Parliament LIVE: ప్రతిపక్షాల నిరసనల నడుమ లోక్సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా..
Parliament LIVE: ప్రతిపక్షాల నిరసనల నడుమ లోక్సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా..
Parliament LIVE: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల మొదటి రోజైన సోమవారం ఉదయం లోక్సభలో ప్రతిపక్షాల నిరసనలు హోరెత్తాయి. నీట్ యూజీ (NEET-UG) పేపర్ లీక్ వివాదం, దేశంలో నెలకొన్న పలు ఇతర కీలక అంశాలపై ప్రతిపక్ష ఎంపీలు వెల్లోకి దూసుకెళ్లి ప్లకార్డులతో నిరసన ప్రదర్శనకు దిగారు. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రతిపక్షాలు ఆందోళనను ఉధృతం చేయడంతో గందరగోళ వాతావరణం నెలకొంది.
ఈ తరుణంలో నిరసన తెలుపుతున్న సభ్యులను ఉద్దేశించి స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ.. దయచేసి అందరూ మీ మీ స్థానాల్లో కూర్చోండి. సభ సజావుగా సాగేందుకు, ప్రజా సమస్యలపై చర్చించేందుకు సహకరించండని పదేపదే విజ్ఞప్తి చేశారు.
అయినప్పటికీ ప్రతిపక్ష ఎంపీలు వెనక్కి తగ్గకుండా నినాదాలు కొనసాగించడంతో.. స్పీకర్ సభను నేడు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.