Skip to content
జాతీయం వార్తలు

Viral Video: దటీజ్ హైదరాబాద్… జంతర్ మంతర్ ఉద్యమకారులకు హైదరాబాదు నుంచే అత్యధికంగా స్విగ్గి, జొమాటో ఆర్డర్లు

Prajapaksham 22 Jul 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Viral Video: దటీజ్ హైదరాబాద్… జంతర్ మంతర్ ఉద్యమకారులకు హైదరాబాదు నుంచే అత్యధికంగా స్విగ్గి, జొమాటో ఆర్డర్లు

Viral Video: దటీజ్ హైదరాబాద్... జంతర్ మంతర్ ఉద్యమకారులకు హైదరాబాదు నుంచే అత్యధికంగా స్విగ్గి, జొమాటో ఆర్డర్లు

నీట్ ప్రవేశ పరీక్ష పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా విద్యార్థులు చేపట్టిన నిరసన దీక్షలు సరికొత్త అధ్యాయానికి తెర లేపుతున్నాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్న వేలాది మంది యువత ఢిల్లీ బాట పట్టి జంతర్ మంతర్ వద్ద ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ నిరసన చేపడుతూ ఉంటే, అందుకు సంఘీభావంగా ఉద్యమకారులకు దేశవ్యాప్తంగా ఉన్న యువత స్విగ్గి, జొమాటో ద్వారా ఫుడ్ డెలివరీ చేస్తున్నారు. ఇప్పటికే జంతర్ మంతర్ వద్ద వేలాది మంది యువత నిరసన చేపడుతున్న నేపథ్యంలో అక్కడికి వచ్చిన యువతకు ఆహార సమస్య రాకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా ఉన్న మద్దతుదారులు స్విగ్గి జొమాటో ఫుడ్ డెలివరీ యాప్స్ ద్వారా ఆహారాన్ని పంపిస్తున్నారు. దీంతో జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ఆహారం సరఫరా అవుతోంది. ఇది ఒక రకంగా ఉద్యమంలో సరికొత్త అధ్యాయంగా చెప్పవచ్చు.

దేశ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు అనేక రకాల ఉద్యమాలు జరిగినప్పటికీ, ఈ తరహా వినూత్నమైన పద్ధతులు నీట్ లీకేజీ నిరసన దీక్షలోనే కనిపిస్తున్నాయని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా స్విగ్గి జొమాటో యాప్స్ ద్వారా ఫుడ్ డెలివరీ చేస్తున్న వారిలో అత్యధిక సంఖ్యలో హైదరాబాద్ ముంబై నగరాలకు చెందిన వారే ఉన్నారని అక్కడికి వచ్చిన డెలివరీ బాయ్స్ చెబుతున్నారు. ముఖ్యంగా హైదరాబాదు నుంచి పెద్ద ఎత్తున ఉద్యమకారులకు మద్దతు లభిస్తోందని, డెలివరీ బాయ్స్ తీసుకొని వస్తున్న ఫుడ్ పార్సిల్ లలో మూడింటి రెండువంతులు హైదరాబాదులో బుక్ చేశారని వారు చెబుతున్నారు. వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఢిల్లీ నగరానికి చేరుకోలేని యువత జంతర్ మంతర్ వద్ద ప్రాణాలకు తెగించి ఉద్యమం చేస్తున్న వారికి మద్దతుగా ఆహారాన్ని బుక్ చేసి పంపడం ఉద్యమంలో ఒక సరికొత్త పార్శ్వమని ఉద్యమకారులు చెబుతున్నారు.