Skip to content
బిజినెస్ వార్తలు

PM Kisan Complete Guide: పీఎం కిసాన్ యోజన గురించి పూర్తి వివరాలు మీ కోసం A to Z…

Prajapaksham 07 Jul 2026 1 నిమిషాల పఠనం బిజినెస్
PM Kisan Complete Guide: పీఎం కిసాన్ యోజన గురించి పూర్తి వివరాలు మీ కోసం A to Z…

PM Kisan Complete Guide: పీఎం కిసాన్ యోజన గురించి పూర్తి వివరాలు మీ కోసం A to Z...

PM Kisan అంటే ఏంటి..?

ప్రధానమంత్రి కిసాన్ యోజన అనేది రైతులను ఉద్దేశించి రూపొందించిన ఒక ప్రత్యక్ష ఆర్థిక ప్రయోజనం అందించే కేంద్ర ప్రభుత్వ పథకం. భారత ప్రభుత్వం రైతుల కోసం ప్రత్యక్ష ఆదాయ మద్దతు అందించే ఈ స్కీములో భాగంగా ఒక్కొక్క అర్హులైన రైతు కుటుంబానికి 6000 రూపాయల ఆర్థిక సహాయం లభిస్తుంది. ఈ 6000 రూపాయలను మొత్తం మూడు సమానమైన వాటాలలో 2000 రూపాయల చొప్పున బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. పీఎం కిసాన్ యోజన స్కీమ్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు పది కోట్ల మందికి పైగా రైతులు ప్రత్యక్ష లబ్ధిదారులుగా ఉన్నారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ జూలై మధ్యాహ్నం కాలంలో తొలి విడత 2000 రూపాయలు రైతుల అకౌంట్లో డైరెక్ట్ టు బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి. ఆ తరువాత రెండో విడత కింద ఆగస్టు నవంబర్ మధ్యలో మరో రెండు వేల రూపాయలు రైతుల ఖాతాలో జమ అవుతాయి. ఆ తర్వాత డిసెంబర్ మార్చి మధ్యలో నేరుగా రైతుల ఖాతాల్లో మరో రెండు వేల రూపాయలు జమ అవుతాయి. లభించే ఈ డబ్బు పూర్తిగా 100% కేంద్ర ప్రభుత్వం నిధులతో ఆర్థిక సహాయం లభిస్తుంది. దీన్ని కేంద్ర ప్రభుత్వం రుణం రూపంలో కానీ సబ్సిడీ రూపంలో కానీ అందించడం లేదన్న సంగతి గుర్తుంచుకోవాలి. పీఎం కిసాన్ యోజన ద్వారా డబ్బు లభించే డబ్బును రైతులు వ్యవసాయ పనుల కోసం లేదా వ్యవసాయేతర పనుల కోసం కూడా ఉపయోగించవచ్చు.


PM Kisan Eligibility:

పీఎం కిసాన్ యోజన ద్వారా సాగు భూమి కలిగిన రైతులు ఆర్థిక లబ్ధి పొందడానికి అర్హులుగా చెప్పవచ్చు. అలాగే గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని చిన్న సన్న రైతులందరూ కూడా పీఎం కిసాన్ యోజన స్కీమ్ కు అర్హులు. అయితే ఆదాయపన్ను చెల్లించే వ్యక్తులు పీఎం కిసాన్ యోజనకు అర్హులు కారు. అలాగే పదివేల రూపాయల కన్నా ఎక్కువ పెన్షన్ పొందుతున్న ఉద్యోగులు కూడా అర్హులు కాదు. దీంతో పాటు రాజ్యాంగ పదవులను నిర్వహిస్తున్న లేదా గతంలో నిర్వహించిన వ్యక్తులు కూడా పీఎం కిసాన్ యోజన స్కీమ్ పొందడానికి అర్హులు కాదు.


PM Kisan Registration:

పీఎం కిసాన్ యోజన కోసం ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ సందర్శించాల్సి ఉంటుంది. ఈ అధికారిక వెబ్సైట్లో హోం పేజీలో ఫార్మర్ కార్నర్ అనే విభాగంలో న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అనంతరం ఇందులో మీ ఆధార్ నెంబరు మొబైల్ నెంబరు ఎంటర్ చేసి ఓటిపి ద్వారా ధృవీకరించాల్సి ఉంటుంది. దీంతోపాటు దరఖాస్తు ఫారం లో మీ భూమి వివరాలు వ్యక్తిగత సమాచారము అలాగే ఆధార్ తో అనుసంధానించిన బ్యాంకు వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.

PM Kisan eKYC
ఇక ఈ పథకానికి సంబంధించిన లబ్ధిదారుల విషయానికి వచ్చినట్లయితే పీఎం కిసాన్ యోజన డబ్బులు మీ అకౌంట్ లో నిరంతరం పడాలి అనుకున్నట్లయితే పిఎం కిసాన్ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు ఓటీపీ ఆధారిత ఈ కేవైసీ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం మీ ఆధార్ కార్డు, అలాగే పట్టాదార్ పాస్ బుక్కు, దీంతోపాటు బ్యాంకు ఖాతా బుక్కు అవసరం అవుతాయి. మీ ఫోన్ నెంబర్ ద్వారా ఎప్పటికప్పుడు పీఎం కిసాన్ యోజనకు సంబంధించిన అప్డేట్స్ పొందవచ్చు. ఈ కేవైసీ మీరు సొంతంగా చేసుకోలేకపోతే మీ సమీపంలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్ లేదా మీసేవ కేంద్రానికి వెళ్లి కావాల్సిన డాక్యుమెంట్లను సబ్మిట్ చేయడం ద్వారా పీఎం కిసాన్ యోజన లబ్ధిదారులుగా కొనసాగవచ్చు.

PM Kisan Beneficiary Status
పీఎం కిసాన్ యోజన లబ్ధిదారులుగా మీరు ఉన్నారా లేదా ముందే తెలుసుకోవాలి అనుకున్నట్లయితే పిఎం కిసాన్ యోజన హోమ్ పేజీ పోర్టల్ లోకి వెళ్లి నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది అనంతరం ఇందులో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ను ఉపయోగించి గతంలో మీకు డబ్బులు క్రెడిట్ అయ్యాయా లేదా అనే సంగతి తెలుసుకోవచ్చు.

ట్యాగ్‌లు: business news