Weather Alert: ఏపీ వాతావరణం అలర్ట్.. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం.. APSDMA హెచ్చరిక..
Rains News
Weather Alert: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం రాత్రి పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. వాతావరణంలో వస్తున్న మార్పుల దృష్ట్యా ప్రజలు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు విపత్తుల నిర్వహణ సంస్థ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.
ముఖ్యంగా ఈ క్రింది ప్రాంతాలు మరియు వాటి పరిసరాల్లో పిడుగులు పడే తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది:
విజయనగరం
ఎస్ కోట (శృంగవరపుకోట)
భీమునిపట్నం (భీమిలి)
కొత్తవలస
భోగాపురం
ఆనందపురం
సబ్బవరం
అనకాపల్లి
ఎల్లో అలర్ట్ – చెదురుమదురు వర్షాలు: పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు (ASR) జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ మన్యం జిల్లాల్లో అక్కడక్కడ చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున వర్షం పడుతున్న సమయంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు, వ్యవసాయ కూలీలు మరియు పశువుల కాపరులు బయట పొలాల్లో, చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడకూడదని, సురక్షితమైన ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని విపత్తుల నిర్వహణ సంస్థ విజ్ఞప్తి చేసింది.