‘విశ్వంభర’ లో చిరంజీవి ఫెరోషియస్ లుక్
Vishwambhara
మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ సోషియో-ఫాంటసీ ‘విశ్వంభర’. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్రముఖ స్టూడియోలు వీఎఫ్ఎక్స్ పనులను పూర్తి చేస్తున్నాయి.‘విశ్వంభర’ నుంచి స్పెషల్ పోస్టర్‌తో పాటు ఒరిజినల్ సౌండ్‌ట్రాక్ ను విడుదల చేశారు.పోస్టర్లో చిరంజీవి ఫెరోషియస్ లుక్ ఆకట్టుకుంటోంది. ఆయన ఇంటెన్స్ లుక్, స్క్రీన్ ప్రెజెన్స్‌కు మెటాలిక్ త్రిశూలం మరింత పవర్‌ను తీసుకొచ్చింది. ఈ లుక్ సినిమాలోని దైవత్వం, వీరత్వంతో కూడిన ప్రపంచాన్ని ప్రజెంట్ చేస్తోంది. దర్శకుడు వశిష్ఠ ‘విశ్వంభర’ను భారీ విజువల్ స్కేల్, రిచ్ విజువల్స్, మాస్ ఎలిమెంట్స్ రూపొందిస్తున్నారు.ఈ చిత్రంలో త్రిష కృష్ణన్, ఆశికా రంగనాథ్, కునాల్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తుండగా, మౌనీ రాయ్ ప్రత్యేక గీతంలో కనిపించనున్నారు. ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్ చేస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి పాటలకు సంగీతం అందిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో ఓ డ్యాన్స్ నంబర్‌కు సంగీతం సమకూర్చారు. గౌర హరి నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ‘విశ్వంభర’ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం. కీరవాణి, భీమ్స్ సిసిరోలియో, నేపథ్య సంగీతం: గౌర హరి, ఛాయాగ్రహణం: ఛోటా కె. నాయుడు.
- Vinayaka Chavithi 2026 Wishes In Telugu: వినాయక చవితి సందర్భంగా మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు అందమైన కొటేషన్స్ తో కూడి ఇమేజ్ గ్రీటింగ్స్ ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోండి..
- Ganesh Chaturthi 2026 Wishes in Telugu: వినాయక చవితి సందర్భంగా మీ బంధు మిత్రులకు శ్లోకాలతో కూడిన ఈ కొటేషన్స్ వాట్సప్ ద్వారా షేర్ చేసుకోండి..
- Vinayaka Chavithi Wishes 2026: మీ బంధుమిత్రులకు వినాయక చవితి సందర్భంగా Whatsapp, SMS, X, Meta ద్వారా షేర్ చేయడానికి చక్కటి భక్తి భావంతో కూడిన Text Messeges మీ కోసం…
- Vinayaka Chavithi Wishes 2026: వినాయక చవితి శుభాకాంక్షలు .. మీకు మీ కుటుంబ సభ్యులకు 25 ప్రత్యేక శుభాకాంక్షలు
- తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు…మల్లు స్వరాజ్యం