రావణుడిగా యష్ పోస్టర్ రిలీజ్
Ramayana: Yash’s Ravana gets first official poster from Nitesh Tiwari’s epic
నమిత్ మల్హోత్రా ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, 8 సార్లు ఆస్కార్ అవార్డు గెలుచుకున్న డీ ఎన్ ఈ జీ యశ్‌కు చెందిన మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘రామాయణం’లో రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నమిత్ మల్హోత్రా ‘రామాయణ’ ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి. సినిమా నుంచి వస్తున్న ప్రతి కొత్త అప్డేట్తో అంచనాలు మరింత పెరుగుతున్న నేపథ్యంలో.. తాజాగా రాకింగ్ స్టార్ యశ్ రావణుడిగా నటిస్తున్న ఫస్ట్ అఫీషియల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ఆయన పోషిస్తున్న లార్జర్ ద్యాన్ లైఫ్ రావణుడి అవతార్‌ను పవర్‌ఫుల్‌గా చూపించారు.ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి యశ్ పోషిస్తున్న రావణుడి పాత్ర సినిమాకు సంబంధించిన మోస్ట్ టాక్డ్ అబౌట్ ఎలిమెంట్స్‌లో ఒకటిగా నిలిచింది. ఇంటెన్సిటీ, పవర్ఫుల్ ఆరాతో ఆకట్టుకున్న యశ్.. ఈ ఐకానిక్ పాత్రపై మరింత ఆసక్తిని పెంచుతున్నారు.తాజాగా విడుదలైన పోస్టర్లో యశ్ తన పవర్ఫుల్ లుక్‌తో ఫ్రేమ్‌ను డామినేట్ చేస్తున్నారు. విలువైన రత్నాలతో అలంకరించిన మెరిసే బంగారు కిరీటం, పొరలుగా ఉన్న ముత్యాల హారాలు, భారీ బంగారు కంకణాలతో యశ్ కనిపిస్తున్నారు. ఇంటెన్స్ చూపు, ఇంపోజింగ్ ప్రెజెన్స్‌తో రావణుడి పాత్రకు కావాల్సిన రాజసం, గంభీరతను తీసుకొచ్చారు.దీనితో పాటు శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి, లక్ష్మణుడిగా రవి దూబేను పరిచయం చేస్తూ మరో కొత్త పోస్టర్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. వనవాస కాలంలో అడవిలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు కలిసి సాగిస్తున్న ప్రయాణాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన ఈ పోస్టర్ ఎంతో ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా నటిస్తున్నారు. ఈ సినిమా భారత్‌లో హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఐ మ్యాక్స్ లో విడుదల కానున్న ‘రామాయణం పార్ట్ 1’ 2026 దీపావళికి, ‘రామాయణం పార్ట్ 2’ 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
- SIR వివాదంతో వేడెక్కిన రాజకీయం.. రేపు INDIA కూటమి కీలక భేటీ
- Dhruv Rathee on CEC: సీఈసీ జ్ఞానేష్ కుమార్ పై ధృవ్ రాఠీ సంచలన వీడియో…అసలు ఓట్ చోరీ కుంభకోణం ఎలా జరిగింది…
- TGSPDCL Power Demand: తెలంగాణలో పెరిగిన విద్యుత్ వినియోగం.. TGSPDCL చరిత్రలో ఆల్‌టైమ్ రికార్డు, 12,044 మెగావాట్ల డిమాండ్
- Kavitha comments on KTR: గుంటనక్క మైండ్ గేమ్ లో పడ్డావు…కేటీఆర్ కు కల్వకుంట్ల కవిత వార్నింగ్…
- Khairatabad by election: ఖైరతాబాద్ బైపోల్.. హీటెక్కుతున్న రాజకీయం! కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ఎవరు?