Skip to content
వినోదం వార్తలు

నవంబర్‌ 27న ‘మైసా’

Prajapaksham 03 Sep 2026 1 నిమిషాల పఠనం వినోదం
నవంబర్‌ 27న ‘మైసా’

Rashmika Mandanna

రష్మిక మందన్న తాజా పాన్‌-ఇండియా యాక్షన్‌ డ్రామా ‘మైసా’. ఈ చిత్రంలో గోండ్‌ గిరిజన మహిళ పాత్ర పోషిస్తున్న రష్మిక , ఆ పాత్రలో ఒదిగిపొవడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో అన్ఫార్ములా ఫిలమ్స్‌ నిర్మిస్తున్న ‘మైసా’ ఆకట్టుకునే ఫస్ట్‌ గ్లింప్స్‌తో ఇప్పటికే ఆసక్తిని రేకెత్తించింది. నవంబర్‌ 27, 2026న ‘మైసా’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. పోస్టర్‌లో రష్మిక ఒక పెద్ద ఇటె పట్టుకుని నిలబడి ఉండగా, ఆమె ముఖంపై యుద్ధ గాయాలు కనిపిస్తాయి. ఆమె వెనుక భారీ జనసమూహం, మండుతున్న పరిసరాలు ఇంటెన్స్‌ గా ఉన్నాయి. ఈ పోస్టర్‌కు స్ట్రాంగ్‌ పీరియడ్‌-యాక్షన్‌ లుక్‌ ఇస్తుంది. ఇటీవల సెట్స్‌లో ఒ హై-ఆక్టేన్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ చేస్తుండగా గాయపడిన రష్మిక మందన్న.. పాత్ర కోసం తన అంకితభావం, పట్టుదలను చూపించారు. కోలుకున్న తర్వాత త్వరలోనే ఆమె తిరిగి షూటింగ్‌లో పాల్గొని చివరి దశ షూటింగ్‌ను పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం ఇంకా 12 రోజుల షూటింగ్‌ మాత్రమే మిగిలి ఉంది.పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. .ఈ చిత్రంలో ఈశ్వరి రావు, గురు సోమసుందరం, రావు రమేష్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా శ్రేయాస్‌ పి. కృష్ణ, మ్యూజిక్‌ కంపోజర్‌గా జేక్స్‌ బిజోయ్‌ పని చేస్తున్నారు. ఇంటర్నేషనల్‌ స్టంట్‌ స్పెషలిస్ట్‌ ఆండీ లాంగ్‌ యాక్షన్‌ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ‘మైసా’ తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.