Skip to content
వినోదం వార్తలు

కర్ణాటకలో కూడా తెలుగు సినిమాలని ఇష్టపడతాం: ‘టాక్సిక్’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో యశ్

Prajapaksham 24 Aug 2026 1 నిమిషాల పఠనం వినోదం
కర్ణాటకలో కూడా తెలుగు సినిమాలని ఇష్టపడతాం: ‘టాక్సిక్’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో యశ్

Yash

యశ్ తో సినిమా చేయడానికి వెయిటింగ్: దిల్ రాజు

రాకింగ్ స్టార్ యశ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి కీలక పాత్రల్లో నటించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించారు. ఇంగ్లిష్, కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో డబ్బింగ్ వెర్షన్స్‌లో రిలీజ్ కానుంది. ఆగస్టు 26 ప్రేక్షకులు ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా మేకర్స్ హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ సందర్బంగా యశ్ మాట్లాడుతూ సినిమాకు సరిహద్దులు లేవు. భాషను, సరిహద్దులను మించి మానవత్వం ఉంది, ప్రేమ ఉంది, నిజాయితీ ఉంది అని మీరు చూపించారు. అలాగే కర్ణాటకలో కూడా మేము తెలుగు ప్రజలను సినిమాలని ఎంతగానో ఇష్టపడతాం. మన ఇండియన్ సినిమా ప్రపంచ స్థాయిలో నిలబడాలి. మనందరం కలిసి ఇండియన్ సినిమాను గ్లోబల్ సినిమాలో ఒక ప్రత్యేక స్థానంలో నిలబెట్టాలి అన్నారు. నిర్మాత కేవీఎన్ మాట్లాడుతూ: ఈ సినిమాను చాలా పెద్ద విజన్‌తో, బోల్డ్ డ్రీమ్‌తో, చాలా బ్యూటిఫుల్‌గా నిర్మించాం. కియారా అద్వానీ మాట్లాడుతూ మహేశ్ బాబు తో కలిసి ‘భరత్ అనే నేను’ నా తొలి తెలుగు సినిమా. అప్పటి నుంచి తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న అభిమానం, ప్రేమను మాటల్లో చెప్పలేను. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా ఇంటికి వచ్చినట్టే అనిపిస్తుంది. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ఈరోజు దేశంలోని అన్ని భాషల్లో సినిమాలు నిర్మిస్తున్న ప్రొడ్యూసర్ కేవీఎన్ . తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం, హిందీ.. ఇలా అన్ని భాషల్లో సినిమాలు చేస్తున్నారు. రామానాయుడు తర్వాత ఇండియాలో అన్ని భాషల్లో సినిమాలు చేస్తున్న ప్రొడ్యూసర్‌గా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనకు అభినందనలు. ‘కేజీఎఫ్’ సినిమాతో యశ్ తో నాకు పరిచయం అయింది. ‘కేజీఎఫ్’ తర్వాత ఎవరైనా ఇంకా పెద్దగా ఆలోచిస్తారు. కానీ యశ్ మాత్రం ఒక కొత్త దర్శకురాలిని పరిచయం చేస్తూ, కథలో ఉన్న బలాన్ని నమ్మి ‘టాక్సిక్’ సినిమా చేశారు. ఇండియన్ సినిమాను పాన్ వరల్డ్ సినిమాగా మార్చాలనే ఆయన విజన్‌కు హ్యాట్సాఫ్. రాజమౌళి తర్వాత ఇలాంటి ఫిల్మ్‌మేకర్లు ఇండియన్ సినిమాను పాన్ వరల్డ్ స్థాయికి తీసుకెళ్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. విజన్, నమ్మకం ఉంటేనే ఇలాంటి సినిమా సాధ్యమవుతుంది. ఈ సినిమా విజువల్స్ చూస్తే మతి పోయింది. నిర్మాతలు ఎంత చెబితే అంత ఇచ్చి ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నాం. కంపోజర్ విశాల్ మిశ్రా ఈ సినిమా రూ.2,000 కోట్లు కలెక్ట్ చేస్తుందని చెప్పారు. అది ఈ యూనిట్ మొత్తానికి ఈ సినిమాపై ఉన్న నమ్మకానికి నిదర్శనం. యశ్ తో సినిమా చేయడానికి నేను కూడా వెయిటింగ్. ఆయన అనౌన్స్‌మెంట్ కోసం ఎదురుచూస్తుంటాను అని చెప్పారు. మల్లారెడ్డి , హుమా ఖురేషి , రుక్మిణి వసంత్ .మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ , లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.
మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ సోషియో-ఫాంటసీ ‘విశ్వంభర’. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్రముఖ స్టూడియోలు వీఎఫ్‌ఎక్స్ పనులను పూర్తి చేస్తున్నాయి.‘విశ్వంభర’ నుంచి స్పెషల్ పోస్టర్‌తో పాటు ఒరిజినల్ సౌండ్‌ట్రాక్ ను విడుదల చేశారు.పోస్టర్‌లో చిరంజీవి ఫెరోషియస్ లుక్ ఆకట్టుకుంటోంది. ఆయన ఇంటెన్స్ లుక్, స్క్రీన్ ప్రెజెన్స్‌కు మెటాలిక్ త్రిశూలం మరింత పవర్‌ను తీసుకొచ్చింది. ఈ లుక్ సినిమాలోని దైవత్వం, వీరత్వంతో కూడిన ప్రపంచాన్ని ప్రజెంట్ చేస్తోంది. దర్శకుడు వశిష్ఠ ‘విశ్వంభర’ను భారీ విజువల్ స్కేల్, రిచ్ విజువల్స్, మాస్ ఎలిమెంట్స్ రూపొందిస్తున్నారు.ఈ చిత్రంలో త్రిష కృష్ణన్, ఆశికా రంగనాథ్, కునాల్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తుండగా, మౌనీ రాయ్ ప్రత్యేక గీతంలో కనిపించనున్నారు. ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్ చేస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి పాటలకు సంగీతం అందిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో ఓ డ్యాన్స్ నంబర్‌కు సంగీతం సమకూర్చారు. గౌర హరి నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ‘విశ్వంభర’ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం. కీరవాణి, భీమ్స్ సిసిరోలియో, నేపథ్య సంగీతం: గౌర హరి, ఛాయాగ్రహణం: ఛోటా కె. నాయుడు.