ప్రపంచ తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్.. అమెరికా స్టాక్ మార్కెట్లో రికార్డు సెట్ చేసిన స్పేస్‌ఎక్స్ IPO
SpaceX IPO Makes Elon Musk the World's First Trillionaire
ప్రముఖ స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ,టెక్నాలజీ సంస్థ ‘స్పేస్ఎక్స్’ (SpaceX) అమెరికా స్టాక్ మార్కెట్లో చరిత్ర సృష్టించింది. వాల్‌స్ట్రీట్ చరిత్రలోనే అత్యంత భారీ ఐపీవో (IPO) ద్వారా ఈ కంపెనీ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ ఐపీవో విక్రయాల విజయంతో కంపెనీ సీఈవో ఎలన్ మస్క్ సంపద సరికొత్త శిఖరాలకు చేరింది. కాగితంపై (on paper) ఆయన ప్రపంచంలోనే మొట్టమొదటి ‘ట్రిలియనీర్’ (లక్ష కోట్ల డాలర్ల అధిపతి) గా అవతరించారు.
అమెరికా మార్కెట్లో నాస్‌డాక్ (Nasdaq) ట్రేడింగ్‌లో ప్రవేశించిన స్పేస్ఎక్స్ కంపెనీ, తన క్లాస్-ఏ కామన్ స్టాక్‌కు చెందిన 555.56 మిలియన్ల షేర్లను విక్రయించింది. హాట్‌కేకుల్లా అమ్ముడుపోయిన ఈ ఐపీవోలో ఒక్కొక్క షేర్ ధరను 135 డాలర్లుగా నిర్ణయించారు. దీని ద్వారా స్పేస్ఎక్స్ సంస్థ ఏకంగా 75 బిలియన్ డాలర్లను (సుమారు ₹6.2 లక్షల కోట్లు) ఆర్జించింది. గతంలో 2019లో సౌదీ అరామ్‌కో సాధించిన 25.6 బిలియన్ డాలర్ల రికార్డును అధిగమించి, ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీవోగా ఇది నిలిచింది. ఈ తాజా విక్రయంతో స్పేస్ఎక్స్ కంపెనీ మొత్తం మార్కెట్ విలువ అమాంతం పెరిగి 1.77 ట్రిలియన్ డాలర్లకు (సుమారు ₹147 లక్షల కోట్లు) చేరుకుంది. అమెరికా స్టాక్ మార్కెట్లలో ట్రేడవుతున్న అత్యంత విలువైన కంపెనీల జాబితాలో స్పేస్ఎక్స్ ఇప్పుడు 7వ స్థానాన్ని కైవసం చేసుకుంది.
ఈ అసాధారణ వృద్ధి ఎలన్ మస్క్ వ్యక్తిగత సంపదను రికార్డు స్థాయికి తీసుకెళ్లింది. ఈ తాజా ఐపీవో ధర ప్రకారం, స్పేస్ఎక్స్‌లో మస్క్‌కు ఉన్న వాటా విలువ దాదాపు 866.5 బిలియన్ డాలర్లుగా తేలింది. దీనికి అదనంగా ఆయనకు చెందిన విద్యుత్ కార్ల సంస్థ ‘టెస్లా’ (Tesla) లో ఉన్న షేర్ల విలువ ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం మరో 286.2 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ రెండు కంపెనీల వాటాలను కలిపితే మస్క్ మొత్తం సంపద విలువ ఏకంగా 1.1 ట్రిలియన్ డాలర్లకు (అంటే 1100 బిలియన్ డాలర్లు) చేరినట్లు ఆర్థిక నిపుణులు లెక్కిస్తున్నారు. అయితే ఈ సంపదంతా స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులు ,భవిష్యత్తులో సాధించాల్సిన మైలురాళ్లపై (కంపెనీ వ్యాల్యుయేషన్ లక్ష్యాలు, అంగారకుడిపై మానవ కాలనీ వంటివి) ఆధారపడి ఉంటుంది.
ప్రస్తుతం ప్రపంచంలోని మిగిలిన ఏ కోటీశ్వరుడూ మస్క్ దరిదాపుల్లో కూడా లేకపోవడం గమనార్హం. ఫోర్బ్స్ వెల్త్ ఎడిటర్ మాట్ డ్యూరట్ విశ్లేషణ ప్రకారం… ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్న వ్యక్తి కేవలం 300 బిలియన్ డాలర్ల మార్కు వద్దే ఉన్నారు, ఇది మస్క్ సంపదలో దాదాపు మూడో వంతు మాత్రమే. అలాగే ప్రముఖ టెక్ దిగ్గజం ఒరాకిల్ ఫౌండర్ లారీ ఎల్లిసన్ సంపద సుమారు 400 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు. రాకెట్లు, స్టార్‌లింక్ శాటిలైట్లు, కృత్రిమ మేధ (AI) మౌలిక వసతుల సమాహారమైన స్పేస్ఎక్స్ సాధించిన ఈ విజయం, ఒక ఔత్సాహిక వ్యాపారిగా ప్రయాణం మొదలుపెట్టిన ఎలన్ మస్క్‌ను ప్రపంచ ఆర్థిక చరిత్రలో సరికొత్త అధ్యాయానికి అధిపతిని చేసింది.