Skip to content
తెలంగాణ వార్తలు

Today Weather Update: ఈ రోజు వాతావరణం.. బంగాళాఖాతం అల్పపీడన ద్రోణి.. తెలుగు రాష్ట్రాలకు వానలు అలర్ట్.. వచ్చే వారం పాటు భారీ వర్షాలు..

Prajapaksham 22 Jul 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Today Weather Update: ఈ రోజు వాతావరణం.. బంగాళాఖాతం అల్పపీడన ద్రోణి.. తెలుగు రాష్ట్రాలకు వానలు అలర్ట్.. వచ్చే వారం పాటు భారీ వర్షాలు..

Today Weather Update: ఈ రోజు వాతావరణం.. బంగాళాఖాతంలో అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. వచ్చే వారం పాటు భారీ వర్షాలు..

Today Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. గత రెండు నెలలుగా వర్షాల్లేక ఎండలు, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. ఈ రోజు వాతావరణం (Today Weather Update) చూసినట్లయితే.. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి త్వరలోనే బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల్లో జూలై 27 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే ప్రమాదం ఉందని.. సముద్రతీరంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.ఈ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

తెలంగాణ రాష్ట్రంలో మధ్యాహ్నం నుంచే వాతావరణం మారిపోయి పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రాత్రి వేళ వానలు దంచి కొట్టగా, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది. ఈ సీజన్‌లోనే అత్యధికంగా మంచిర్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షపాతం నమోదైంది. మంచిర్యాల జిల్లా పరిధిలోని జనకాపూర్, కోటపల్లి, తాండూరు ప్రాంతాల్లో 12 సెంటీమీటర్లకు పైగా వర్షం కురవడం గమనార్హం. వీటితో పాటు పెద్దపల్లి, ములుగు, కొమురం భీమ్ ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల జిల్లాల్లోనూ వర్షాలు ముంచెత్తాయి. సుదీర్ఘ విరామం తర్వాత వర్షాలు ఊపందుకోవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ వాతావరణం కాస్త చల్లబడింది. వివిధ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతుండగా.. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో రాబోయే నాలుగు రోజుల్లో మరింత తీవ్రంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ వ్యాప్తంగా వర్షాలు విస్తరించే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.