Delhi Turns Red: ఢిల్లీ వీధుల్లో కదం తొక్కిన ఎర్రజెండాలు.. రేపటి సీపీఐ బదలావ్ జరూరీ హై ర్యాలీకి భారీగా తరలివస్తున్న ప్రజలు, కార్యకర్తలు..
CPI Rally
Delhi Turns Red: దేశ రాజధాని ఢిల్లీ రేపు సీపీఐ మెగా ర్యాలీతో వేడెక్కనుంది. రామ్‌లీలా మైదానంలో మంగళవారం నిర్వహించనున్న బదలావ్ జరూరీ హై భారీ ర్యాలీకి దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులు తరలివస్తుండగా.. ఇప్పటికే ఢిల్లీ వీధుల్లో కార్యకర్తల సందడి కనిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ నుంచి వేలాది మంది సీపీఐ కార్యకర్తలు, నాయకులు ప్రత్యేక రైళ్లు, ఇతర ప్రయాణ సౌకర్యాల ద్వారా ఒక రోజు ముందే ఢిల్లీకి చేరుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
‘బదలావ్ జరూరీ హై’ పేరుతో నిర్వహిస్తున్న ఈ ర్యాలీని కేంద్ర ప్రభుత్వంపై రాజకీయ పోరాటానికి కీలక వేదికగా సీపీఐ భావిస్తోంది. గత 12 ఏళ్ల పాలనలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనేక రంగాల్లో విఫలమైందంటూ పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకత్వం ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. రామ్‌లీలా మైదానం వేదికగా జరిగే ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా సహా పలువురు ప్రముఖ నేతలు పాల్గొని.. ప్రసంగించనున్నారు.

ర్యాలీకి ఒక రోజు ముందుగానే ఢిల్లీకి వివిధ రాష్ట్రాల నుంచి కార్యకర్తల రాక పెరిగింది. రైల్వే స్టేషన్లు, బస కేంద్రాలు, పార్టీ కార్యాలయాల వద్ద సీపీఐ శ్రేణుల సందడి కనిపిస్తోంది. తెలంగాణ నుంచి వచ్చిన కార్యకర్తలు ఎర్రజెండాలు, పార్టీ నినాదాలతో రాజధాని వీధుల్లో ఉత్సాహంగా కనిపిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి కార్యకర్తలు భారీ సంఖ్యలో బయలుదేరినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

‘వన్ నేషన్–వన్ ఎలక్షన్’ ప్రతిపాదన ద్వారా దేశ సమాఖ్య వ్యవస్థను బలహీనపరిచే ప్రయత్నం జరుగుతోందని సీపీఐ ఆరోపిస్తోంది. డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందని పార్టీ నాయకత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. మైనారిటీల భద్రత అంశంపైనా ర్యాలీలో ప్రధానంగా ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది.
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ విదేశాల్లో మైనారిటీల గురించి చేసే వ్యాఖ్యలు భారత్‌లో ఎందుకు చేయరని రామకృష్ణ ప్రశ్నించారు. దేశంలో సామాజిక సామరస్యం, మైనారిటీల భద్రతపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరి తీసుకోవాలని సీపీఐ డిమాండ్ చేస్తోంది.

ఈ ర్యాలీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా భారీ స్పందన లభిస్తోందని సీపీఐ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే వేలాది మంది ఢిల్లీకి చేరుకోగా, మరికొందరు కార్యకర్తలు సోమవారం రాత్రి, మంగళవారం ఉదయం రాజధానికి చేరుకునే అవకాశం ఉంది. దీంతో రామ్‌లీలా మైదానం పరిసర ప్రాంతాలు ఎర్రజెండాలతో నిండిపోనున్నాయి.
మొత్తంగా ‘బదలావ్ జరూరీ హై’ ర్యాలీని కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రజా నిరసనగా మలచాలని సీపీఐ ప్రయత్నిస్తోంది. తెలంగాణ నుంచి భారీగా తరలివచ్చిన కార్యకర్తల ఉత్సాహం ఈ ర్యాలీకి ప్రత్యేక ఆకర్షణగా మారింది. మంగళవారం జరిగే సభలో కేంద్ర ప్రభుత్వంపై సీపీఐ ఎలాంటి రాజకీయ సందేశాన్ని ఇవ్వబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.
- Teachers’ Day 2026 Speech Ideas: నేడు టీచర్స్ డే సందర్భంగా మంచి స్పీచ్ ఇవ్వాలి అనుకుంటున్నారా..అయితే చక్కటి స్పీచ్ మీకోసం..
- Teachers Day Wishes On September 5: మీ గురువులు, స్నేహితులకు సెప్టెంబర్ 5 టీచర్స్ డే సందర్భంగా విషెస్ మీ కోసం…
- Happy Teachers Day 2026 Telugu Wishes: మీ బంధుమిత్రులు, స్నేహితులకు టీచర్స్ డే విషెస్ షేర్ చేయండి..
- Happy Teachers Day 2026 Wishes In Telugu: మీ టీచర్లు, స్నేహితులు, బంధు మిత్రులకు Messages, Quotes, Images రూపంలో Whatsapp Status, Facebook కోసం గ్రీటింగ్స్ మీకోసం..
- El Niño 2027 Alert: ప్రపంచానికి పెనుముప్పు తీసుకొస్తున్న చిన్న బాలుడు.. భారీ వర్షాలు, కరువు, తీవ్ర వేడి ముప్పు.. WMO తీవ్ర హెచ్చరిక