Skip to content
వినోదం › వార్తలు

‘నారాయణమ్మ’ పాట విడుదల

Prajapaksham 29 Sep 2026 1 నిమిషాల పఠనం వినోదం
‘నారాయణమ్మ’ పాట విడుదల

‘Narayanamma’ Song from ONG FROM ‘– AK47’ Released

విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతోన్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47 – AK47’ చిత్రం నుంచి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మొదటి గీతం ‘నారాయణమ్మ’ విడుదలైంది. తమన్ ఎస్ స్వరాలు సమకూర్చిన ఈ హుషారైన పాటను ప్రభ, రామ్ మిరియాల ఆలపించారు. సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు సాహిత్యం అందించారు.‘నారాయణమ్మ’ పాటలో డింపుల్ హయాతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌, వైబ్రెంట్ స్క్రీన్ ప్రజెన్స్‌తో పాటకు జోష్ తీసుకొచ్చారు. ఆమెతో పాటు విక్టరీ వెంకటేష్, శ్రీనిధి శెట్టి, నివేదా పేతురాజ్ కూడా సందడి చేసి, పాటను విజువల్ ట్రీట్ గా మార్చారు. మొత్తంగా ‘ఆదర్శ కుటుంబం’ సినిమా కుటుంబ చిత్రంగా ఏ స్థాయి వినోదాన్ని అందించబోతుందో తెలిపేలా ఈ ‘నారాయణమ్మ’ గీతం ఉంది.
‘నారాయణమ్మ’ గీతావిష్కరణ ఘనంగా జరిగింది.వెంకటేష్ మాట్లాడుతూ నారాయణమ్మ సాంగ్ లాంచ్ కి విచ్చేసిన అభిమానులకు, మీడియా మిత్రులకు ధన్యవాదాలు. దాదాపు 20 ఏళ్ళ తర్వాత త్రివిక్రమ్ తో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలు క్లాసిక్ లవ్ స్టోరీలు. అలాంటి సినిమాల తర్వాత ఇప్పుడు త్రివిక్రమ్ మరో అద్భుతమైన కథను తీసుకొచ్చారు. ఇందులో ఎంటర్టైన్మెంట్, యాక్షన్, సెంటిమెంట్ అన్నీ ఉంటాయి. ట్రీట్మెంట్ కొత్తగా ఉంటుంది. మీరు ఊహించని ట్విస్టులు ఉంటాయి అని అన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ నా జీవితంలో మొట్ట మొదటి డైలాగ్ రాసింది వెంకటేష్ సినిమాకెనని అన్నారు. వెంకటేష్ అంటే భక్తి తో కూడిన భయం కూడా ఉందని అన్నారు.