Skip to content
ప్రపంచం › వార్తలు

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో వామపక్షాల విజయాలు

Prajapaksham 10 Nov 2026 1 నిమిషాల పఠనం ప్రపంచం
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో వామపక్షాల విజయాలు

US Elections: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో 57 మంది భారతీయ అమెరికన్లు.. కీలక పదవుల కోసం పోటీ!

అమెరికా మిడ్‌టర్మ్‌ ఎన్నికల ఫలితాలు కేవలం డెమొక్రాట్లకు మాత్రమే మంచి వార్తగా భావించవద్దు. ఫెడరల్‌, రాష్ట్ర స్థాయిలలో ఈ డెమొక్రాటిక్‌ మెజారిటీల మధ్య పనిచేస్తున్న వామపక్షాలకు, గత పదేళ్లుగా క్షేత్రస్థాయి నుంచి నిశ్శబ్దంగా నిర్మించుకుంటూ వస్తున్న తమ రాజకీయ ప్రాధాన్యతలను మాటల నుంచి ఆచరణలోకి మార్చుకోవడానికి ఇదొక చారిత్రాత్మక అవకాశం అయింది.


ఇది ఫెడరల్‌ స్థాయిలో కూడా వర్తిస్తుంది. ట్రంప్‌కు వైట్‌హౌజ్‌లో మరో రెండేళ్ల పదవీకాలం ఉంది. ఆయన చేసిన అనేక అక్రమాలు, దుర్వినియోగ రికార్డులపై ఈ కాలంలో పట్టు సాధించేందుకు డెమొక్రాట్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ, ఏదైనా వాస్తవంగా సాధించవచ్చనేంత అతి స్వల్ప ఆశ కూడా ఉంది. డెమొక్రాట్లతో కలిసి పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని, ‘కేవలం రెండేళ్లపాటు ప్రతిదానిని వీటో చేస్తూ కూర్చోవాలని అనుకోవడం లేదు’ అని ట్రంప్‌ ఫలితాల తరువాత పొలిటికో పత్రికకు ఫోన్‌ చేసి మరీ స్పష్టం చేశారు. గతంలో ట్రంప్‌ వైట్‌హౌస్‌లో ఉన్నప్పుడు, డెమొక్రాటిక్‌ (డెమొక్రాట్‌ల అధిక్యత కలిగిన) కాంగ్రెస్‌తో కలిసి పనిచేసిన సమయంలోనే (కరోనా కాలం) అమెరికా లో దశాబ్దాల కాలంలోనే అతిపెద్ద సంక్షేమ రాజ్య విస్తరణ జరిగింది. ఇప్పుడు కూడా అటువంటి అవకాశాలు ఆవిర్భవించవచ్చు. వసతులు, ప్రస్తుతం ఆయన ఒక చారిత్రాత్మక వైఫల్యంగా ముగిసే ప్రమాదం ఉండటం వంటివి మెరుగైన ఫలితాలు రావడానికి కనీసం కొంత అవకాశాన్ని కల్పిస్తున్నాయి.


వామపక్షాలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలవు. ఈ కొత్త కాంగ్రెస్‌లోకి వామపక్షాలు దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేనంత బలమైన సంఖ్యతో ప్రవేశించనున్నాయి. డెమొక్రాటిక్‌ సోషలిస్ట్స్‌ ఆఫ్‌ అమెరికా (డిఎస్‌ఎ) నుండి కనీసం ఏడుగురు సభ్యులు ఎన్నికయ్యారు. ఇది కాంగ్రెస్‌లో మొదటిసారిగా ఒక ప్రత్యేక సోషలిస్ట్‌ కాకస్‌ (బృందం)ను ఏర్పాటు చేయడానికి చారిత్రాత్మక అవకాశాన్ని కల్పిస్తుంది. అంతేకాకుండా ‘ది స్క్వాడ్‌’ తరహాలో 20 మంది వరకు సభ్యులు ఉండే ఒక ప్రగతిశీల ‘బా ్లక్‌’ (కూటమి) ఏర్పడే అవకాశం ఉంది.
2020 నాటి ఉదారమైన కోవిడ్‌ మహమ్మారి విధానాలలో, ట్రంప్‌, ఆ తర్వాత జో బైడెన్‌ ఇద్దరి ఉద్దీపన ఉపశమనాలు కూడా సోషలిస్ట్‌, ప్రగతిశీల కాంగ్రెస్‌ సభ్యుల బహిరంగ డిమాండ్ల ద్వారానే రూపుదిద్దుకున్నాయి. ఆ తర్వాత స్పష్టమైన ప్రజా అవసరం, ప్రజాదరణ ఆధారం గా అవి చట్టాలలోకి మారాయి.


మధ్యేవాద డెమొక్రాట్లు సైతం రాజకీయాల గురించి మాట్లాడే విధంగా సోషలిస్టులు ఇప్పటికే పరిస్థితులను మార్చిన ఒక ప్రపంచంలో ఈసారి వామపక్షాలు తమ వాదనలను వినిపించబోతున్నాయి. న్యూయార్క్‌ సోషలిస్ట్‌ మేయర్‌ జోహ్రాన్‌ మామ్డానీ, సోషలిస్టు ద్వయం సాండర్స్‌, అలెగ్జాండ్రియా ఒకాసియో- (AOC) వంటి సోషలిస్టులు ‘ఫైటింగ్‌ ఒలిగార్కీ’ని (ధనస్వామ్యంపై పోరు) ప్రాచుర్యంలోకి తీసుకువచ్చినందున, బిలియనీర్‌- వ్యతిరేక వాదనల వైపు మొగ్గు అవకాశం ఉంది. దీర్ఘకాలిక ‘నియమాలు’, ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి ఏడాదిగా డెమొక్రాటిక్‌ పార్టీ ఆరాటం చాలావరకు వెనకబడిపోయింది.


అంతేకాకుండా, మిడ్‌ టర్మ్‌ ఎన్నికలో లభించిన అనేక ప్రధాన విజయాల ద్వారా, వామపక్షాల మౌలిక వాదనలను పక్కన పెట్టడానికి, ప్రాధాన్యత తగ్గించడానికి ఉపయోగించిన వాదనలను వామపక్షాలు పూర్తిగా
తిప్పికొట్టగలిగాయి.


మిచిగన్‌ సెనేట్‌ ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్థి మైక్‌ రోజర్స్‌పై అబ్దుల్‌ ఎల్‌- సయేద్‌ ఏకంగా 7 శాతం ఓట్ల భారీ మెజారిటీతో సాధించిన విజయం కంటే పెద్ద వామపక్ష విజయం ఏదీ లేదు. మే నెలలో తాను ఇచ్చిన మాట ప్రకారమే ఎల్‌- సయేద్‌ ఈ భారీ మెజారిటీని సాధించారు. ఆయన దారుణంగా విఫలమవుతారంటూ చేసిన అంతులేని అంచనాలను తిప్పికొట్టారు.


ఈ ఏడాది ఈ పర్పుల్‌ స్టేట్‌ (స్వింగ్‌ స్టేట్‌) సెనేట్‌ స్థానం కోసం జరిగినంత కీలక పోరు మరొకటి లేదు. బ్లూ స్ట్రాంగ్‌ హోల్డ్‌ (బలమైన డెమొక్రాటిక్‌ స్థానాల) వెలుపల కూడా ప్రగతిశీలవాదులు పోటీ చేసి గెలవగలరని నిరుపించాలని వామపక్షాలు భావించాయి.


ఇది మాగా వైఫల్యానికి ప్రతీక. ముఖ్యంగా, రెండుసార్లు ఓడిపోయిన, జీవితాంతం యుద్ధాలను ప్రోత్సహించిన మైక్‌ రోజర్స్‌కు ఇది పరాభవం. అమెరికన్‌ ఇజ్రాయెల్‌ పబ్లిక్‌ అఫైర్స్‌ కమిటీ (ఎఐపిఎసి), ఇజ్రాయెల్‌ అనుకూల లాబీకి ఇది ఒక పెద్ద విపత్తు. వీరు ప్రైమరీ, జనరల్‌ ఎన్నికల సమయంలో ఎల్‌- సయేద్‌ను ఓడించడానికి కోట్లాది డాలర్లు ఖర్చు చేశారు. ఆయనను అప్రతిష్టపాలు చేయడానికి, ఓటర్లలో ముఖ్యంగా యూదు ఓటర్లలో ఆయనపై భయాన్ని నింపడానికి సర్వశక్తులూ ఒడ్డారు.


సోషలిస్టు భావాలు కలిగిన స్వతంత్ర సెనేటర్‌ బెర్నీ సాండర్స్‌ మద్దతు పలికిన 20 మంది అభ్యర్థులలో 18 మంది ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. కేవలం ఇద్దరు మాత్రమే ఓడిపోయారు. డిఎస్‌ఎ లేదా జస్టిస్‌ డెమొక్రాట్స్‌ వంటి సంస్థల మాదిరిగా సాండర్స్‌ ప్రతిపాదనలు ప్రత్యక్షంగా వామపక్ష భావజాలం తో కూడినవి కావు. వాటిలో ఎల్‌ -సయేద్‌, జాక్సన్‌ వంటి అభ్యర్థులతో పాటు, తమ ప్రైమరీలలో కార్పొరేట్‌ అనుకూల ప్రత్యర్థులను ఓడించిన మినెసోటా సెనేటర్‌- ఎలెక్ట్‌ పెగ్‌ ఫ్లాగన్‌ వంటి అధికార పార్టీ అభ్యర్థులు కూడా ఉన్నారు. న్యూయార్క్‌ నగరానికి చెందిన క్లైర్‌ వాల్డెజ్‌, కొలరాడోకు చెందిన మేలాట్‌ కిరోస్‌ వంటి డిఎస్‌ఎ అభ్యర్థుల నుంచి.. దశాబ్దాల పాటు డెమొక్రాట్ల ఆధ్వర్యంలో ఉన్న, ట్రంప్‌కు ఓటు వేసిన గ్రామీణ విస్కాన్సిన్‌ జిల్లాను గెలుచుకున్న రెబెక్కా కుక్‌ వంటి ఒక మోస్తరు ప్రగతిశీల అభ్యర్థుల వరకు అందరూ వీరిలో ఉన్నారు.


సన్‌రైజ్‌ మూవ్‌మెంట్‌ సహ వ్యవస్థాపకుడు విలియం లారెన్స్‌ కూడా వీరిలో ఉన్నారు. మిషిగన్‌ స్వింగ్‌ స్టేట్‌లోని ఒక స్వింగ్‌ స్థానాన్ని ఆయన కైవసం చేసుకున్నారు. డెమొక్రాటిక్‌ అభ్యర్థులలో బలమైన వామపక్ష వ్యక్తిగా ముద్ర ఉన్న ఎల్‌ సయేద్‌పై ముద్ర ఉన్నప్పటికీ (వామపక్ష ముద్ర ఆయనను కచ్చితంగా ఓడిపోయేలా చేస్తుందని చెప్పినప్పటికీ), ఆయన విజయం సాధించారు. శిలాజ ఇంధన పరిశ్రమను జాతీయం చేయాలని కోరిన పాత ట్వీట్‌ల కారణంగా లారెన్స్‌ ప్రచారం మధ్యలో డిఎస్‌ఎ నుండి వైదొలగాల్సి వచ్చింది. అయినప్పటికీ ఆయన విజ యం సాధించారు. డేటా సెంటర్‌ మారటోరియం (డేటా సెంటర్‌పై తాత్కాలిక నిషేధం), మెడికేర్‌ ఫర్‌ ఆల్‌ (అందరికీ ఆరోగ్య రక్షణ) వంటి ప్రగతిశీల జనాకర్షక ప్రచార విధానాలపై ఆధారపడి, డెమొక్రాట్ల సెంట్రిజం (మధ్యేవాద రాజకీయాల) ప్రసిద్ధ నిపుణుడు, సిఐఎ మాజీ విశ్లేషకుడు ఎలిస్సా స్లాట్కిన్‌ ప్రాతినిధ్యం వహించిన పర్పుల్‌ జిల్లాను లారెన్స్‌ గెలుచుకున్నారు.


రాష్ట్ర శాసనసభలు, నగర కౌన్సిళ్లు, మేయర్‌ పదవులు, బ్యాలెట్‌ మెజారిటీల వరకు అన్ని విభాగాలలోనూ డిఎస్‌ఎ మొత్తం 130 విజయాలను నమోదు చేసింది. వ్యాసం రాసే సమయానికి 42 స్థానాల్లో ఓటమి చవిచూడగా, 58 స్థానాల్లో ఫలితాలు రావాల్సి ఉంది. ఆంజీ నిక్సన్‌ తన సెనేట్‌ రేసులో వెనుకబడినప్పటికీ, పర్యావరణవేత్త ఆష్లే హెర్మాన్‌ ఫ్లోరిడాలో ఎన్నికైన రెండవ సోషలిస్టుగా, గత శతాబ్ద కాలంలో ఆ రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన తొలి సోషలిస్టుగా చరిత్ర సృష్టించారు. రెండేళ్ల క్రితం రిపబ్లికన్‌ అభ్యర్థి 58 శాతం ఓట్లతో గెలిచిన స్వింగ్‌ జిల్లాను ఆమె కైవసం చేసుకున్నారు. కెంటకీ రాష్ట్ర అసెంబ్లీకి రాబర్ట్‌ లెవెర్టిస్‌ బెల్‌ ఎన్నిక కావడం, జార్జియా జనరల్‌ అసెంబ్లీకి మాథెవోస్‌ సాంసన్‌ ఎన్నిక కావడం (గాబ్రియెల్‌ సాంచెజ్‌ పునర్నియామకం తోపాటు) ఇతర ప్రముఖ సోషలిస్ట్‌ విజయాలు.


ప్రాథమిక ఎన్నికల (ప్రైమరీలు) తర్వాత అనివార్యమైన ఫలితాలుగా మారిన అనేక మేయర్‌ ఎన్నికలు కూడా విశేషమైనవి. జనీస్‌ లూయిస్‌ జార్జ్‌ ఇప్పుడు వాషింగ్టన్‌ డి.సి.కి మొదటి సోషలిస్ట్‌ మేయర్‌గా అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అఫోర్డబుల్‌ హౌసింగ్‌ ప్లాన్‌ (చౌక గృహనిర్మాణ ప్రణాళిక), అద్దె స్థిరీకరణను విస్తరించడం వంటి అంశాలపై ప్రచారం చేసి ఆమె విజయం సాధించారు. రోడ్‌ ఐలాండ్‌లోని ప్రొవిడెన్స్‌లో సోషలిస్ట్‌ డేవిడ్‌ మోరల్స్‌ ఘనవిజయం సాధించారు. గృహనిర్మాణ సంక్షోభంతో అల్లాడిపోతున్న ఆ నగరంలో సోషలిస్ట్‌ నేతృత్వంలోని సిటీ కౌన్సిల్‌తో కలిసి ఆయన కఠినమైన అద్దె నియంత్రణ చర్యలను అమలు చేయనున్నారు. గృహనిర్మాణ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఈ చర్యను తీసుకురాగా, గతంలో ఆయనపై గెలిచిన సిట్టింగ్‌ మేయర్‌ దీనిని వీటో చేశారు.


లాస్‌ ఏంజిల్స్‌ మేయర్‌ రేసు మరింత సంక్లిష్టమైనది. ఇక్కడ సోషలిస్ట్‌ సిటీ కౌన్సిలర్‌ నిత్యా రామన్‌, కరెన్‌ బాస్‌ను ఓడించే దిశగా దూసుకుపోయారు. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ‘బాయ్‌కాట్‌, డైవెస్ట్మెంట్‌, అండ్‌ శాంక్షన్స్‌’ (బిడిఎస్‌) ఉద్యమాన్ని పూర్తిగా సమర్థించనందుకు, దానిపై ప్రశ్నించనందుకు స్థానిక డిఎస్‌ఎ చాప్టర్‌ ఆమెకు మద్దతు ఇవ్వడం కొంత వివాదాస్పదమైంది. దీనివల్ల డిఎస్‌ఎ జాతీయ రాజకీయ కమిటీ ఆమెకు మద్దతును దాదాపు రద్దు చేయాలని చూసింది. అయితే కేవలం ఒక్క ఓటు తేడాతో ఆ ప్రయత్నం వీగిపోయింది. ఈ ఎన్నికలో లాస్‌ ఏంజిల్స్‌ మేయర్‌గా 21 ఏళ్ల నిత్యా రామన్‌ మొదటిసారిగా సిట్టింగ్‌ మేయర్‌ను ఓడించి రికార్డు సృష్టించారు.


దేశవ్యాప్తంగా ఓటర్ల మెజారిటీ మద్దతుతో ఆమోదించిన అనేక ప్రగతిశీల బ్యాలెట్‌ చర్యలు కూడా దీనికి తోడయ్యాయి. మిస్సౌరీలో గర్భవిచ్ఛితి నిషేధ బ్యాలెట్‌ మెజారిటీ తిరస్కరణ, మోంటానాలో ఎన్నికలలో డార్క్‌ మనీపై విజయవంతమైన నిషేధం, ప్రొవిడెన్స్‌లో ఇజ్రాయెల్‌ నుండి పెట్టుబడులను ఉపసంహరించుకోవడం ఇందుకు ఉదాహరణలు. బహుశా అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, డేటా సెంటర్‌ల నిర్మాణాన్ని పరిమితం చేసే బ్యాలెట్‌ చర్యలు ఇప్పటివరకు దేశవ్యాప్తంగాకి ఒక చోట మినహా 41 చోట్ల విజయం సాధించాయి. ఇది విస్తృతంగా వామపక్షాలు ప్రతిపాదించి, ప్రాచుర్యంలోకి తెచ్చిన వైఖరికి దక్కిన స్పష్టమైన ప్రజా ఆమోదం.
గత దశాబ్ద కాలంగా, డెమొక్రాటిక్‌ పార్టీ ఎదురుదెబ్బలు తిన్నప్పుడు కూడా సోషలిస్టులు, ప్రగతిశీలవాదులు మంచి ఎన్నికల ఫలితాలను సాధించారు.

అలాగే డెమొక్రాట్లు సంబరాలు చేసుకున్నప్పుడు వీరు ఇబ్బందులు పడ్డారు. కానీ తాజా ఎన్నికల్లో వామపక్షాలు, మధ్యేవాద పార్టీ రెండూ ఏకకాలంలో చారిత్రాత్మక విజయాలను చవిచూడటం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. గత రెండేళ్లలో, ట్రంప్‌ మితవాద దాడికి వ్యతిరేకంగా, అలాగే దాన్ని ఎదుర్కోవడానికి ‘ స్థోమత కోసం, అపార సంపదకు వ్యతిరేకంగా పోరాటం’ అనే సమర్థవంతమైన వాదనను రూపొందించడానికి వామపక్షాలే అత్యంత ఇష్టపడే శక్తి అని నిరూపించబడ్డాయి. వామపక్ష విధానాలు, నినాదాలు డెమొక్రాటిక్‌ ఓటర్లకు ఎన్నికలలో భారంగా మారుతాయని దశాబ్దాలుగా చెప్పిన మాటలు అబద్ధమని నిన్నటి రాత్రి రుజువు చేసింది. దశాబ్దాలుగా డెమొక్రాటిక్‌ ఓటర్లు ప్రతి ఎన్నికలలో తమ మస్తిష్కం, హృదయం మధ్య ఏదో ఒకదానిని ఎంచుకోవాల్సిన బాధాకరమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. వామపక్షాలు బహుశా వారిని ఆ సందిగ్ధత నుండి విముక్తం చేసి ఉండవచ్చు.


(సౌజన్యం : జాకోబిన్‌)

ట్యాగ్‌లు: international news