Skip to content
తెలంగాణ వార్తలు

తెలంగాణకు భారీ వర్షాల అలర్ట్.. 18–20 తేదీల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక..

Prajapaksham 14 Jun 2026 0 నిమిషాల పఠనం తెలంగాణ
తెలంగాణకు భారీ వర్షాల అలర్ట్.. 18–20 తేదీల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక..

Rains

హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన తాజా సమాచారం ప్రకారం.. తెలంగాణ వ్యాప్తంగా ఎండల తీవ్రత తగ్గి త్వరలోనే వాతావరణం చల్లబడనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల కదలికలు కొంత నెమ్మదిగా సాగుతున్నప్పటికీ, రాబోయే నాలుగైదు రోజుల్లో ఇవి రాష్ట్రమంతటా పూర్తిగా విస్తరించేందుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. దీని ప్రభావంతో రానున్న మూడు, నాలుగు రోజుల్లో చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ముఖ్యంగా ఈనెల 18 నుంచి 20 మధ్య కాలంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక తక్షణ వాతావరణ మార్పుల విషయానికి వస్తే, ఇవాళ, రేపు, ఎల్లుండి కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడటంతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. అందువల్ల ప్రజలు, ముఖ్యంగా చేతికి వచ్చిన పంటలను కాపాడుకునే క్రమంలో రైతులు ఈ ఈదురుగాలులు, భారీ వర్షాల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం అని అధికారులు చెబుతున్నారు.