Skip to content
జాతీయం వార్తలు

CEC Resignation Demand: సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ 48 గంటల్లో రాజీనామా చేయాలి.. రాజీనామా చేయకపోతే దేశవ్యాప్త ఆందోళన చేపడతామని తెలిపిన CJP

jagan 24 Sep 2026 1 నిమిషాల పఠనం జాతీయం
CEC Resignation Demand: సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ 48 గంటల్లో రాజీనామా చేయాలి.. రాజీనామా చేయకపోతే దేశవ్యాప్త ఆందోళన చేపడతామని తెలిపిన CJP

CJP

CEC Resignation Demand: కేంద్ర ఎన్నికల సంఘం (ECI)లో తీవ్ర విభేదాలు బయటపడ్డాయంటూ జాతీయ మీడియాలో కథనాలు వెలువడిన నేపథ్యంలో భారత రాజకీయాల్లో అలజడి రేగింది. ఈ క్రమంలో దేశ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) డిమాండ్ చేసింది. ఆయనకు 48 గంటల సమయం ఇస్తున్నామని, ఆలోగా రాజీనామా చేయకపోతే దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టడంతో పాటు ఢిల్లీలో నిరవధిక నిరాహార దీక్షకు దిగుతామని సిజేపి వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా న్యూఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అభిజీత్ దీప్కే మాట్లాడుతూ.. CEC జ్ఞానేశ్ కుమార్‌పై సంచలన ఆరోపణలు చేశారు. జ్ఞానేశ్ కుమార్ భారత ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పుగా పరిణమించారని, ఆయన్ను దేశంలోనే అతిపెద్ద జాతి వ్యతిరేకిగా వర్ణించారు.

వివాదం నేపథ్యం, ఆరోపణలు:

సహ-కమిషనర్ల అభ్యంతరాలు: గడిచిన 10 నెలల్లో ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషీలు పూర్తి స్థాయి ఎన్నికల కమిషన్ పేరిట ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలపై కనీసం 14 సార్లు రాతపూర్వకంగా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారని ప్రముఖ దినపత్రిక ఆరోపించింది. తమ అనుమతి లేకుండా తీసుకున్న పలు నిర్ణయాలు “అక్రమం, నిబంధనలకు విరుద్ధం” అని కమిషనర్లు పేర్కొన్నట్లు కథనంలో ఉంది.
కోట్లలో ఓట్ల తొలగింపు: జ్ఞానేశ్ కుమార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియ పేరిట దేశవ్యాప్తంగా సుమారు 13 కోట్ల ఓటర్ల పేర్లను తొలగించారని, ఇది మొత్తం ఓటర్లలో దాదాపు 13 నుంచి 14 శాతమని సీజేపీ ఆరోపించింది.
రాజకీయ కోణం: 2024 లోక్‌సభ ఎన్నికల్లో అధికార ఎన్డీయే, విపక్ష కూటమి మధ్య ఓట్ల వ్యత్యాసం కేవలం 2 శాతం మాత్రమేనని గుర్తుచేశారు. భారీ స్థాయిలో ప్రతిపక్ష ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఓట్లను డిలీట్ చేయడం ద్వారా ఆ 2 శాతం వ్యత్యాసాన్ని పెంచి ప్రభుత్వం గెలిచేలా ప్రణాళికలు రచిస్తున్నారని అభిజీత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఈ నేపథ్యంలో వెంటనే రాబోయే ఎన్నికల ప్రక్రియలను నిలిపివేసి, ఎస్‌ఐఆర్‌ (SIR)కు ముందు ఉన్న పాత ఓటర్ల జాబితాలను పునరుద్ధరించాలని, అలాగే ఈ అక్రమాలపై స్వతంత్ర విచారణ కమిషన్ వేయాలని సీజేపీ డిమాండ్ చేసింది.