హైదరాబాద్‌లో దంచి కొట్టిన వాన.. జలమయమైన రహదారులు, స్తంభించిన ట్రాఫిక్
Hyderabad Rain
హైదరాబాద్‌లో శుక్రవారం కురిసిన భారీ వర్షం నగర ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. పలు ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోగా, అనేక చోట్ల ట్రాఫిక్ స్తంభించింది. కార్యాలయాల నుంచి ఇంటికి బయలుదేరిన ఉద్యోగులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు.
భారీ వర్ష సూచనలతో హైదరాబాద్ వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికల ముందే నిజమయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి కుండపోత వర్షం దంచి కొట్టింది. మబ్బుల ముసుగుతో నగరం చీకటిమయంగా మారిపోగా, గంటల వ్యవధిలోనే నగరంలోని పలు కీలక ప్రాంతాలను వర్షపు నీరు ముంచెత్తింది.
హైదరాబాద్‌లో శుక్రవారం కురిసిన భారీ వర్షం నగర ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. పలు ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోగా, అనేక చోట్ల ట్రాఫిక్ స్తంభించింది. కార్యాలయాల నుంచి ఇంటికి బయలుదేరిన ఉద్యోగులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. వాహనదారులు అవసరమైతే మాత్రమే బయటకు రావాలని, నీటితో నిండిన రహదారులపై జాగ్రత్తగా ప్రయాణించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. పరిస్థితిని పర్యవేక్షిస్తూ నీటి నిల్వలను తొలగించేందుకు జీహెచ్‌ఎంసీ, విపత్తు నిర్వహణ బృందాలు చర్యలు చేపట్టాయి.
ఐటీ కారిడార్ పరిధిలోని హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, రాయదుర్గంలతో పాటు అమీర్‌పేట్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, కూకట్‌పల్లి ప్రాంతాల్లో వర్షం తీవ్రరూపం దాల్చింది. ఈ కుండపోత దెబ్బకు రహదారులు చెరువులను తలపించగా, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల రోడ్లపై మోకాలు లోతు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
మధ్యాహ్న సమయంలో వర్షం తీవ్రం కావడంతో ఆఫీసుల నుంచి బయటకు వచ్చిన ఉద్యోగులు, వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. ముఖ్యంగా హైటెక్ సిటీ, గచ్చిబౌలి కారిడార్‌లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.వర్షం తీవ్రతను ముందుగానే ఊహించిన ట్రాఫిక్ పోలీసులు ఐటీ కంపెనీలకు ముందస్తు అడ్వైజరీ జారీ చేశారు. ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సాధ్యమైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కల్పించాలని, ఆఫీసుల్లో ఉన్నవారికి ముందస్తు లాగౌట్ (Early Logout) ఇవ్వాలని కంపెనీలను కోరారు.
వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో జీహెచ్‌ఎంసీ మన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, హైడ్రా (HYDRAA) మరియు ట్రాఫిక్ పోలీసులు రోడ్లపైకి వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. మ్యాన్‌హోల్స్ క్లియర్ చేయడం, నిలిచిన నీటిని దిగువకు మళ్లించడం మరియు ట్రాఫిక్‌ను క్లియర్ చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. నగరంలో ఇంకా వర్ష ప్రభావం కొనసాగే అవకాశం ఉన్నందున అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచించారు. తెగిపడిన విద్యుత్ వైర్లు, విద్యుత్ స్తంభాలు, పొంగిపొర్లుతున్న మ్యాన్‌హోల్స్ వద్ద అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వాహనదారులు ప్రయాణాలను కొంత సమయం వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
- Indiramma Houses Update: ఇందిరమ్మ ఇళ్ల సాయం పెంచాలి.. రూ. 5 లక్షల ఆర్థిక సహాయం సరిపోవడం లేదు..కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి డిమాండ్..
- IMD Weather Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులు విస్తారంగా వర్షాలు..
- Using E20 Petrol? E20 పెట్రోల్‌తో వాహనాలకు నష్టం లేదు.. భయపడాల్సిన అవసరం లేదని తెలిపిన పొన్నం ప్రభాకర్
- పారిశుద్ధ్య కార్మికులు…ఈ మరణాలు ఇంకెన్నేళ్లు?
- Delhi PG collapse: నియంత్రణ కోల్పోయిన ‘పిజి’ సంస్కృతి