Faridabad Horror: అర నిమిషంలో 30 కత్తిపోట్లు.. స్కూలులోనే మహిళా టీచర్‌పై దాడి చేసిన కిరాతకుడు..
Teacher Attacked by Masked Man
Faridabad Horror: హర్యానాలోని ఫరీదాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. పాఠశాల ఆవరణలోనే ఓ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయినిపై యువకుడు కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడు. గతంలో తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిందనే కక్షతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో నమోదవడంతో దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేగింది.
ఫరీదాబాద్ సమీపంలోని సిక్రోనా గ్రామంలో ఉన్న సరస్వతి సీనియర్ సెకండరీ స్కూల్‌లో పనిచేస్తున్న 29 ఏళ్ల సంధ్య సోమవారం ఉదయం విధుల్లో ఉండగా ఈ ఘటన జరిగింది. ఆమెను కలవాలని చెప్పి పాఠశాల గేటు వద్దకు వచ్చిన ఓ యువకుడు, సిబ్బంది సమాచారం ఇవ్వడంతో బయటకు వచ్చిన సంధ్యపై ఒక్కసారిగా దాడికి దిగాడు.
సీసీటీవీ దృశ్యాల ప్రకారం, ముసుగు ధరించిన నిందితుడు సంధ్యను బలవంతంగా లాగి, కత్తితో ముఖం, మెడ, ఛాతీ, పొట్ట భాగాల్లో వరుసగా పలుమార్లు పొడిచాడు. కేవలం అర నిమిషంలోనే వరుస దాడులతో ఆమెను తీవ్రంగా గాయపరిచాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పాఠశాల నిర్వాహకుడిపై కూడా కత్తితో దాడి చేయడానికి యత్నించడంతో ఆయన వెనక్కి తగ్గాల్సి వచ్చింది. తీవ్ర రక్తస్రావంతో సంధ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, నిందితుడు ద్విచక్రవాహనంపై పరారయ్యాడు. ఈ ఘటనను చూసిన విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గాలింపు చేపట్టి, ఘటన జరిగిన రెండు గంటల్లోనే నిందితుడు అమిత్ (21)ను అరెస్టు చేశారు. విచారణలో అతడు నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, సంధ్యకు అమిత్‌తో రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అయితే ఆమె ఆసక్తి చూపకపోయినా అమిత్ నిరంతరం వెంటపడుతూ వేధించేవాడని, దీంతో సంధ్య ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అప్పట్లో పోలీసుల సమక్షంలో అమిత్ క్షమాపణ చెప్పడంతో ఆమె కేసును ఉపసంహరించుకున్నప్పటికీ, అదే విషయాన్ని మనసులో పెట్టుకుని ప్రతీకారంతో ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ ఘటన మహిళల భద్రత, వేధింపుల కేసుల్లో ముందస్తు రక్షణ చర్యల అవసరంపై మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. నిందితుడిపై హత్యతో పాటు ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
- Rahul Gandhi Video: అంతా గుర్తుంచుకుంటాం.. హైడ్రామా మధ్య రాహుల్, ప్రియాంకలను అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు..
- Dussehra 2026: నవరాత్రుల్లో అమ్మవారి 9 అవతారాలు.. శైలపుత్రి నుంచి సిద్ధిదాత్రి వరకు.. దసరా నాడు దుర్గాదేవి తొమ్మిది అవతారాల చరిత్ర ఇదే..
- Erravalli Lands: ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. సర్వే నంబర్ 325లో తెలంగాణ అమరవీరుల కాలనీ నిర్మాణానికి ఆదేశం..
- Bathukamma Celebrations 2026: బతుకమ్మ పండుగ తేదీలు.. అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 18 వరకు 9 రోజులు పాటు ఉత్సవాలు.. ఏ రోజు ఏ పేరుతో పిలుస్తారంటే..
- Telangana ACB Bribe Cases: అవినీతి సొమ్ముతో ఏసీబీకి అడ్డంగా దొరుకుతున్న అధికారులు.. రూ.4 లక్షల లంచంతో GHMC అధికారి, రూ.1 లక్ష కేసులో DMHO అరెస్ట్..