అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరణ.. లండన్ నుంచే హైదరాబాద్‌కు సీఎం Revanth Reddy
CM Revanth Reddy’s Key Message at Tungabhadra Brings New Hope for Farmers of Three States
తెలంగాణ సీఎం ఎ. Revanth Reddy అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. రాజకీయ కారణాలతో క్లియరెన్స్ ఇవ్వలేమని విదేశాంగ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. అమెరికా పర్యటనలో బోస్టన్, న్యూయార్క్ తదితర ప్రాంతాల్లో పర్యటించి హార్వర్డ్, MIT, నార్త్‌ఈస్టర్న్ యూనివర్సిటీ, వర్జీనియా టెక్ వంటి ప్రముఖ విద్యాసంస్థలతో ఒప్పందాలు చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.అయితే కేంద్రం అనుమతి నిరాకరించడంతో సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా వెళ్లకుండా ఆగస్టు 23న లండన్ నుంచి హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు.
అమెరికా పర్యటనను అధికారులు కొనసాగించాలని, ఆయా విద్యాసంస్థలతో MoUs, భాగస్వామ్య ఒప్పందాలను పూర్తి చేయాలని సీఎం Revanth Reddy ఆదేశించారు.విద్య, నైపుణ్యాలు, యువత భవిష్యత్తు విషయంలో రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు.
లండన్‌లో సీఎం తన షెడ్యూల్ ప్రకారం ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, లండన్ బిజినెస్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ లండన్ తదితర విద్యాసంస్థల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. అలాగే బ్రిటన్‌లోని ప్రముఖ క్రీడా, నైపుణ్యాభివృద్ధి సంస్థలతోనూ చర్చలు జరిపి తెలంగాణతో భాగస్వామ్యాలకు ప్రయత్నించనున్నారు.
“తెలంగాణRising ఆగదు. యువత భవిష్యత్తు, రాష్ట్ర అభివృద్ధి, దేశ ప్రగతి రాజకీయాల కంటే ఎంతో ముఖ్యమైనవి” అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
- Ames Meteorite Crater: ఉల్క దాడి 10 కోట్ల ఏళ్లు ఆలస్యంగా జరిగిందా.. Ames క్రేటర్‌పై శాస్త్రవేత్తల కొత్త అంచనా.. ఓక్లహామా ఉల్కాబిలంపై సంచలన పరిశోధన
- Bathukamma Secret: బతుకమ్మ పండుగలో దాగి ఉన్న అసలు సీక్రెట్ ఇదే.. పూల పండుగ వెనుక ఇంత పెద్ద కథ ఉందా?
- Boddemma Festival: బతుకమ్మకు ముందు వచ్చే బొడ్డెమ్మ పండుగ ప్రత్యేకత ఏంటి.. 7 రోజుల పాటు ఎందుకు జరుపుకుంటారు..
- CEC Gyanesh Kumar Row: CEC జ్ఞానేశ్ కుమార్‌ను సస్పెండ్ చేయాలన్న పిటిషన్లపై విచారణ.. కేంద్రం, ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు..
- Russia-Ukraine War: ఉక్రెయిన్‌లో భారత ఫార్మా ప్లాంట్‌పై రష్యా డ్రోన్ దాడి.. ఒకరు మృతి, రూ.400 కోట్లకు పైగా నష్టం..