Skip to content
బిజినెస్ వార్తలు

Gold Rate ప్రతి రోజు ఎందుకు మారుతుంది? ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి..

Prajapaksham 06 Jul 2026 0 నిమిషాల పఠనం బిజినెస్
Gold Rate ప్రతి రోజు ఎందుకు మారుతుంది? ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి..

Gold Rate ప్రతి రోజు ఎందుకు మారుతుంది? ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి.. (Image: X.com)

బంగారం ధరలు ప్రతిరోజు మారుతూ ఉంటాయి నిజానికి బంగారం ధరలను ప్రభావితం చేసే అంశాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలామంది బంగారం ధరలను ప్రభావితం చేసేది స్థానిక మార్కెట్ పరిస్థితులు బంగారు ఆభరణాల డిమాండ్ సప్లై అని అనుకుంటారు. కానీ అది పాక్షిక సత్యం మాత్రమే నిజానికి బంగారం ధరలు అంతర్జాతీయంగా నిర్ణయిస్తారు గ్లోబల్ మార్కెట్లో ధరలు పెరగడం లేదా తగ్గడం లాంటివి జరిగినట్లయితే దీని ప్రభావం బంగారం పైన నేరుగా పడుతుంది.

డాలర్ విలువ తో బంగారం సంబంధం ఇదే

ఎక్కువగా బంగారం ధరలను ప్రభావితం చేసేది డాలర్ మారకం రేటు అని చెప్పవచ్చు అమెరికన్ డాలర్ విలువ కనుక పెరిగినట్లయితే బంగారం ధర తగ్గుతుంది. ఎందుకంటే అమెరికన్ డాలర్ విలువ కనుక పెరిగితే అమెరికా ఫెడరల్ రిజర్వు జారీ చేసే బాండ్స్ విలువ పెరిగి దానిపై వచ్చే రాబడి కూడా పెరుగుతుంది. అప్పుడు ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను అమెరికా బాండ్స్ లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తారు. ఫలితంగా బంగారం నుంచి పెట్టుబడులు బయటకు తీసేందుకు ఆసక్తి చూపిస్తారు. దీంతో బంగారం డిమాండ్ తగ్గడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు తగ్గి వస్తాయి.

ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పుడు బంగారం ధర పెరుగుతుంది

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభాలు తలెత్తినప్పుడు ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను స్టాక్ మార్కెట్లనుంచి బాండ్ మార్కెట్ల నుంచి బయటకు తీస్తారు. అనంతరం సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారంలోనే పెట్టుబడి పెట్టేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. ఇలాంటి సందర్భాల్లో బంగారాన్ని ఒక సేఫ్ పెట్టుబడిగా భావిస్తారు. అప్పుడు బంగారంలో పెట్టుబడులు పెరుగుతాయి ఫలితంగా బంగారానికి డిమాండ్ ఏర్పడి బంగారం ధర పెరుగుతుంది.

సెంట్రల్ బ్యాంకులు రిజర్వ్ లు పెంచుకున్నప్పుడు..

ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సెంట్రల్ రిజర్వ్ బ్యాంకులు బంగారం నిల్వలను పెంచుకునేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటాయి. తమ డబ్బును బంగారం రూపంలోనే నిల్వ ఉంచుకునేందుకు సెంట్రల్ బ్యాంకులు ఎక్కువగా మొగ్గు చూపుతాయి దీని వెనక ప్రధాన కారణం అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని అడ్డుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు బ్యాంకులు బంగారంలో తమ పెట్టుబడులను పెంచేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ముఖ్యంగా చైనా, జర్మనీ, భారత్ వంటి దేశాలకు చెందిన సెంట్రల్ బ్యాంకులో బంగారం రిజర్వులను పెంచుకుంటున్నాయి. దీని వల్ల కూడా బంగారం ధర పెరుగుతుంది అని చెప్పవచ్చు.

బంగారం ధర ఎప్పుడు తగ్గుతుంది..

బంగారం ధరలు సాధారణంగా తగ్గడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ తగ్గినప్పుడు మాత్రమే ఈ పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లలో లాభాలు నమోదు అవుతున్నప్పుడు ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం నుంచి బయటకు తీసి స్టాక్ మార్కెట్లలో పెడుతుంటారు అప్పుడు కూడా బంగారం ధర తగ్గుతుంది. ఇక అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లు కనుక పెంచినట్లయితే బంగారం ధర తగ్గుతుంది. ఎందుకంటే ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తే అమెరికా ట్రెజరీ బాండ్ల పైన వచ్చే రాబడి పెరుగుతుంది ఫలితంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం నుంచి బయటకు తీస్తారు. దీంతో బంగారం ధర తగ్గుతుంది.

ట్యాగ్‌లు: Gold gold price