President Droupadi Murmu: ఎన్నికల అక్రమాలకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలని రాష్ట్రపతి కోరారు – రాహుల్ గాంధీ..
President Droupadi Murmu: ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ భారత ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారని మేం స్పష్టంగా చెప్పాం. మేం చేసిన వ్యాఖ్యలను రాష్ట్రపతి ఖండించలేదు, ప్రశ్నించలేదు, వాటిపై వాదించలేదు. మేం చెప్పిన విషయాలను ఆమె స్వీకరించారు. అనంతరం ఎన్నికల మోసానికి సంబంధించిన ఆధారాలను సమర్పించాలని కోరారు” అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
Opposition MPs submit memorandum to President Droupadi Murmu: శుక్రవారం ఇండియా కూటమి నేతలతో కూడిన 10 మంది ప్రతినిధి బృందం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును రాష్ట్రపతి భవన్‌లో కలిసింది. ఓటర్ల జాబితాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించేలా జోక్యం చేసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించింది.
ఈ సమావేశానికి ముందు ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్ భవనం నుంచి రాష్ట్రపతి భవన్ వైపు ర్యాలీగా బయలుదేరారు. విజయ్ చౌక్ వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. పలువురు ప్రతిపక్ష నేతలు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం 10 మంది సభ్యులతో కూడిన ప్రతినిధి బృందం రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం అందజేసింది. దాదాపు గంటపాటు ఈ సమావేశం కొనసాగింది.
సమావేశం అనంతరం లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఎన్నికల మోసానికి సంబంధించిన తమ ఆరోపణలను రాష్ట్రపతి ఖండించకపోవడం, వాటిపై ప్రశ్నలు లేవనెత్తకపోవడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. ఎన్నికల అక్రమాలకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలని రాష్ట్రపతి కోరారని, ఈ అంశాన్ని పరిశీలిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు.
“ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ భారత ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారని మేం స్పష్టంగా చెప్పాం. మేం చేసిన వ్యాఖ్యలను రాష్ట్రపతి ఖండించలేదు, ప్రశ్నించలేదు, వాటిపై వాదించలేదు. మేం చెప్పిన విషయాలను ఆమె స్వీకరించారు. అనంతరం ఎన్నికల మోసానికి సంబంధించిన ఆధారాలను సమర్పించాలని కోరారు” అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.