భారతదేశ నినాదంగా మారిన‘బద్లావ్ జరూరీ హై’
భారతదేశ నినాదంగా మారిన‘బద్లావ్ జరూరీ హై’
రచయిత: డి. రాజా, సీపీఐ ప్రధాన కార్యదర్శి
సిపిఐ చేపట్టిన ‘బద్లావ్ జరూరీ హై’ ప్రచారోద్యమంలో భాగంగా జరిగిన భారీ సమీకరణ ఒక విషయాన్ని నిస్సందేహంగా స్పష్టం చేసింది. మార్పు కోసం పిలుపు ఇకపై రాజకీయ పార్టీలకు లేదా పార్లమెంటరీ చర్చలకు మాత్రమే పరిమితం కాబోదు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, అభద్రత, అసమానతలు, ప్రజాస్వామ్య హక్కులపై దాడులు, క్రమపద్ధతి లో ప్రభుత్వ సంస్థలను బలహీనపర్చటం వంటి వాటి ని ఎదుర్కొంటున్న లక్షలాది మంది భారతీయుల ప్ర అనుభవాల నుండి ఇది ఉద్భవిస్తోంది.
రాంలీలా మైదాన్‌లో సెప్టెంబర్ 1న జరిగిన ర్యాలీ ఆ భావనకు ఒక శక్తిమంతమైన వ్యక్తీకరణ. కార్మికు రైతులు, మహిళలు, విద్యార్థులు, యువత, వివి రాష్ట్రాల ప్రజల భాగస్వామ్యం భారత కమ్యూనిస్టు పార్టీ నిర్మాణ బలాన్ని మాత్రమే కాకుండా, ప్రజల పోరాటాలలో పాతుకుపోయిన రాజకీయాల నిరంత ర ప్రాసంగికతను కూడా ప్రదర్శించింది. ఈ సమీకరణను విడిగా చోటు చేసుకున్న సంఘటనగా కాకుం ఒక పెద్ద రాజకీయ జోక్యానికి నాందిగా అర్థం చేసుకోవాలి.
అవసరం. ఎందుకంటే, అసమానతలను సృష్టించే వ్యవస్థలు మరింత బలంగా పాతుకుపోయాయి. భారతదేశ సంక్షోభం కేవలం పేలవమైన పరిపాలన లేదా పరిపాలనా వైఫల్యానికి సంబంధించినది కాదు. దీని మూలాలు వర్గం, కులం, పితృస్వామ్యంలో లోతుగా వేళ్ళూనుకొని ఉన్నాయి. గత దశాబ్ద కాలంలో అనుసరించిన ఆర్థిక విధానాలు కార్పొరేట్ కేంద్రీకరణను బలోపేతం చేసి, కార్మిక రక్షణలను బలహీనపరిచి, అధిక ఆర్థిక నష్టభయాలను కార్మికులు, సాధారణ కుటుంబాలపైకి బదలాయించాయి.
ప్రైవేటీకరణ, వ్యాపారీకరణ విధానాలు విద్య, ఆరోగ్య సంరక్షణ, ఇతర నిత్యావసర వస్తువుల కొనుగోలు శక్తిపై ప్రభావం చూపాయి. సంక్షేమ రాజ్యం అ భావన భారత రాజ్యాంగ చట్రానికి కొత్తేమీ కాదు. ఇది ప్రభుత్వ విధాన ఆదేశిక సూత్రాలలో స్పష్టంగా వ్యక్తీకరించబడింది. ఇతర విషయాలతో పాటు, ‘పౌరులకు స్త్రీ, పురుషులకు సమానంగా, తగిన జీవనోపాధి హక్కు’ ఉండే విధంగా చూడాలని ఆర్టికల్ 39 ప్రభుత్వాన్ని నిర్దేశిస్తుంది. ఇది సామాన్య ప్రజల మే లు కోసం భౌతిక వనరుల పంపిణీకి పిలుపునిస్తుంది. సంపద, ఉత్పత్తి సాధనాల కేంద్రీకరణకు వ్యతిరేకం గా హెచ్చరిస్తుంది.
ఈ రాజ్యాంగ దార్శనికతకు, ఆర్‌ఎస్‌ఎస్ బిజెపి పాలనలో దేశం పయనిస్తున్న దిశ కు మధ్య దూరం అంతకంతకూ స్పష్టమవుతోంది. రాజ్యం క్షీణిస్తుండగా, ఆర్థిక అభద్రత పెరుగుతోంది. కాబట్టి, దేశం ముందున్న ప్రశ్న, కేవలం భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతోందా? లేదా? అనేది మాత్రమే కాదు. ఆ వృద్ధితో ఎవరు ప్రయోజ పొందుతున్నారు? దాని వ్యయాలను ఎవరు భరిస్తున్నారు? ఆ ఆర్థిక వ్యవస్థ సామాన్య ప్రజల శ్రేయస్సుకు ఉపయోగపడుతుందా, లేదా? అనేది కూడా.
సమానత్వానికి కులం మరో మౌలిక అవరోధంగా మిగిలిపోయింది. అది భూమి, విద్య, ఉపాధి, ఆత్మగౌరవం, సామాజిక అధికారం పొందే అవకాశాలను ప్రభావితం చేస్తూనే ఉంది. “మీరు ఎటు వైపు మళ్ళి నా, మీ దారికి అడ్డంగా వచ్చే రాక్షసి కులమే” అని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ నాడు చేసిన హెచ్చరిక నేటికీ బలంగా వర్తిస్తుంది. ఆర్థిక పరివర్తన గురించి చర్చిస్తున్నప్పుడు కులాన్ని ఒక ద్వితీయ సామాజిక సమస్యగా పరిగణించలేము. అది అవకాశాలను నిర్ణయిస్తుంది, సామాజిక హోదాను నిర్ధారిస్తుంది. తరతరాలుగా అసమానతలను పునరుత్పత్తి చేస్తుంది.
ఈ వ్యవస్థలతో పాటే పితృస్వామ్యం కూడా పనిచేస్తుంది. ఆర్థిక వ్యవస్థలో, ప్రజా జీవితంలో మహిళల భాగస్వామ్యం పరిమితంగానే ఉంది. వేతనం లేని శ్రమ విలువకు తక్కువ అంచనా కట్టడం, హిం వివక్ష కొనసాగుతూనే ఉన్నాయి. “ఒక సమాజం సాధించిన పురోగతిని, ఆ సమాజంలో మహిళలు సా పురోగతి స్థాయి ద్వారా నేను అంచనా వేస్తా ను” అని సామాజిక పురోగతికి అంబేడ్కర్ అంతే శక్తివంతమైన కొలమానాన్ని అందించారు. ఒక సమాజ జనాభాలో సగం మంది సమానత్వానికి సంబంధించిన వ్యవస్థాగత అడ్డంకులను ఎదుర్కొంటున్నప్పు డు, ఆ సమాజం అర్థవంతమైన పురోగతిని సాధించామని చెప్పుకోలేదు.
కార్మికుల హక్కుల కోసం చేసే పోరాటం కేవ ట్రేడ్ యూనియన్లకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. ఉపాధి కనుమరుగైనప్పుడు, వేతనాలు స్తంభించిపోయినప్పుడు, అసంఘటిత రం విస్తరించినప్పుడు, సామాజిక భద్రత బలహీనపడినప్పుడు, కార్మికులు, పెట్టుబడిదారుల మధ్య అధికార సమతుల్యత మౌలికంగానే మార్పుచెందుతుం ది. కార్మికులకు సామాజిక రక్షణ, కార్మిక హక్కుల కూడిన సురక్షితమైన, గౌరవప్రదమైన, తగినంత వేతనంతో కూడిన ఉపాధి అవసరం.
యువతకు, ఈ ప్రశ్న వారి భవిష్యత్తుతో విడదీయరానిది. లక్షలాది మంది భద్రత కరువైన ఉద్యోగాలు, నియామకాలలో జాప్యం, పత్రాల లీకేజీ, అనిశ్చిత భవిష్యత్తును ఎదుర్కొంటున్నారు. యువ భారతీయులకు గౌరవప్రదమైన పని దొరకకపోతే, జనాభా బలంతో ప్రయోజనం లేదు. గ్రామీణ, పట్టణ కార్మికులిద్దరికీ అర్థవంతమైన ఉపాధి హామీతో సహా, ఉపాధిని ఒక ప్రధాన ప్రజాస్వామ్య, సామాజిక డిమాండ్‌గా మా ర్చేందుకు సిపిఐ, దాని ప్రజా సంఘాలు తమ పోరాటాన్ని తీవ్రతరం చేయాలి.
రైతులు, వ్యవసాయ కార్మికుల పోరాటానికి కూడా ఇదే విధానం మార్గదర్శకంగా ఉండాలి. పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు, సరిపోని ఆదాయాలు, రుణభారం, ఆర్థిక అభద్రత, గ్రామీణ భారతదేశ జీవనోపాధికి ముప్పుగా పరిణమించాయి. లాభదాయకమైన ధరలు, కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)కి చట్టపరమైన గ్యారంటీ, బలమైన ప్రభుత్వ పెట్టుబడుల కోసం డిమాండ్ కేవలం వ్యవసాయ రంగ డిమాండ్ మాత్రమే కాదు. ఇది గ్రామీణ భారతదేశ పునరుద్ధరణ కోసం డిమాండ్.
విద్య, ఆరోగ్య సంరక్షణలను ప్రభుత్వ బాధ్యతలుగా తిరిగి స్వీకరించాలి. విద్య ఖ ర్చు నానాటికీ పెరుగుతున్నప్పుడు, వంశపారంపర్యంగా వచ్చే ప్రత్యేక హక్కులు బలపడతాయి. సా మాజిక చలనశీలత బలహీనపడుతుంది. అనారోగ్యం కుటుంబాలను అప్పుల్లోకి నెట్టి వేసినప్పుడు, ఆరోగ్య సంరక్షణ అనేది ఏ అర్థవంతమైన కోణంలోనూ ప్ర జా హక్కుగా ఉండదు. కాబట్ట్లి, బలమైన ప్రభుత్వ వి ద్య, సార్వత్రిక ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణల పరిరక్షణ, విస్తరణ ప్రత్యామ్నాయానికి కేంద్రకంగా ఉం
విముక్తిని కూడా అంతే గంభీరంగా ప రిగణించాలి. ఆర్థిక స్వాతంత్య్రం, సమాన వేతనాలు, సురక్షితమైన ఉపాధి, రాజకీయ ప్రాతినిధ్యం, హింస నుంచి స్వేచ్ఛ, సామాజిక జీవితంలో పూర్తి సమానత్వాన్ని వాయిదా వేయలేము. ఆంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్యకర్తలు వంటి వారు ముఖ్యమైన ప్రజా విధులను నిర్వర్తిస్తారు. గౌరవం, వేతనం, సామాజిక రక్షణకు అర్హులు. సమాజ ప్రగతి కొలమానం ప్రకారం, భారతదేశ మహిళలు కేవలం అభివృద్ధిలో భాగం కావడమే కాకుండా, దాని దిశను నిర్దేశించడంలో సమాన భాగస్వాములుగా ఉండాలి.
మత విద్వేషాలు పదేపదే సృష్టించబడి, పెంచి పోషించబడుతూ తరుణంలో, భారతదేశ బహుళత్వాన్ని పరిరక్షించడమే ఒక రాజకీయ ప్రతిఘటన చర్య. కానీ మత సామరస్యాన్ని కేవలం నైతిక విజ్ఞప్తికి కుదించలేము. అది ప్రజలను ఏకం చేసే భౌతిక ప్రయోజనాలలో వేళ్ళూనుకొని ఉండాలి. ఒకే యజమానిని ఎదుర్కొంటున్న హిందూ, ముస్లిం కార్మికు లు, ఒకే రకమైన వ్యవసాయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సిక్కు, హిందూ రైతులు, విద్యలో ఒకే రకమైన ప్రైవేటీకరణను ఎదుర్కొంటున్న దళిత, ఒబిసి విద్యార్థులు, పితృస్వామ్య హింసను ఎదుర్కొంటున్న వివిధ వర్గాల మహిళలకు, వారి విభజన కారణంగా లబ్ధి పొందే శక్తుల కన్నా, ఒకరితో ఒకరికి చాలా ఎక్కువ సారూప్యతలు ఉన్నాయి.
1నాటి జన సమీకరణ రాజకీయ బలాన్ని ప్రదర్శించింది. ఆ బలాన్ని మార్పు కోసం సాగే నిరంతర పోరాటంగా మలచడమే ప్రస్తుతం మన ముందున్న కర్తవ్యం. మధ్యలో లభించే సమయాన్ని ప్రజా సంఘాలను ని ప్రజా సంఘాలను బలోపేతం చేయడానికి, యువత, మహిళల కొత్త విభాగాలకు చేరువవడానికి, కార్మికులు, రైతులతో సంబంధాలను మరింతగా పెంపొందించుకోవడానికి, ఈ ఉద్యమాన్ని స్థానిక పోరాటాల్లోకి తీసుకువెళ్ళడానికి ఉపయోగించుకోవాలి.
‘బద్లావ్ జరూరీ హై’ అనేది ఒక ర్యాలీకి సంబంధించిన నినాదంగా మిగిలిపోకూడదు. అది ప్రజల దైనందిన జీవితాల్లో వేళ్ళూనుకొన్న ఒక నిరంతర రాజకీయ ఉద్యమంగా మారాలి. దేశానికి దిశ మా అవసరం అది ‘కార్పొరేట్ కేంద్రీకరణ నుంచి సామాజిక సంక్షేమం వైపు, అస్థిరమైన పని నుండి గౌరవప్రదమైన ఉపాధి వైపు, ప్రైవేటీకరణ నుంచి బలమైన ప్రభుత్వ సంస్థల వైపు, కుల వ్యవస్థ నుంచి సార్వత్రిక సామాజిక న్యాయం వైపు, పితృస్వామ్యం నుంచి సమానత్వం వైపు, మతపరమైన విభజన నుంచి సౌభ్రాతృత్వం వైపు, మితిమీరిన కేంద్రీకరణ నుంచి నిజమైన సమాఖ్య ప్రజాస్వామ్యం వైపు’ దిశ మారాలి.
అభివృద్ధిని డొల్ల నినాదాలతోనో, శీర్షికల్లోని గణాంకాలతోనో కాకుండా, తమకు ఉద్యోగాలు ఉన్నాయా, తమ కుటుంబాలను పోషించే స్థాయిలో తమ వేతనాలు ఉన్నాయా, తమ పిల్లలు నాణ్యమైన విద్యను పొందుతున్నారా, ఆరోగ్య సంరక్షణ అందుబాటులో ఉందా, రైతులు గౌరవంగా జీవించగలుగుతున్నారా, మహిళలు సమానంగా, సురక్షితంగా ఉన్నారా, కుల అణచివేతను సవాలు చేస్తున్నారా, అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించే స్వేచ్ఛ పౌరులకు ఉందా అనే విషయాల ఆధారంగా సామాన్య ప్రజలు అంచనా వే స్తారు. అదే ప్రగతికి నిజమైన కొలమానం. అదే ప్రజాస్వామ్యానికి నిజమైన పరీక్ష.
1వ తేదీన జరిగిన ర్యాలీ, మార్పు కోసం పిలుపు ప్రజలను సమీకరించగలదని నిరూపించింది. మన ఎదుట ఉన్న కర్తవ్యం మరింత కఠినమైనది, బృహత్తరమైనది. ఆ అసంతృప్తిని సంఘటితం చేయడం, ఆ పోరాటాలను ఏకం చేయడం, దేశాన్ని మార్చగల సామర్థ్యం ఉన్న ఒక రాజకీయ ప్రత్యామ్నాయాన్ని నిర్మించడం.