Swine Flu Alert: H1N1 కేసులు కలకలం.. దేశ రాజధానిలో ఆరు రెట్లు పెరిగిన స్వైన్ ఫ్లూ కేసులు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..
Swine Flu
Swine Flu Alert: దేశ రాజధాని ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో (NCR) ప్రస్తుతం నెలకొన్న అధిక తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. వాతావరణ మార్పుల కారణంగా H1N1 (స్వైన్ ఫ్లూ), ఇతర తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల కేసులు వేగంగా పెరుగుతుండటం పట్ల ఆరోగ్య నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కేసుల సంఖ్య భారీగా పెరిగింది. గతేడాది ఇదే సమయానికి 229 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 1,349 H1N1 కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య అధికారులు తెలిపారు. పలువురు వైద్యులకు కూడా H1N1 పాజిటివ్‌గా నిర్ధారణ కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
ముఖ్యమైన వ్యాధి లక్షణాలు:
బాధితుల్లో కొందరికి ఆక్సిజన్ స్థాయిలు పడిపోతుండటం కలవరపెడుతోంది. క్రింది లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని హెచ్చరిస్తున్నారు:
నిరంతర తీవ్రమైన జ్వరం మరియు దగ్గు
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా శ్వాస ఆడకపోవడం
ఛాతీలో తీవ్రమైన నొప్పి
పెదవులు లేదా ముఖం నీలం రంగులోకి మారడం (ఆక్సిజన్ లోపం సంకేతం)
వికారం, వాంతులు
తీసుకోవాల్సిన జాగ్రత్తలు & సూచనలు:
అధిక ప్రమాదం ఉన్నవారు: గర్భిణులు, చిన్న పిల్లలు, వయోవృద్ధులు మరియు ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు (ఆస్తమా, మధుమేహం మొదలైనవి) ఉన్నవారికి ఈ వైరస్ త్వరగా సోకే ప్రమాదం ఉంది. వీరు అత్యంత అప్రమత్తంగా ఉండాలి.
తక్షణ చికిత్స: వ్యాధి లక్షణాలు కనిపించిన 48 గంటల్లోపు వైద్యులను సంప్రదించి చికిత్స ప్రారంభించడం ద్వారా తీవ్రమైన కాంప్లికేషన్లను అరికట్టవచ్చు.
ముందస్తు జాగ్రత్తలు: ఇన్ఫ్లుయెంజా (ఫ్యూ) టీకా తీసుకోవాలని, చేతులను తరచూ శుభ్రంగా కడుక్కోవాలని, దగ్గేటప్పుడు లేదా తుమ్మేటప్పుడు నోటికి రుమాలు అడ్డుపెట్టుకోవాలని ఆరోగ్య అధికారులు సూచిస్తున్నారు.
- Ames Meteorite Crater: ఉల్క దాడి 10 కోట్ల ఏళ్లు ఆలస్యంగా జరిగిందా.. Ames క్రేటర్‌పై శాస్త్రవేత్తల కొత్త అంచనా.. ఓక్లహామా ఉల్కాబిలంపై సంచలన పరిశోధన
- Bathukamma Secret: బతుకమ్మ పండుగలో దాగి ఉన్న అసలు సీక్రెట్ ఇదే.. పూల పండుగ వెనుక ఇంత పెద్ద కథ ఉందా?
- Boddemma Festival: బతుకమ్మకు ముందు వచ్చే బొడ్డెమ్మ పండుగ ప్రత్యేకత ఏంటి.. 7 రోజుల పాటు ఎందుకు జరుపుకుంటారు..
- CEC Gyanesh Kumar Row: CEC జ్ఞానేశ్ కుమార్‌ను సస్పెండ్ చేయాలన్న పిటిషన్లపై విచారణ.. కేంద్రం, ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు..
- Russia-Ukraine War: ఉక్రెయిన్‌లో భారత ఫార్మా ప్లాంట్‌పై రష్యా డ్రోన్ దాడి.. ఒకరు మృతి, రూ.400 కోట్లకు పైగా నష్టం..