CPI Mega Rally: ఎర్ర జెండాలతో నిండిపోయిన రామ్ లీలా మైదానం.. కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిరసనగా రేపే సీపీఐ మెగా ర్యాలీ.. ఫోటోలు ఇవిగో..
CPI Mega Rally
CPI Mega Rally: దేశ రాజధాని ఢిల్లీ ఎర్రజెండాలతో నిండిపోయింది. సీపీఐ ఆధ్వర్యంలో రామ్‌లీలా మైదానంలో మంగళవారం నిర్వహించనున్న భారీ ర్యాలీకి దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులు తరలివస్తుండగా.. ఇప్పటికే ఢిల్లీ వీధుల్లో కార్యకర్తల సందడి కనిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ నుంచి వేలాది మంది సీపీఐ కార్యకర్తలు, నాయకులు ప్రత్యేక రైళ్లు, ఇతర ప్రయాణ సౌకర్యాల ద్వారా ఢిల్లీకి చేరుకున్నారు.
కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిరసనగా ‘బదలావ్ జరూరీ హై’ పేరుతో సీపీఐ ఈ ర్యాలిని నిర్వహిస్తోంది. గత 12 ఏళ్ల పాలనలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనేక రంగాల్లో విఫలమైందంటూ పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకత్వం ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. రామ్‌లీలా మైదానం వేదికగా జరిగే ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా సహా పలువురు ప్రముఖ నేతలు పాల్గొని ప్రసంగించనున్నారు.





