Skip to content
తెలంగాణ › వార్తలు

Graduate MLC Elections: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సీపీఐ మద్దతు.. అధికారికంగా వెల్లడించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు..

jagan 04 Nov 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Graduate MLC Elections: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సీపీఐ మద్దతు.. అధికారికంగా వెల్లడించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు..

Kunam neni

Graduate MLC Elections: తెలంగాణలో రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని సీపీఐ నిర్ణయించినట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వెల్లడించారు. వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న రాంరెడ్డి సర్వోత్తమరెడ్డికి, హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న రామ్‌మోహన్‌రెడ్డికి సీపీఐ మద్దతు ప్రకటించింది.

కాంగ్రెస్ నాయకులు తమ పార్టీ కార్యాలయానికి వచ్చి మద్దతు కోరారని కూనంనేని తెలిపారు. పార్టీ అంతర్గత చర్చలు, రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను సమీక్షించిన అనంతరం కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న సీపీఐ ఈ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు.