నమోదైన, నమోదు కాని విద్యార్థులను బడ్జెట్‌ కోతల పర్యవసానాలు దిగ్భ్రాంతికి గురిచేస్తూ, వినాశకరమైన ప్రభావాన్ని చూపాయి. అన్ని ఆశలు కోల్పోయిన వారు శారీరక లేదా మానసిక శ్రమ తో కూడిన ఇతర వృత్తుల వైపు మళ్లుతున్నారు. ఇది వారి సున్నితమైన కౌమారదశకు ప్రమాదకరం. ప్రభుత్వం విద్య నుండి ఉద్దేశపూర్వకంగా వెనక్కి తగ్గడంతో వారు క్రూరమైన అజ్ఞాన ప్రపంచంలోకి నెట్టివేయబడుతున్నారు. పాఠశాలల విద్యా బడ్జెట్‌ మొత్తంలో 50 శాతం కోత విధించారు.
ఉన్నత విద్య విషయంలో కోత 33 శాతానికి మాత్రమే పరిమితం కావడం కొంత ఊరటనిచ్చే విషయం. కానీ కోతలు ఇంతటితో ఆగలేదు, ఇంకా చాలానే ఉన్నాయి. పాఠశాలలు మూసివేశారు. వాటి స్థానంలో 43 వేల ప్రైవేట్‌ పాఠశాలలు ప్రారంభించారు. డబ్బు గుంజడం, రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ భావజాలంతో కూడిన శిక్షణ పొందిన ఒక వర్గాన్ని తయారు చేయడం వీటి ప్రధాన ఉద్దేశ్యం. పిల్లలు తీవ్రమైన నిరాశావాదంతో బాధపడుతున్నారు. వారు తమ భవిష్యత్తును ఊహించుకోలేకపోతున్నారు, తద్వారా ఆశావాదాన్ని పూర్తిగా కోల్పోయారు. విద్యా వ్యవస్థను దెబ్బతీయడానికి ఒక ఉద్దేశపూర్వక ప్రయత్నం జరిగింది, ఇది యువతకు ఉపాధి అవకాశాలను మరింత బలహీనపరిచింది.
అందుబాటులో ఉన్న నివేదికల ప్రకారం, మొత్తం నమోదులలో 75 శాతానికి పైగా వాటా కలిగిన అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో చేరిన విద్యార్థుల సంఖ్య, 2022 2023- మధ్య రెండేళ్ల కాలంలో 93,000 (0.27 శాతం) తగ్గింది. దేశంలో అర్హత కలిగిన వయస్సులోని గల యువత జనాభా పెరుగుతున్నప్పటికీ ఈ పరిస్థితి నెలకొంది. అదే సమయంలో ఉన్నత విద్యాసంస్థల (హెచ్‌ఇఐల) సంఖ్య కూడా 2022- 59,533 నుండి 2023- 56,180కి తగ్గింది. ప్రధానంగా ఆర్ట్‌, సైన్స్‌, కామర్స్‌ కోర్సులలో ఈ తగ్గుదల ఉంది. అయితే, ప్రభుత్వం ఈ తగ్గుదలపై దృష్టి సారించకుండా, ‘స్థూల నమోదు నిష్పత్తి’లో నమోదైన స్వల్ప పెరుగుదలను మాత్రమే ఎక్కువ చేసి చూపిస్తోంది. అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌, డిప్లొమా, పిహెచ్‌డి, ఇతర సర్టిఫికేట్‌ కోర్సులతో కూడిన ఉన్నత విద్యలో మొత్తం నమోదులో పెద్దగా మార్పు లేదు. 2022 నుండి 2023 మధ్య ఇది కేవలం 3.7 లక్షలు లేదా 0.08 శాతం మాత్రమే పెరిగింది.
పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఈ తగ్గుదల అత్యధికంగా ఉంది. అలాగే ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్‌ వంటి కేంద్రపాలిత ప్రాంతాలలో కూడా అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల నమోదులో భారీ తగ్గుదల నమోదైంది.
ఆ నివేదిక ప్రకారం, దేశ రాజధాని, ఉన్నత విద్యకు ప్రధాన కేంద్రమైన ఢిల్లీలో, 2023 అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో చేరిన విద్యార్థుల సంఖ్య ఆరు శాతం తగ్గింది. తమిళనాడు, బిహార్‌, కర్నాటక, ఒడిశా రాష్ట్రాల్లో మాత్రమే నమోదు సంఖ్య పెరిగింది. ఈ పెరుగుదల దేశం మొత్తం పనితీరు మెరుగుపడటానికి దోహదపడింది. ముఖ్యంగా తమిళనాడులో 1.6 లక్షల నమోదులు పెరిగాయి. ఇది ఉత్తరప్రదేశ్‌లో నమోదైన 1.53 లక్షల భారీ తగ్గుదలను భర్తీ చేసింది.
వాస్తవానికి, రాష్ట్రాలకు అక్కడి ప్రజల అవసరాలకు అనుగుణంగా అడ్డంకులను స్వయంగా పరిష్కరించుకునే స్వేచ్ఛ ఇప్పుడు లేదు. మన ప్రజాస్వామ్య డిమాండ్లకు అనుగుణంగా రూపొందించిన మన విద్యా వ్యవస్థ ఉద్దేశ్యాన్ని నాశనం చేయడానికి స్పష్టమైన ప్రయ త్నం జరుగుతోంది. ఇప్పటివరకు పనిచేస్తున్న వ్యవస్థ స్వరూపాన్ని, లక్ష్యాలను మార్చే పద్ధతి నిరంతరాయంగా కొనసాగుతోంది. ఈ ప్రయత్నాలన్నింటి ఫలితమే గత పన్నెండేళ్లలో దేశంలో 152 పేపర్‌ లీకులు.
ఆర్థిక వ్యవస్థలో గుత్తాధిపత్యం వల్ల ఏర్పడిన ఉపాధి కొరత అత్యంత భయంకరమైన అడ్డంకి. ఇటీవల కాలంలో ఇది 40 శాతంగా ఉంది. విద్యార్థులు ఇతర ఉద్యోగాల కోసం సరైన విద్య, శిక్షణ పొందలేకపోతున్నారు. తద్వారా నిరుద్యోగంలోకి నెట్టివేయబడుతున్నారు. ఈ విద్యార్థులకు వ్యవస్థే అందుబాటులో లేకుండా పోయింది. పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. కేంద్రం తీసుకుంటున్న చర్యలలో ఏమాత్రం ఆశాకిరణం కనిపించడం లేదు.
కానీ ప్రభుత్వ వైఖరి నిరంకుశంగానే ఉంది. ఇటీవల ఢిల్లీలో విద్యార్థి నిరసనల సమయంలో, విద్యార్థుల సమస్యలను వినడానికి బదులుగా ప్రభుత్వం అత్యంత క్రూరంగా ప్రవర్తించింది. భద్రతా దళాలు నిరసన చేస్తున్న విద్యార్థులపై మెటల్‌ పెల్లెట్‌ గన్‌లతో కాల్పులు జరిపాయి. ఫలితంగా వారి కళ్లకు, మృదు కణజాలాలకు తీవ్ర గాయాలయ్యాయి . విద్యుత్‌ షాక్‌ ఇచ్చే పరికరాలతో పాటు మేకులు దింపిన లాఠీలను కూడా ఉపయోగించాయి. నిరసన చేస్తున్న విద్యార్థులు దాదాపు అందరూ ఢిల్లీలో వీధుల్లోకి వచ్చినప్పటికీ, నిరసనలు జరిగిన రోజుల్లో దాదాపు 17 మెట్రో స్టేషన్లు మూసివేయబడ్డాయి. అంతేకాకుండా, నిరసనలు ఉచ్ఛస్థితిలో ఉన్న రోజుల్లో కనీసం 17 మెట్రో స్టేషన్లలో రెండు ప్రాథమిక అవసరాలైన ఆహారం, నీరు అందుబాటులో ఉంచడానికి సరైన ఏర్పాట్లు లేవు.
పేపర్లను లీక్‌ చేసినట్లు రుజువైన వారికి శిక్షను పెంచే బిల్లును తీసుకురావడం వంటి పైపై చర్యలను ప్రభుత్వం ఇప్పుడు ఎంచుకుంది. పేపర్‌ లీక్‌ అనేది ఒక లక్షణం మాత్రమే. ఈ అసలైన సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఎలాంటి గంభీరమైన చర్యలు తీసుకునే ఉద్దేశం ప్రభుత్వానికి ఇప్పటికీ లేదు.
నిజానికి, విద్యావ్యవస్థలో మౌలికంగానే లోపాలు ఉన్నాయి. వాటిని తొలగించి, సంపూర్ణ మార్పు తీసుకురావడానికి ఒక చొరవ తీసుకోవడం అత్యవసరం. అలాగే, ఇలాంటి అక్రమ పద్ధతులను ఎదుర్కోవడానికి కఠినమైన చట్టం ఉండాలి. సంక్షోభాన్ని సమగ్రంగా పరిష్కరించకపోతే, ప్రజలకు విశ్వాసం ఉండదు. విద్య ఉపాధి ఆధారితంగా ఉండాలి. పాఠశాల విద్యలో అడుగుపెట్టినప్పటి నుంచే పిల్లలు ఒక కొత్త మార్గాన్ని నిర్దేశించుకుంటూ ఎదగాలి, అలాగే ఈ ప్రక్రియకు పాలక యంత్రాంగం తగిన సహకారాన్ని అందించాలి.

ట్యాగ్‌లు: Protest students students protest