Skip to content
తాజా
నేను పరారీలో లేను.. భారతదేశానికి తిరిగి వచ్చే ఆలోచన లేదు.. లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు.. చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం..పలు కీలక నిర్ణయాలకు ఆమోదం.. పూర్తి వివరాలు ఇవే ప్రకాశం జిల్లాలో ఒంగోలులో ఘోర విషాదం.. నీటి కుంటలో ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు మృతి.. అస్సాంలో మైనర్ బాలికపై దారుణం.. కారులో బంధించి నెలల పాటు గ్యాంగ్ రేప్..ఐదుగురు నిందితుల అరెస్ట్ సముద్రం రక్తమోడింది.. ఫారో దీవుల్లో 700కు పైగా తిమింగలాలు, డాల్ఫిన్ల ఊచకోత.. మండిపడుతున్న జంతు హక్కుల సంఘాలు.. కాంగోలో ఎబోలా కలకలం.. అంత్యక్రియల బృందంపై దాడి.. 11 మంది రోగులు చికిత్స కేంద్రం నుంచి పరార్ ఐఎండీ చల్లని కబురు.. కేరళ, తమిళనాడును తాకిన నైరుతి రుతుపవనాలు.. పంజాబ్‌లోని ఐదు ప్రధాన ఆలయాలకు బాంబు బెదిరింపులు..భారీ భద్రతా చర్యలు చేపట్టిన పోలీసులు.. అసలు నీ ఊరేది.. నువ్వెవడివి?.. ప్రకాశ్‌రాజ్‌పై నిర్మాత బండ్ల గణేష్ నిప్పులు! అమరావతి అద్భుతం అయితే హైదరాబాద్‌లో ఎందుకున్నారు..పవన్, చంద్రబాబుపై గుత్తా సుఖేందర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు.. నేను పరారీలో లేను.. భారతదేశానికి తిరిగి వచ్చే ఆలోచన లేదు.. లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు.. చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం..పలు కీలక నిర్ణయాలకు ఆమోదం.. పూర్తి వివరాలు ఇవే ప్రకాశం జిల్లాలో ఒంగోలులో ఘోర విషాదం.. నీటి కుంటలో ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు మృతి.. అస్సాంలో మైనర్ బాలికపై దారుణం.. కారులో బంధించి నెలల పాటు గ్యాంగ్ రేప్..ఐదుగురు నిందితుల అరెస్ట్ సముద్రం రక్తమోడింది.. ఫారో దీవుల్లో 700కు పైగా తిమింగలాలు, డాల్ఫిన్ల ఊచకోత.. మండిపడుతున్న జంతు హక్కుల సంఘాలు.. కాంగోలో ఎబోలా కలకలం.. అంత్యక్రియల బృందంపై దాడి.. 11 మంది రోగులు చికిత్స కేంద్రం నుంచి పరార్ ఐఎండీ చల్లని కబురు.. కేరళ, తమిళనాడును తాకిన నైరుతి రుతుపవనాలు.. పంజాబ్‌లోని ఐదు ప్రధాన ఆలయాలకు బాంబు బెదిరింపులు..భారీ భద్రతా చర్యలు చేపట్టిన పోలీసులు.. అసలు నీ ఊరేది.. నువ్వెవడివి?.. ప్రకాశ్‌రాజ్‌పై నిర్మాత బండ్ల గణేష్ నిప్పులు! అమరావతి అద్భుతం అయితే హైదరాబాద్‌లో ఎందుకున్నారు..పవన్, చంద్రబాబుపై గుత్తా సుఖేందర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు..
తెలంగాణ వార్తలు

అసలు నీ ఊరేది.. నువ్వెవడివి?.. ప్రకాశ్‌రాజ్‌పై నిర్మాత బండ్ల గణేష్ నిప్పులు!

Prajapaksham 04 Jun 2026 0 నిమిషాల పఠనం తెలంగాణ
అసలు నీ ఊరేది.. నువ్వెవడివి?.. ప్రకాశ్‌రాజ్‌పై నిర్మాత బండ్ల గణేష్ నిప్పులు!

Prakash Raj and Bandla Ganesh

టాలీవుడ్ ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్, టాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ నిర్మాత బండ్ల గణేష్ మధ్య సోషల్ మీడియా వేదికగా ఒక్కసారిగా మాటల యుద్ధం ముదిరింది. జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ప్రకాశ్‌రాజ్ చేసిన ఒక వ్యంగ్య పోస్టుపై బండ్ల గణేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తే తను ఊరుకునేదే లేదంటూ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ప్రకాశ్‌రాజ్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు.

ఇటీవలే పవన్ కల్యాణ్ రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తెలంగాణలో కూడా పోటీ చేస్తుందని అధికారికంగా ప్రకటించారు. ఈ పరిణామంపై స్పందించిన ప్రకాశ్‌రాజ్.. ఎక్కడా నేరుగా పవన్‌ కల్యాణ్‌ పేరును ఎత్తకుండానే తనదైన శైలిలో ట్విట్టర్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. “మీరొస్తానంటె మేమొద్దంటామా..? రండి దొర.. కానీ వచ్చే ముందు.. ఉత్తుత్తినే వస్తున్నారా..? పొత్తుతో వస్తున్నారా..? లేదంటే సింగిల్‌గా వస్తున్నారా..? అది చెప్పి రండి” అంటూ ప్రకాశ్‌రాజ్‌ ట్వీట్ చేశారు. ఈ పోస్ట్ పవన్ కల్యాణ్ అభిమానులకు, జనసేన శ్రేణులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది.

పవన్ కల్యాణ్‌కు పరమ భక్తుడిగా చెప్పుకునే నిర్మాత బండ్ల గణేష్‌కు ఈ ట్వీట్‌తో గట్టిగా సురుకు అంటుకుంది. ప్రకాశ్‌రాజ్‌ వ్యాఖ్యలపై ఆయన అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ప్రకాశ్‌రాజ్ వ్యక్తిత్వాన్ని, ఆయన ప్రవర్తనను ప్రశ్నిస్తూ ట్విట్టర్‌లోనే తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.

“నీకెందుకు ప్రతి దాంట్లో వేలుపెట్టడం..? అసలు నువ్వెవడివి..? తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా..? నీ ఊరు ఏది, నీ కథ ఏంటి..? ప్రతి ఊర్లో, ప్రతి అంశంలో దూరి జడ్జిమెంట్‌లు ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్‌వా లేక దేశ ప్రధానివా..?” అని బండ్ల గణేష్ నిలదీశారు.

అంతటితో ఆగకుండా.. “ఎక్కడ చూసినా నువ్వే, ఏ విషయం వచ్చినా నువ్వే ఉంటావు. నీకు పని లేకపోతే ఏదైనా చూసుకో. కానీ అందరి విషయాల్లో దూరి ఇక్కడ పెద్ద హీరోలా ఫీలవ్వకు. ముందు నీ అడ్రస్ ఏంటో నువ్వు తెలుసుకో, ఆ తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చెయ్” అంటూ బండ్ల గణేష్ అత్యంత ఘాటుగా సమాధానమిచ్చారు. పవన్ కల్యాణ్‌ను తెలంగాణ రాజకీయాల్లోకి ఆహ్వానిస్తూనే ప్రకాశ్‌రాజ్ చేసిన వెటకారానికి, బండ్ల గణేష్ ఇచ్చిన ఈ ‘సరిహద్దుల’ కౌంటర్ ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్‌తో పాటు ఉభయ రాష్ట్రాల రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *