దేశంలో ఎన్‌డిఎ అవినీతి పాలనపై సీపీఐ పోరు బాట.. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలతో నిరసన..
CPI Begins Statewide Protest Marches
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (CPI) రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 6 నుంచి 14 వరకు పాదయాత్రలు (పోరు యాత్రలు) నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా నిరుద్యోగం, ధరల పెరుగుదల, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, కార్మిక హక్కుల పరిరక్షణ, వ్యవసాయ సమస్యలు వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది.
కేంద్రంలోని బిజెపి ఎన్‌డిఎ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ఆగస్టు 6 నుండి 14 వరకు జరుగు పాదయాత్రలు ఈ రోజు ఆగస్టు 6న రాష్ట్ర వ్యాపితంగా ప్రారంభమయ్యాయి. పినపాక మండలం ఏడూళ్ల బయ్యారంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు పాదయాత్రను ప్రారంభించారు.
ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ బిజేపి రూపాన దేశంలో అవినీతి సాగుతోందని, ప్రజాస్వామాన్ని పరిరక్షించుకునేందుకు బద్లావ్ జారూరి హై మార్పు కావాలని, మార్పు అనివార్యమని అని ఆయన అన్నారు. మోడి అనుకూల కార్పోరేట్ శక్తుల రూపంలో దేశంలో అవినీతి రాజ్యమేలుతున్నదని అన్నారు. దేశ ప్రజల సంపదను కారుచౌకుగా దోచుకుంటున్నారని వారు మండిపడ్డారు. నీట్ పేపర్ లీకేజీలు, ప్రజా ధనాన్ని కారుచౌకుగా దోచుకునే బడా చోరీలు, విద్య వైద్యం ప్రైవేటు దోచుకోవడం వంటి దేశంలో నిసిగ్గుగా సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యవసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా వాటిని అదుపు చేయలేకపోతున్నారని ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన బిజేపి నిరుద్యోగ భారతాన్ని తయారు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో దేశ యువత క్రీయాశీలక పాత్ర పోషిస్తూ చేసిన పోరాటం దేశం చరిత్రలోనే చిరస్మరణీయమని, ఆ పోరాటానికి కేంద్రం దిగిరాక తప్పలేదని, యువత దెబ్బకు విద్యాశాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు. యువతరం తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అని దేశతలరాతని మార్చే సత్తా యువతకే ఉందన్నారు. కేంద్రంలో సాగుతున్న నిరంకుశ పాలన వల్ల ధరలు పెరిగిపోతున్నాయని, సార్వత్రిక విద్య వైద్యం అందుబాటులో లేదని, యువత నిరుద్యోగ సమస్యతో సతమతమవుతున్నారని పంటలకు కనీస మద్దతు ధర లేదని, కార్మిక హక్కులు కాలరాస్తున్నారని, దళితులు ఆదివాసీలపై అకృత్యాలు నానాటికీ పెరిగిపోతున్నాయన మండిపడ్డారు.ఇంకా చూస్తూ ఊరుకుంటే దేశానికి భావితరానికి మంచిది కాదని సాంబశివరావు చెప్పారు.
ఈ పాదయాత్రలను సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి మునుగోడులో, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు హనుమకొండలో, ఈటి నర్సింహ హైదరాబాద్‌లో, సిపిఐ సీనియర్ నాయకులు చాడ వెంకటరెడ్డి కరీంనగర్‌లో, కలవేణి శంకర్ మంచిర్యాల మరియు బెలంపల్లి నియోజకవర్గం తాండూరులో, బాగం హేమంత రావు ఖమ్మం, ఎం.బాలనర్సింహ నాగర్‌కర్నూల్‌లో, బోస్ ఈసిఎల్, ఎంఎల్‌సి నెల్లికంటి సత్యం మునుగోడులో ప్రారంభించారు.
దేశంలో పెరిగిపోతున్న ధరలను తక్షణమే అరికట్టాలని, ప్రతి యువకుడికి ఉద్యోగం కల్పించాలని, సార్వత్రిక విద్య, ఆరోగ్యం అందుబాటులోకి తేవాలని, మహిళా రిజర్వేషన్‌ను తక్షణం అమలు చేయాలని, పంటలకు కనీస మద్దతు ధరకు చట్ట భద్రత కల్పించాలని, కార్మికుల హక్కులను పరిరక్షించాలని, బ్యాలెట్ పేపర్ పద్దతిలో ఎన్నికలను పునరుద్దరించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, దళిత, ఆదివాసీలపై జరుగుతున్న అకృత్యాలను దాడులను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ పాదయాత్రలు రాష్ట్ర వ్యాపితంగా జరుగుతున్నాయి.
- Telangana SIR: తెలంగాణలో ఓటర్లకు అలర్ట్.. 43 లక్షల మంది ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం.. స్పందించకపోతే తుది జాబితా నుంచి తొలగింపు
- Andhra Pradesh Rain Alert: ఏపీకి రెడ్ అలర్ట్.. దూసుకొస్తున్న వాయుగుండం.. రేపు రాత్రి విశాఖ–గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశం..
- Khairatabad Ganesh Darshan: భక్తులకు అలర్ట్.. ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం రేపు అర్ధరాత్రి వరకే.. 23 తర్వాత భక్తులకు నో ఎంట్రీ.. 25న నిమజ్జనం..
- NIMS ACB Raids: నిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్‌పై ఏసీబీ దాడులు.. 13 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు..
- HIV Treatment Update: HIV చికిత్సలో కీలక ముందడుగు.. రోజూ టాబ్లెట్లకు బదులు 8 వారాలకు ఒకసారి ఇంజెక్షన్..