‘శివ ట్రాన్స్’ సాంగ్ రిలీజ్
'Shiva Trans' song released.
హాయ్ జాయ్ కమర్షియల్స్ బ్యానర్‌పై డా.చింతాడ హేమారావు నిర్మాతగా, వింటేజ్ ఐకానిక్ పిక్చర్స్ నిర్మాణ సారథ్యంలో మంగా శ్రీనివాస్ రచన- దర్శకత్వంలో రూపొందిన మాస్ పోయెట్రీ మ్యూజికల్ లవ్ స్టోరీ ‘చకోర‘. శ్రవణ్, మలైకా టి. వాసుపల్ ను సరికొత్త ప్రేమ జంటగా పరిచయం చేస్తూ తెరకెక్కిన ఈ ప్రేమ కథ చిత్రం శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా అక్టోబర్ 9న వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా నుంచి ‘శివ ట్రాన్స్..’ వీడియో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘శివ ట్రాన్స్..’ వీడియో సాంగ్ ను ర్యాప్ బీట్‌తో ప్రిన్స్ హెన్రీ ఎనర్జిటిక్ గా కంపోజ్ చేశారు. సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించారు. రితేష్ రావ్ పాడారు. ’శివ ట్రాన్స్..’ వీడియో సాంగ్ ను ప్రమోషనల్ సాంగ్‌గా రూపొందించారు. వైజాగ్ బీచ్‌లో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో ఈ పాటను కలర్ పుల్‌గా తెరకెక్కించారు. ర్యాప్ బీట్‌తో శివుడిని స్తుతిస్తూ పాట డిజైన్ చేయడం కొత్త ప్రయత్నంగా చెప్పుకోవచ్చు. ఈ పాటలో మూవీ టీమ్ మెంబర్స్ పాల్గొనడం విశేషం. శ్రవణ్, మలైకా టి వాసుపల్, అనుష్క లూహార్, యామిని, ఎల్ బి శ్రీరామ్, సుమన్, ఆకెళ్ళ గోపాల కృష్ణ, వంగపండు,వంశీ, సుమంత్, భాను, సూర్య మాకిరెడ్డి, తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : లాలం కన్నాజీ, పాటలు : రామ జోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్ యాక్షన్ కొరియోగ్రఫీ – రామ్ కిషన్, ప్రొడక్షన్ డిజైనర్ – రామ్ చరణ్ తేజ్ లాభాని, డీవోపీ – రుప్ప గోపీకృష్ణ, ఎడిటర్ : మార్తాండ కె వెంకటేష్, మ్యూజిక్ డైరెక్టర్ – ప్రిన్స్ హెన్రీ, నిర్మాత – డా. చింతాడ హేమారావు, రచన, దర్శకత్వం – మంగా శ్రీనివాస్.
- Kaleshwaram Barrages Restoration: కాళేశ్వరం బ్యారేజీలకు నవంబర్‌లో పునరుద్ధరణ పనులు, 2027 వర్షా కాలానికి ముందే పూర్తి..మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి ప్రకటన
- Ambati Rambabu: నారా లోకేష్‌పై రౌడీషీట్ ఓపెన్ చేయాలి..డీఎస్సీ కేసులపై అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు..
- EC-SIR Row: ఎన్నికల సంఘంపై పెరుగుతున్న వివాదం.. సెప్టెంబర్ 30న INDIA బ్లాక్ కీలక సమావేశం..
- CP Sajjanar Dance Video: సజ్జనార్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్.. ది ప్యారడైజ్ సినిమాలోని ఆయా షేర్ పాటకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ చిందులు..
- Sircilla Public Meeting: సిరిసిల్లలో రేవంత్ రెడ్డి సభకు భారీ ఏర్పాట్లు.. సెప్టెంబర్ 30న కాంగ్రెస్ మెగా మీటింగ్