Rahul Gandhi Protest: పెల్లెట్ గన్ బాధితుడికి న్యాయం జరగాల్సిందే.. పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వద్ద రాహుల్ గాంధీ ధర్నా.. వీడియో ఇదిగో..
Rahul Gandhi Protest
Rahul Gandhi Protest: జూలై 20న నిర్వహించిన నిరసన ప్రదర్శనలో పెల్లెట్ గన్ (Pellet Gun) కాల్పులకు గురైన బాధితుడికి మద్దతుగా లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి న్యూఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ బయట ధర్నా చేపట్టారు. బాధితుడు సాహిల్ లోచాబ్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేయడానికి నిరాకరించడంతో ఈ నిరసన దిగారు.
నీట్ (NEET) పేపర్ లీకేజీలు, పరీక్షల అవకతవకలకు వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన శాంతియుత నిరసనలో పాల్గొన్న సాహిల్ లోచాబ్‌పై పెల్లెట్ గన్ కాల్పులు జరిగాయని, దాంతో అతని శరీరంపై 200కు పైగా గాయాలు కావడంతో పాటు ఒక కంటి చూపును కోల్పోయాడని రాహుల్ గాంధీ వెల్లడించారు. ఎయిమ్స్ (AIIMS) మెడికల్ నివేదికలు, ఎమ్మెల్సీ (MLC) కాపీలు స్పష్టంగా తీవ్ర గాయాలను ధృవీకరిస్తున్నప్పటికీ.. పోలీసులు కేసు నమోదు చేయకపోవడం వెనుక పైనుంచి వచ్చిన ఆదేశాలే కారణమని ఆరోపించారు.
శాంతియుతంగా నిరసన తెలిపే విద్యార్థుల గొంతును కేంద్ర ప్రభుత్వం పోలీసు బలప్రయోగంతో అణచివేస్తోందని రాహుల్ గాంధీ విమర్శించారు. ఘటన కన్నాట్ ప్లేస్, పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ పరిధికి సంబంధించిందంటూ పోలీసులు నెపం నెట్టివేస్తూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం లేదని మండిపడ్డారు.
బాధితుడు సాహిల్ లోచాబ్‌కు న్యాయం జరిగే వరకు, దోషులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే వరకు పోలీస్ స్టేషన్ నుండి వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు, పలువురు కార్యకర్తలు పాల్గొని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, ఢిల్లీ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
- Ames Meteorite Crater: ఉల్క దాడి 10 కోట్ల ఏళ్లు ఆలస్యంగా జరిగిందా.. Ames క్రేటర్‌పై శాస్త్రవేత్తల కొత్త అంచనా.. ఓక్లహామా ఉల్కాబిలంపై సంచలన పరిశోధన
- Bathukamma Secret: బతుకమ్మ పండుగలో దాగి ఉన్న అసలు సీక్రెట్ ఇదే.. పూల పండుగ వెనుక ఇంత పెద్ద కథ ఉందా?
- Boddemma Festival: బతుకమ్మకు ముందు వచ్చే బొడ్డెమ్మ పండుగ ప్రత్యేకత ఏంటి.. 7 రోజుల పాటు ఎందుకు జరుపుకుంటారు..
- CEC Gyanesh Kumar Row: CEC జ్ఞానేశ్ కుమార్‌ను సస్పెండ్ చేయాలన్న పిటిషన్లపై విచారణ.. కేంద్రం, ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు..
- Russia-Ukraine War: ఉక్రెయిన్‌లో భారత ఫార్మా ప్లాంట్‌పై రష్యా డ్రోన్ దాడి.. ఒకరు మృతి, రూ.400 కోట్లకు పైగా నష్టం..