భిన్సాలీ గొప్ప దర్శకుడు : అలియాభట్
Alia Bhatt
రణబీర్ కపూర్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన తర్వాత సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న ‘లవ్ అండ్ వార్’ చిత్రంలో అలియా భట్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో అలియా ఇంతకుముందెన్నడూ కనిపించని గ్లామరస్ లుక్‌లో మెరిసింది. ఈ సినిమాలో సంజయ్ లీలా భన్సాలీ తన గత చిత్రాలకు భిన్నమైన ఆధునిక ప్రపంచాన్ని చూపించబోతున్నారు. మేకర్స్ సోషల్ మీడియాలో అలియా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. విడుదలైన ఈ పోస్టర్‌లో అలియా స్లిట్ స్కర్ట్, ప్రత్యేకమైన హెడ్‌పీస్‌తో కుర్చీలో కూర్చుని కనిపించింది. ఆమె లుక్, స్టైలింగ్, హావభావాలు రెట్రో ఫీల్‌ను అందిస్తున్నాయి. ఈ పాత్రలో అలియా పూర్తిగా కొత్త అవతార్‌లో కనిపించనుందని పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లవ్ అండ్ వార్’లో రణబీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం 2027 జనవరి 21న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సంజయ్ లీల బన్సాలి అద్భుతమైన దర్శకుడని ఈ సందర్భంగా అలియా భట్ కొనియాడారు.
- Kaleshwaram Barrages Restoration: కాళేశ్వరం బ్యారేజీలకు నవంబర్‌లో పునరుద్ధరణ పనులు, 2027 వర్షా కాలానికి ముందే పూర్తి..మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి ప్రకటన
- Ambati Rambabu: నారా లోకేష్‌పై రౌడీషీట్ ఓపెన్ చేయాలి..డీఎస్సీ కేసులపై అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు..
- EC-SIR Row: ఎన్నికల సంఘంపై పెరుగుతున్న వివాదం.. సెప్టెంబర్ 30న INDIA బ్లాక్ కీలక సమావేశం..
- CP Sajjanar Dance Video: సజ్జనార్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్.. ది ప్యారడైజ్ సినిమాలోని ఆయా షేర్ పాటకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ చిందులు..
- Sircilla Public Meeting: సిరిసిల్లలో రేవంత్ రెడ్డి సభకు భారీ ఏర్పాట్లు.. సెప్టెంబర్ 30న కాంగ్రెస్ మెగా మీటింగ్