Andhra Pradesh: మందు కోసం డబ్బులు ఇవ్వలేదని వృద్ధుడిపై కత్తితో దాడి..షాకింగ్ వీడియో ఇదిగో..
Andhra pradesh Man Attacks Elderly Man With Knife After He Refuses to Give Money for Alcohol
Andhra pradesh: మద్యానికి బానిసై, మందు తాగడానికి డబ్బులు ఇవ్వలేదనే కోపంతో ఒక వృద్ధుడిపై కత్తితో దాడి చేసిన దారుణ సంఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. పొన్నూరు మండలం మామిళ్లపల్లి గ్రామానికి చెందిన దేవిరెడ్డి సాంబయ్య అనే వృద్ధుడిని, అదే గ్రామానికి చెందిన 70 ఏళ్ల శరాబంది అనే వ్యక్తి మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని అడిగాడు. అయితే సాంబయ్య డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో, ఆగ్రహానికి గురైన శరాబంది ఒక్కసారిగా కత్తితో ఆయనపై విచక్షణారహితంగా దాడి చేశాడు.
Andhra Pradesh: Man Attacks Elderly Man With Knife After He Refuses to Give Money for Alcohol
ఈ దాడిలో సాంబయ్య తీవ్రంగా గాయపడి రక్తోడుతూ కిందపడిపోయాడు. గమనించిన స్థానికులు, గ్రామస్తులు వెంటనే స్పందించి తీవ్రంగా గాయపడిన సాంబయ్యను చికిత్స నిమిత్తం పొన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
- Ames Meteorite Crater: ఉల్క దాడి 10 కోట్ల ఏళ్లు ఆలస్యంగా జరిగిందా.. Ames క్రేటర్‌పై శాస్త్రవేత్తల కొత్త అంచనా.. ఓక్లహామా ఉల్కాబిలంపై సంచలన పరిశోధన
- Bathukamma Secret: బతుకమ్మ పండుగలో దాగి ఉన్న అసలు సీక్రెట్ ఇదే.. పూల పండుగ వెనుక ఇంత పెద్ద కథ ఉందా?
- Boddemma Festival: బతుకమ్మకు ముందు వచ్చే బొడ్డెమ్మ పండుగ ప్రత్యేకత ఏంటి.. 7 రోజుల పాటు ఎందుకు జరుపుకుంటారు..
- CEC Gyanesh Kumar Row: CEC జ్ఞానేశ్ కుమార్‌ను సస్పెండ్ చేయాలన్న పిటిషన్లపై విచారణ.. కేంద్రం, ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు..
- Russia-Ukraine War: ఉక్రెయిన్‌లో భారత ఫార్మా ప్లాంట్‌పై రష్యా డ్రోన్ దాడి.. ఒకరు మృతి, రూ.400 కోట్లకు పైగా నష్టం..