PAN Cardలో పేరు, తండ్రి పేరు, డేట్ ఆఫ్ బర్త్ (DOB) ఎలా మార్చాలి?
PAN Cardలో పేరు, తండ్రి పేరు, డేట్ ఆఫ్ బర్త్ (DOB) ఎలా మార్చాలి? (Image Source: Wiki pedia)
పాన్ కార్డు అనేది ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి అత్యవసరమైన డాక్యుమెంట్ అని చెప్పవచ్చు. పాన్ కార్డు లేకుండా టాక్స్ ఫైలింగ్ అనేది దాదాపు అసాధ్యం. అలాగే బ్యాంక్ అకౌంట్ తెరవాలన్నా, ఇతర ఆర్థిక లావాదేవీల కోసం పాన్ కార్డు అనేది తప్పనిసరి. మనం పన్ను ఆదాయం ఎంత చెల్లిస్తున్నామో మన పన్ను చరిత్ర తెలుసుకునేందుకు కూడా పాన్ కార్డు అనేది ఒక పర్మినెంట్ అకౌంట్ నెంబర్ ఫార్మాట్లో నిక్షిప్తమై ఉంటుంది. దీని ఆధారంగానే లోన్లు సైతం పొందవచ్చు. మీ సిబిల్ స్కోర్ చెక్ చేయాలన్నా కూడా పాన్ కార్డు నెంబర్ అనేది తప్పనిసరి. ప్రస్తుత డిజిటల్ యుగంలో పాన్ కార్డు లేకుండా ఎలాంటి బ్యాంకింగ్ వ్యవహారం కూడా జరపలేమో అన్న సంగతి గుర్తుంచుకోవాలి. . ఈ నేపథ్యంలో మీరు పాన్ కార్డులో ఎలాంటి తప్పులు లేకుండా అప్లై చేసుకునేటప్పుడే అన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. . కొన్ని సందర్భాల్లో డేట్ అఫ్ బర్త్, లేదా తండ్రి పేరు వంటివి మార్చుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫార్మేట్ ఏంటి వంటి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. . ముఖ్యంగా పాన్ కార్డులో డేటాఫ్ బర్త్ చేంజ్ చేయడం అనేది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం…. దీనికి సంబంధించిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలుసుకుందాం.
- ముందుగా అధికారిక వెబ్సైట్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. దీని కోసం utiitsl అధికారిక వెబ్ సైట్ లేదా https://onlineservices.proteantech.in/paam/endUserRegisterContact.html వెబ్ పేజీలోకి వెళ్లాల్సి ఉంటుంది.
- ఇఫ్పుడు అప్లికేషన్ ఫారం నింపాలి. ఇందులో Changes or Correction in existing PAN Data/Reprint of PAN Card’ అని ఎంచుకోవాల్సి ఉంటుంది.
- ఇప్పుడు కేటగిరిలో ఇండివిజువల్ అని సెలెక్ట్ చేసుకోవాలి.
- ఆ తర్వాత అప్లికెంట్ ఇన్ఫర్మేషన్ విషయానికి వస్తే, మీ పేరు, పుట్టిన తేదీ, ఈమెయిల్, మొబైల్ నెంబర్, ప్రస్తుత పాన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
- అనంతరం Submit బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత టోకెన్ నెంబర్ గుర్తుంచుకొని భవిష్యత్తులో ట్రాక్ చేసుకోవచ్చు.
- అనంతరం డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకోసం Continue with PAN Application Form క్లిక్ చేయాలి. ఇందు కోసం మొత్తం 3 ఆఫ్షన్స్ ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఇందు కోసం మొద్టి పద్ధతిలో Submit scanned images through e-Sign ఎంపిక చేసుకుంటే ఇందులో ఫోటోలు, సంతకం అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
- ఇక రెండో పద్ధతిలో Forward application documents physically అంటే మీరు ఫారం ప్రింట్ తీసుకొని డాక్యుమెంట్లను పోస్ట్ చేయాల్సి ఉంటుంది.
- e-KYC (Aadhaar based) ఈ పద్ధతి ద్వారా చాలా సులభంగా మీరు మొబైల్ ఫోన్ ద్వారా ఓటిపి ఎంటర్ చేసి పని పూర్తి చేసుకోవచ్చు. తద్వారా మీరు ఎంపిక చేసుకున్న మార్పులు కనిపిస్తాయి.
- అనంతరం Changes or correction in existing PAN data అనే బాక్స్ ను టిక్ చేయాల్సి ఉంటుంది.
- ఇప్పుడు మీరు ఏ వివరాలు మార్చాలని అనుకుంటున్నారో ఆ వివరాల పక్కన చెక్ బాక్స్ లో టిక్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు పేరు చేంజ్ చేయాలని ఉంటే నేమ్ చేంజ్ అనే బాక్స్ టిక్ చేయాలి. లేదంటే తండ్రి పేరు, DOB కూడా టిక్ చేసి చేంజ్ చేసుకోవచ్చు.
- ఇప్పుడు కావాల్సిన డాక్యుమెంట్స్ మీకు అవసరం అవుతాయి. పేరు మార్పు కోసం అయితే ముఖ్యంగా మహిళలకు పెళ్లి తర్వాత అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ లేదా గెజిట్ నోటిఫికేషన్ సబ్మిట్ చేయాలి.
- డేటా ఆప్ బర్త్ చేంజ్ కోసం అయితే బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, పదవ తరగతి సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ఇక తండ్రి పేరు మార్చాలంటే తండ్రి ఆధార్ కార్డు లేదా తండ్రి పాన్ కార్డు కాపీ సబ్మిట్ చేయాలి.
- అనంతరం పేమెంట్ చేయాలి. ఇందు కోసం అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. దీన్ని మీరు యూపీఐ ద్వారా కానీ ఇతర ఆన్ లైన్ చెల్లింపు ద్వారా చెల్లించవచ్చు. అనంతరం పేమెంట్ పూర్తి అయ్యాక ఈ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు అక్ నాలెడ్జ్ మెంట్ నెంబర్ వస్తుంది. దీన్ని బట్లి రాబోయే కొత్త ప్యాన్ కార్డులో మీరు కోరిన మార్పు జరిగిందో లేదో అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
- ఈ పద్ధతిలో మీకు సహాయం కావాలంటే మీ సమీపంలోని పాన్ కార్డు సేవాకేంద్రం లేదా మీ సేవా కేంద్రం ను సంప్రదిస్తే మంచిది.