కాక్రోచ్ జనతా పార్టీ బాటలో అల్లు అర్జున్…ఫ్యాన్ అసోసియేషన్ అసలు లక్ష్యం పొలిటికల్ ఎంట్రీ కోసమేనా..?
llu Arjun's Political Entry Rumours Resurface
అల్లు అర్జున్ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారనే ఊహాగానాలు మరోసారి సోషల్ మీడియా, రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. అభిమాన సంఘాల కార్యకలాపాల నేపథ్యంలో పలు రాజకీయ వ్యాఖ్యలు, విశ్లేషణలు వెలువడుతున్నాయి.
కోలీవుడ్ నటుడు దళపతి విజయ్ తమిళనాడులో ముఖ్యమంత్రి కావడం ద్వారా రాజకీయాల్లో సరికొత్త రికార్డు సృష్టించడమే కాకుండా, దక్షిణ భారతదేశ సినీ రంగానికి చెందిన ఇతర ప్రముఖ హీరోల్లోనూ పొలిటికల్ ఆశలను ఒక్కసారిగా చిగురింపజేశారు. ముఖ్యంగా టాలీవుడ్ పరిశ్రమలోనూ ఈ వేడి స్పష్టంగా కనిపిస్తోంది. నందమూరి జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ జర్నీకి రూట్ మ్యాప్ సిద్ధమవుతోందని ఆయన సన్నిహిత వర్గాలు గుసగుసలాడుతున్నాయి. “రాజకీయాల్లోకి రావడానికి ఇదే సరైన సమయం” అని తారక్ సన్నిహితులు బలంగా ఒత్తిడి తెస్తున్నప్పటికీ, ఆయన మాత్రం ప్రస్తుతానికి కొంత వేచిచూసే ధోరణిలో వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే, తారక్ సంశయంలో ఉంటే… మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (బన్నీ) మాత్రం తన రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ఆసక్తి చూపుతున్నారని ఫిలింనగర్, రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇటీవల ఆయన స్వయంగా ‘అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్’ (AAFA) ను దగ్గరుండి ప్రారంభించి సరికొత్త సంచలనానికి తెరలేపారు. నిజానికి భారతదేశంలో ఏ నటుడూ కూడా తన అభిమానుల కోసం ప్రత్యేక గుర్తింపు పొందిన ఫ్యాన్స్ అసోసియేషన్‌ను స్వయంగా ప్రారంభించిన దాఖలాలు లేవు.
భారతీయ సినిమాలో అభిమాన సంఘాల సంస్కృతికి పునాది వేసింది ఎంజీఆర్, ఎన్టీఆర్. కాలక్రమేణా ఆ అభిమాన సంఘాలే బలమైన రాజకీయ శక్తులుగా, పార్టీ విభాగాలుగా రూపాంతరం చెందాయి. చిరంజీవి కూడా తన అభిమాన సంఘాలనే పార్టీకి పునాదిగా మార్చినా ఆశించిన సక్సెస్ సాధించలేకపోయారు. కానీ, తమిళనాడులో విజయ్ 2005లోనే తన తండ్రి ద్వారా అభిమానులను ప్రోత్సహించి సంఘాలను బలోపేతం చేశారు. ఆ సంఘాలు ఒకానొక దశలో స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసి సీట్లు కూడా గెలుచుకున్నాయి. విజయ్ అభిమానుల నుంచి ఎదురవుతున్న ఈ రాజకీయ ముప్పును గుర్తించే అప్పటి సీఎం జయలలిత ఆయన నటించిన ‘అన్నా’ సినిమా విడుదలను అడ్డుకున్న సంఘటనలు కూడా జరిగాయి.
ఇప్పుడు తమిళనాడులో విజయ్ చూపించిన అదే వ్యూహాత్మక బాటలోనే అల్లు అర్జున్ కూడా అడుగులు వేస్తున్నారని పొలిటికల్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్‌ను కూడా అల్లు అర్జున్ కలిసినట్లు సమాచారం. ఆ భేటీ ఫలితంగానే ఈ ‘AAFA’ అసోసియేషన్ రూపుదిద్దుకుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అల్లు అర్జున్ తన స్నేహితుడు శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి కోసం వైఎస్సార్సీపీకి బహిరంగంగా మద్దతు పలకడం మెగా అభిమానులు, జనసైనికుల ఆగ్రహానికి కారణమైంది. పైగా ‘చెప్పను బ్రదర్’ సంఘటన నుంచి పవన్ కళ్యాణ్ అభిమానులకు, అల్లు అర్జున్ బ్రాండ్‌కు మధ్య కొంత గ్యాప్ ఉంటూనే వస్తోంది.
‘జెన్ జీ’ (Gen Z) వేవ్ – అల్లు అర్జున్ పొలిటికల్ గేమ్ ప్లాన్..
ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తే, అల్లు అర్జున్ తన సొంత బ్రాండ్‌ను ఒక రాజకీయ శక్తిగా మార్చే దిశగానే పావులు కదుపుతున్నారా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. దీనికి తోడు ఇటీవల ఢిల్లీలో చోటుచేసుకున్న ‘కాక్రోచ్ ఉద్యమం’ (Cockroach Movement) దేశ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. విద్యార్థులు, యువత సాధించిన ఆ ఉద్యమ విజయం ద్వారా ప్రస్తుత సమాజంలో, ఎన్నికల సమీకరణాల్లో ‘జెన్ జీ’ (Gen Z) ఓటర్ల ప్రాధాన్యత ఎంతటిదో స్పష్టమైంది.
అల్లు అర్జున్ అభిమానుల బేస్‌ను పరిశీలిస్తే అందులో అధిక శాతం ఈ ‘జెన్ జీ’ తరానికి చెందిన యువతే ఉన్నారు. సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉన్న బన్నీ, ఢిల్లీ ఉద్యమ నేపథ్యం నుంచి స్ఫూర్తి పొంది ఈ యువతరాన్ని ఒక తాటిపైకి తెచ్చి ఏపీ వేదికగా కొత్త రాజకీయ సంచలనాలకు నాంది పలుకుతారా? ఒకవేళ ఆయనే గనుక ఏపీని రాజకీయ కార్యక్షేత్రంగా ఎంచుకుంటే రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
- Harish Rao Farmhouse: అసైన్డ్ భూముల్లో ఫాం హౌస్ నిర్మించారు..అద్దంకి ఫైర్..హరీష్ రావు ఫాం హౌస్ భూముల్లో కాంగ్రెస్ నేతల ఫీల్డ్ విజిట్..
- Telangana Land Resurvey: భూముల రీ-సర్వేపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు.. భూముల సమగ్ర సర్వేకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి
- TIMS Hospital Theft: సనత్ నగర్ TIMS ఆసుపత్రిలో భారీ చోరీ.. 288 వైద్య పరికరాలు మాయం, సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు
- Singareni Workers Land Issue: సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్.. భూముల సమస్యపై ప్రభుత్వం కీలక నిర్ణయం, 45 రోజుల్లో పరిష్కారం
- Telangana Weather Alert: తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్, సెప్టెంబర్ 23 నుంచి మరింత వానలు (Telangana Heavy Rains)